పహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపి ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే. ఉగ్రమూకల చర్యతో యావత్ భారత్ పాక్ కు తగిన బుద్ధి చెప్పాలని నినదించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసి కోలుకోలేని దెబ్బతీసింది. ఇదిలా ఉంటే.. ఓ పదేళ్ల బాలుడు ఆపరేషన్ సింధూర్ హీరో అయ్యాడు. శ్రవణ్ సింగ్ అనే బాలుడికి భారత ఆర్మీ బంపరాఫర్ ఇచ్చింది. తారావాలి గ్రామంలో నివసించే శ్రవణ్, ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆర్మీ సైనికులకు సేవ చేయడంలో ముందు నిలిచాడు.
Also Read:HHVM : వీరమల్లుకు ప్రీమియర్ షోలు సాధించిన రోహిన్ రెడ్డి.. ఎవరితను..?
అతను ప్రతిరోజూ తన ఇంటి నుంచి సైనికులకు చల్లటి నీరు, పాలు, టీ, లస్సీ, ఐస్ తీసుకువచ్చేవాడు. సైనికులతో కలిసి జీవించడం, వారికి సేవ చేయడం, వారి భద్రత కోసం అప్రమత్తంగా ఉండటం శ్రవణ్ దినచర్యగా మారింది. శ్రవణ్ దేశభక్తి, అంకితభావానికి సైన్యం సెల్యూట్ చేసింది. అతన్ని కూడా గౌరవించింది. ఇప్పుడు అతని చదువు ఖర్చులన్నింటినీ భరించాలని నిర్ణయించింది. శ్రవణ్‌ను ఓ ప్రైవేట్ పాఠశాలలో చేర్పించి బ్యాగ్, పుస్తకాలు, దుస్తులు, లంచ్ బాక్స్, కలర్ బాక్స్, వాటర్ బాటిల్ ను సైన్యం అందించింది.
Also Read:Dharmasthala Mass Murders : ధర్మస్థలో 300 హత్యలు..? ఆలయ పెద్దల ప్రమేయం ఉందా?
తండ్రి సోనా సింగ్ మాట్లాడుతూ, “మా కొడుకు చదువు, చికిత్సకు పూర్తి బాధ్యతను సైన్యం తీసుకున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఈరోజు అతను మొదటి రోజు పాఠశాలకు వెళ్ళాడు, అతని ముఖంలో ఆనందం చూసి మేము కూడా గర్వపడ్డాము” అని అన్నారు. శ్రవణ్ గతంలో కూడా బాగా చదివేవాడని, ఇప్పుడు అతను ఇంకా బాగా రాణిస్తాడని ఆయన అన్నారు. ఇప్పుడు మా కొడుకు మంచి ప్రైవేట్ పాఠశాలలో చదువుతాడు. 12వ తరగతి వరకు అతని మొత్తం చదువు ఖర్చును సైన్యం భరిస్తుంది. మేము చాలా సంతోషంగా ఉన్నాము.” అని తెలిపాడు.
శ్రవణ్ సింగ్ తల్లి సంతోష్ రాణి మాట్లాడుతూ, దేశభక్తి వయస్సును బట్టి ఉండదు. 10 ఏళ్ల శ్రవణ్ దీనికి సజీవ ఉదాహరణ. సైనికులకు సేవ చేయడం ద్వారా అతను ఒక ఉదాహరణగా నిలిచాడు, కానీ ఇప్పుడు అతను కూడా ఒక రోజు యూనిఫాం ధరించి దేశానికి సేవ చేయాలనుకుంటున్నాడని తెలిపింది.