Parliament Monsoon Session: ఈసారి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఎలాంటి పెద్ద నిరనయాలు తీసుకున్నట్లుగా కనపడలేదు. 21 జూలైన మొదలైన ఈ వర్షాకాల సమావేశాలు 21 ఆగస్టున ముగిశాయి. ఈ సమావేశలలో లోక్‌సభ 120 గంటల చర్చ జరగాల్సి ఉండగా కేవలం 37 గంటలే చర్చ జరిగింది. మిగతా 83 గంటలు వృథా అయ్యాయి. మరోవైపు రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ కూడా 47 గంటల పని మాత్రమే జరగగా 73 గంటలు వృథా అయ్యాయి. మొత్తం మీద లోక్‌సభలో 31% పని, రాజ్యసభలో 38% పని మాత్రమే పూర్తయ్యింది.
ఈ సమావేశలలో ఉగ్రవాదం, ఆపరేషన్ సిందూర్, అంతరిక్ష కార్యక్రమం వంటి అంశాలపై చర్చలు జరిగాయి. అయితే, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వంటి అంశాలపై గట్టి నిరసనలు జరిగాయి. ఆపరేషన్ సిందూర్ చర్చ సందర్భంగా కూడా ఇదే పరిస్థితి కనిపించింది. రెండు సభలను కలిపి చూస్తే, కోట్ల రూపాయల నష్టం జరిగింది. లెక్కల ప్రకారం దాదాపు రూ.200 కోట్ల మేర వృథా అయ్యాయి. ఇకపోతే ఈ వర్షాకాల సమావేశంలో 14 ప్రభుత్వ బిల్లులతో మొత్తం 12 బిల్లులు ఆమోదించబడ్డాయి. లోక్‌సభలో 419 ప్రశ్నలు అజెండాలో ఉండగా కేవలం 55 ప్రశ్నలకు మాత్రమే మౌఖిక సమాధానాలు ఇచ్చారు. రాజ్యసభలో 285 ప్రశ్నలు ఉండగా కేవలం 14 ప్రశ్నలకే సమాధానాలు లభించాయి. జీరో అవర్ సబ్మిషన్స్, స్పెషల్ మెన్షన్స్ కూడా హంగామాల కారణంగా చాలా వరకు నిలిచిపోయాయి. 285 స్పెషల్ మెన్షన్స్ లో కేవలం 61 మాత్రమే చర్చకు వచ్చాయి.
Nitish Kumar: మదర్సా కార్యక్రమంలో నితీష్ కుమార్ షాక్.. టోపీ ధరించేందుకు నిరాకరణ.. వీడియో వైరల్
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ఆపరేషన్ సిందూర్ పై జరిగిన ప్రత్యేక చర్చ లోక్‌సభలో జూలై 28, 29న జరిగింది. అక్కడ ప్రధానమంత్రి మోడీ సమాధానం ఇచ్చారు. రాజ్యసభలో జూలై 29, 30న 16 గంటలు 25 నిమిషాల చర్చ జరిగగా గృహ మంత్రి సమాధానం ఇచ్చారు. నిజానికి ఈ సమావేశాల కార్యకలాపాలపై భారీగా ఖర్చవుతుంది. 2012లో అప్పటి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పవన్ బన్సల్ చెప్పిన ప్రకారం పార్లమెంట్‌లో ఒక నిమిషం చర్చ ఖర్చు రూ.2.5 లక్షలు. అంటే ఒక గంట చర్చ ఖర్చు రూ.1.5 కోట్లు. ఇప్పుడు ఆ ఖర్చు మరింత పెరిగి ఉంటుంది. ఈ మొత్తం డబ్బు నేరుగా పన్ను చెల్లించే ప్రజల జేబు నుంచే వెళ్తోంది.
లోక్‌సభలో ఆమోదం పొందిన 12 బిల్లులు ఇవే:
* గోవా రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాల్లో గిరిజనుల ప్రతినిధిత్వ పునర్వ్యవస్థీకరణ బిల్లు, 2025.
* మర్చెంట్ షిప్పింగ్ బిల్లు, 2025.
* మణిపూర్ జీఎస్టీ (సవరణ) బిల్లు, 2025.
* మణిపూర్ వినియోగ (సంఖ్య 2) బిల్లు, 2025.
* జాతీయ క్రీడల పరిపాలన బిల్లు, 2025.
* జాతీయ డోపింగ్ నిరోధక (సవరణ) బిల్లు, 2025.
* ఆదాయపు పన్ను బిల్లు, 2025.
* పన్ను చట్టాల (సవరణ) బిల్లు, 2025.
* భారతీయ పోర్టుల బిల్లు, 2025.
* ఖనిజ అభివృద్ధి & నియంత్రణ (సవరణ) బిల్లు, 2025.
* భారతీయ మేనేజ్‌మెంట్ ఇన్స్టిట్యూట్స్ (సవరణ) బిల్లు, 2025.
* ఆన్‌లైన్ గేమింగ్ ప్రోత్సాహం & నియంత్రణ బిల్లు, 2025.
Telangana Bandh: ‘మార్వాడీ గో బ్యాక్’ ఉద్యమం.. నేడు తెలంగాణ బంద్!
రాజ్యసభలో పై బిల్లులతో పాటు 15 బిల్లులు ఆమోదించబడ్డాయి. వాటిలో బిల్స్ ఆఫ్ ల్యాండింగ్ బిల్లు, తీర ప్రాంత నావిగేషన్ బిల్లు, వ్యాపార నావిగేషన్ బిల్లు వంటి ముఖ్యమైన బిల్లులు ఉన్నాయి.