Tayfun Block-4: పాకిస్తాన్‌తో ఫ్రెండ్‌షిప్ చేస్తున్న టర్కీ ఇప్పుడు తన మొదటి ‘‘హైపర్‌సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్’’ని తయారు చేసింది. ‘‘టేఫన్ బ్లాక్’’ అనే క్షిపణిని ఇస్లాంబుల్‌లో జరిగిన అంతర్జాతీయ రక్షణ పరిశ్రమ ప్రదర్శన (IDEF) 2025లో ప్రదర్శించింది. ఈ కొత్త క్షిపణిని టర్కిష్ రక్షణ సంస్థ రోకెట్సన్ డెవలప్ చేసింది. ఇది టర్కీ దేశీయంగా తయారు చేసిన అత్యంత పొడవైన బాలిస్టిక్ మిస్సైల్ అయిన టేఫన్‌కు హైపర్సోనిక్ వెర్షన్.
టేఫన్ బ్లాక్ 4 పొడవు 6.5 మీటర్లు, బరువు 7000 కిలోగ్రాములు, 800 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలపై దాడి చేసే సత్తా దీనికి ఉంది. మల్టీ పర్పస్ వార్ హెడ్‌లను మోసుకెళ్లే సత్తా కలిగిన ఈ క్షిపణి, మాక్-5 వేగం ( అంటే గంటకు 6100 కి.మీ) వేగంతో వెళ్తుంది. దీంతో ఏ క్షిపణి నిరోధక వ్యవస్థ కూడా దీనిని గుర్తించి, నాశనం చేయడం కష్టమవుతుంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, కమాండ్ అండ్ కంట్రోల్, సైనిక హ్యాంగర్లు, కీలకమైన సైనిక సౌకర్యాల వంటి కీలకమైన లక్ష్యాలను కిలోమీటర్ల దూరం నుంచే నాశనం చేయగలదు.
Read ALSO: China: బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేక ఎజెండాకు చైనా మద్దతు..? బంగ్లాలోని హిందువులకు భారీ ముప్పు..!
అయితే, టర్కీ తన తొలి హైపర్సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్‌ని తయారు చేయడం భారత్‌కి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే, ప్రస్తుతం టర్కీలోని తయ్యప్ ఎర్డోగాన్ ప్రభుత్వం భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. రెండు నెలల క్రితం జరిగిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ సమయంలో పాకిస్తాన్‌కి టర్కీ మద్దతు ఇవ్వడమే కాకుండా, టర్కిష్ డ్రోన్లను అందించింది. వీటిని ఆపరేట్ చేయడానికి కొందరు టర్కీ నిపుణులను కూడా పాకిస్తాన్‌కు పంపింది.
ఈ నేపథ్యంలో, టర్కీ-పాకిస్తాన్ మధ్య సంబంధాలు కారణంగా భవిష్యత్తులో ఈ మిస్సైల్‌ని పాకిస్తాన్ కొనే అవకాశం ఉంది. ఇప్పటికే, టర్కీ తన బైరెక్టర్ డ్రోన్లను పాకిస్తాన్‌కు అప్పగించింది. సిందూర్ సమయంలో టర్కీ డ్రోన్లను ఉపయోగించే పాకిస్తాన్, భారత భూభాగాలపై దాడులు చేయాలని ప్రయత్నించింది. అయితే, మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వీటన్నింటిని కుప్పకూల్చింది.