Blackmailer: ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నా.. మరోవైపు అదే టెక్నాలజీ ఉపయోగించి అనేక సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ముఖ్యంగా సైబర్ నేరగాళ్ల వల్ల అనేకమంది అమాయక ప్రజలు ఇబ్బందులు పడి చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. మరికొందరు వారి బాధను భరించలేక చివరికి ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడా చాలా ఉన్నాయి. ఇకపోతే, తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని విప్రో సంస్థలో పనిచేసిన ఓ మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఓ బ్లాక్ మైలర్ బెదిరించి ఏకంగా రూ.2.53 కోట్ల డబ్బులను వసూలు చేశాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
Read Also: MLC Sipai Subramanyam: వైసీపీ ఎమ్మెల్సీ కిడ్నాప్..! వీడియో విడుదల చేసిన ఎమ్మెల్సీ సిపాయి..
మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగికి తన చిన్ననాటి స్నేహితురాలు భర్తగా పరిచయం అయ్యాడు సాయికుమార్. ఆ తర్వాత సాయికుమార్ వేర్వేరు ఫోన్ నెంబర్ నుండి ఫోన్ చేస్తూ తన వద్ద ఆ మహిళా ఉద్యోగీకి సంబంధించిన న్యూడ్ వీడియోలు ఉన్నాయంటూ బెదిరింపులు చేశాడు. దీంతో అతడు చెప్పినట్లుగా వినాలని నిందితుడు మహిళను బెదిరించాడు. ఈ నేపథ్యంలో విడతల వారీగా మహిళల నుంచి ఏకంగా రూ.2.53 కోట్లను కాజేసాడు నిందితుడు. దీంతో నిందితుడు నినావత్ దేవా నాయక్ అలియాస్ సాయికుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళ చేసిన కంప్లైంట్ ఆధారంగా పోలీసులు నిందితుడి ఆచూకిని కనుగొన్నారు. మొత్తానికి నిందితుడిని నిడదవోలులో అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఆ తర్వాత అతడి నుంచి కోటి 81 లక్షల నగదును మరిన్ని స్థిర, చర ఆస్తులను సీజ్ చేశారు పోలీసులు.