Akash system: భారతదేశ రక్షణ పరిశ్రమ ప్రతీ ఏడాది అభివృద్ధిని నమోదు చేస్తోంది. భారత ఆయుధ ఎగుమతులు కూడా గతంలో పోలిస్తే బాగా పెరిగాయి. ఆయుధ మార్కెట్లోకి భారత్ నెమ్మదిగా ఎంట్రీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ తయారు చేసిన పలు ఆయుధ వ్యవస్థలను కొనేందుకు ప్రపంచదేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి.
Pakistan YouTube Ban: పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌కు చెందిన యూట్యూబ్ ఛానెల్స్, సెలెబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలు అన్నింటినీ భారత దేశంలో బ్యాన్ చేసింది.
Quad: భారతదేశానికి అతిపెద్ద దౌత్య విజయం దక్కింది. క్వాడ్ గ్రూప్ (భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్) ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించింది. 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన వారిపై చర్యలు తీసుకోవాలని క్వాడ్ గ్రూప్ విదేశాంగ మంత్రులు కోరారు.
Jai Shankar: జమ్మూ కాశ్మీర్లో పర్యాటకాన్ని, ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గామ్ ఉగ్రదాడి చేశారని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఇది ‘‘ఆర్థిక యుద్ధ చర్య’’గా అభివర్ణించారు. ఇస్లామాబాద్‌తో కాల్పుల విరమణ ఒప్పందంలో ట్రంప్ పాత్ర లేదని మరోసారి స్పష్టం చేశారు. పాకిస్తాన్ నుంచి వస్తున్న ఉగ్రవాదానికి ప్రతిస్పందించకుండా భారత్‌ని ఎవరూ అడ్డుకోలేరని వెల్లడించారు. న్యూయార్క్‌లో న్యూస్‌వీక్‌తో జరిగిన ప్రత్యేక సంభాషణలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.
Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్’’ గురించి ఇండోనేషియాలో భారత రక్షణ దళ ప్రతినిధి కెప్టెన్ శివకుమార్ మాట్లాడిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. ఆపరేషన్ సింధూర్ ప్రారంభ దశలో భారత వ్యూహాన్ని వివరించడంపై ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తోంది.
రాహుల్‌గాంధీపై అమిత్‌షా ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఆపరేషన్ సిందూర్‌పై రాహుల్ ఆధారాలు అడుగుతున్నారని.. పాకిస్థాన్ మాట రాహుల్‌గాంధీ నోట వినబడుతోందని మండిపడ్డారు.. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పామని పునరుద్ఘాటించారు. నిజామాబాద్‌లో పసుపుబోర్డు జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం స్థానిక పాలిటెక్నిక్ మైదానంలో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళన సభలో ఆయన ప్రసంగించారు. నక్సలైట్లపై అంశంపై అమిత్‌షా మరోసారి స్పందించారు.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌తో మాకు ఎలాంటి నష్టం కలగలేదని పాకిస్తాన్ బుకాయిస్తూ వస్తోంది. అయితే, భారత్ దాడిలో పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన చాలా ఆస్తులు నష్టపోయినట్లు వెలుగులోకి వస్తోంది. తాజాగా, ఇండోనేషియన్ ఎయిర్ ఫోర్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన సెమినార్లో పాకిస్తాన్ నష్టాల గురించి ప్రస్తావన వచ్చింది.
Parag Jain: రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) తదుపరి కార్యదర్శిగా ఐపీఎస్ అధికారి పరాగ్ జైన్‌ని మోడీ ప్రభుత్వం నియమించింది. 1989 బ్యాచ్ పంజాబ్ కేడర్ ఐపీఎస్ అధికారి అయిన జైన్ జూలై 1 నుంచి రెండళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం రా చీఫ్‌గా ఉన్న రవి సిన్హా స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. రవి సిన్హా పదవీకాలం జూన్ 30తో ముగుస్తోంది. Read Also: Ahmedabad Plane Crash: దర్యాప్తు అధికారికి…
ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌లో ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం అయ్యాయి. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాదుల శిబిరాలను భారత సైన్యం పటాపంచల్ చేశాయి. దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. తోకముడిచి ఉగ్రవాదులంతా పరారయ్యారు.
India Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత్‌కి రష్యా అందించాల్సిన రెండు స్క్వాడ్రన్ల S-400 క్షిపణి వ్యవస్థల డెలివరీ ఆలస్యమైంది. అయితే, వీటిని 2026-27 నాటికి పంపిణీ చేస్తామని రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బెలౌసోవ్, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కి హామీ ఇచ్చారు. చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) సమావేశం సందర్భంగా ఇద్దరూ ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. ఇరు దేశాలు దీర్ఘకాలిక రక్షణ భాగస్వామ్యాన్ని పునరుద్ఘాటించాయి.