టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దానికి అనుగుణంగా సైబర్ క్రైమ్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. వాటిని అరికట్టేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అంతరాష్ట్ర ఆపరేషన్ నిర్వహించారు. ప్రత్యేక ఆపరేషన్‌లో దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో ఒకేసారి తనిఖీలు నిర్వహించి మొత్తం 61 మంది నిందితులను అరెస్టు చేశారు.
Cyber Den: విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలంలో సైబర్ నేరాల కేంద్రంగా పనిచేస్తున్న ఓ భారీ ముఠా పై పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. భోగాపురంలోని కొన్ని అపార్టుమెంట్లు అద్దెకు తీసుకుని ఈ ముఠా గత రెండేళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్నట్టు వెల్లడైంది. కాల్ సెంటర్ ముసుగులో సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఈ ముఠా ప్రధానంగా అమెరికాలోని అమెజాన్ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని కోట్లాది రూపాయల మోసాలకు తెగబడింది. ఈ ముఠా తూర్పు, ఈశాన్య భారత రాష్ట్రాల నుండి యువతీ…
Cyber Fraud: సాంకేతిక ప్రగతికి అనుగుణంగా సైబర్ నేరాలు కూడా రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రజల నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తూ మోసగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో దాడి చేస్తున్నారు. తక్కువ పెట్టుబడి, అధిక లాభాల పేరుతో ఫేక్ లింకులు పంపుతూ ఫోన్ క్లిక్‌తోనే ఖాతాల్ని ఖాళీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, ఆఫర్ల పేరుతో వచ్చే లింకులను బదులిచ్చే ముందు ఒక్కసారైనా ఆలోచించాలని…
ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయమైన అమ్మాయిలకి మాయమాటలు చెప్పి వారి నుంచి డబ్బులు బంగారం కాజేస్తున్న కిలాడీని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు హైదరాబాద్‌కు చెందిన కీలారు నాగ తేజగా గుర్తించారు. నిందితుడు నాలుగు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన విజయవాడకు చెందిన యువతని ఏకాంతంగా మాట్లాడాలని హోటల్‌కి తీసుకు వెళ్ళాడు.
కృష్ణా జిల్లాలో టాస్క్ ఫోర్స్ పోలీసులు క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల అదుపులోనికి తీసుకున్నారు. కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలో విచ్చలవిడిగా క్రికెట్ ఆన్లైన్ బెట్టింగులు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నియోజకవర్గ పరిధిలో ఉంగుటూరు మండలంలో 10మందిని, గన్నవరం మండలంలో 10మందిని, బాపులపాడు మండలంలో మరికొందరు క్రికెట్ భూకీలను అదుపులోకి తీసుకున్నారు. నియోజకవర్గ పరిధిలో యువత వ్యసనాలకు బానిసలై బెట్టింగులకు పాల్పడుతున్నారు.
Blackmailer: ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నా.. మరోవైపు అదే టెక్నాలజీ ఉపయోగించి అనేక సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ముఖ్యంగా సైబర్ నేరగాళ్ల వల్ల అనేకమంది అమాయక ప్రజలు ఇబ్బందులు పడి చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. మరికొందరు వారి బాధను భరించలేక చివరికి ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడా చాలా ఉన్నాయి. ఇకపోతే, తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని విప్రో సంస్థలో పనిచేసిన ఓ మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఓ బ్లాక్ మైలర్ బెదిరించి ఏకంగా…
VC Sajjanar : టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సైబర్ నేరాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఈ రోజు ఆయన ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. “జంప్‌డ్ డిపాజిట్ స్కామ్” పేరిట జరుగుతున్న మోసాలపై ప్రజలను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఈ సందేశంలో భాగంగా, స్కామ్ వివరాలు తెలియజేసే వీడియోను సజ్జనార్ పోస్ట్ చేశారు. వీడియోలో ఆయన హెచ్చరిస్తూ, “మీకు తెలియని వ్యక్తుల నుంచి యూపీఐ ద్వారా డబ్బులు మీ ఖాతాలో జమయితే సంబరపడిపోకండి.…
గుంటూరులో వెలుగు చేసిన నయా మోసానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఇంస్టాగ్రామ్ లో వర్క్ ఫ్రమ్ హోమం అంటూ యువకులకు వల వేస్తున్నారు.. మీరు ఇంట్లో కూర్చొనే నెలకు 50,000 వేల వరకు సంపాదించుకోవచ్చు అంటూ ఓ ప్రకటన ఇచ్చారు.. తమను సంప్రదించిన యువకులకు.. అందమైన యువతీతో వీడియో సందేశాలు పంపించారు..
ఉద్యోగం ఆశ చూపించి మానవ అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు గుర్తించారు. విదేశాల్లో డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతున్నట్లు వారు తెలిపారు.
Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరాన్ని జనవరి 22వ తేదీ సోమవారం ప్రారంభంకానుంది. ఇందుకు సంబంధించి ఆలయ అధికారులు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సిబ్బంది దాదాపు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.