Cyber Den: కాల్ సెంటర్ ముగుసుగులో భారీగా ఆర్థికమోసాలు.. అమెజాన్ కస్టమర్లే లక్ష్యంగా..?!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Den: విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలంలో సైబర్ నేరాల కేంద్రంగా పనిచేస్తున్న ఓ భారీ ముఠా పై పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. భోగాపురంలోని కొన్ని అపార్టుమెంట్లు అద్దెకు తీసుకుని ఈ ముఠా గత రెండేళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్నట్టు వెల్లడైంది. కాల్ సెంటర్ ముసుగులో సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఈ ముఠా ప్రధానంగా అమెరికాలోని అమెజాన్ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని కోట్లాది రూపాయల మోసాలకు తెగబడింది. ఈ ముఠా తూర్పు, ఈశాన్య భారత రాష్ట్రాల నుండి యువతీ యువకులను తీసుకువచ్చి వారిని ఈ కార్యకలాపాల్లో భాగస్వాములను చేసింది. వారిని ప్రత్యేకంగా శిక్షణనిచ్చి ఫోన్ ద్వారా విదేశీ కస్టమర్లతో సంభాషణ చేయిస్తూ అకర్మలకు పాల్పడింది. అనకాపల్లి జిల్లా పోలీసులు ఈ నెలలో జరిగిన దాడిలో 100 మందికిపైగా యువతను గుర్తించి, వారిలో 30 మందిని అరెస్ట్ చేశారు.
Read Also: Bride Calls Off Wedding: తాళి కట్టే సమయంలో ఝలక్ ఇచ్చిన పెళ్లికూతురు.. చివరకు లవర్‌తో..!
Also Read
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
- 10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
- AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై అలర్ట్.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
- Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే!
ఈ సైబర్ డెన్‌పై దృష్టి సారించేందుకు ఒక సాధారణ వ్యక్తి చేసిన ఫోన్ కాల్ తోనే కీలక సమాచారం బయటపడింది. ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో మెరుపు దాడులు జరిగాయి. సోదాల్లో భారీగా కంప్యూటర్లు, కమ్యూనికేషన్ పరికరాలు, డేటా స్టోరేజ్ డివైస్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో వెలుగు చూసిన మోసాల విలువ సుమారుగా రూ.600 కోట్లకు పైగా ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇదంతా విస్తృతంగా జరుగుతున్న ఆర్థిక నేరంగా పరిగణిస్తూ కేసును CIDకి అప్పగించింది ఏపీ ప్రభుత్వం. దీనితో DSP స్థాయి అధికారి పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగుతోంది. CID అధికారులు ఈ ముఠా కార్యకలాపాలను వివిధ కోణాల్లో విచారిస్తున్నారు.
Read Also: S**X On Road: బరితెగించిన రాజకీయ నేత.. రోడ్డుమీదే కారు ఆపి పబ్లిక్ గా శృంగారలీలలు..!
రెండేళ్లుగా ఈ ముఠా సైబర్ డెన్ నడుపుతున్నా ఇప్పటిదాకా ఎలా గుర్తించలేకపోయారన్నది కీలక ప్రశ్నగా మారింది. భోగాపురంలో ఓ సాధారణ అపార్టుమెంట్లో ఇంటర్నేషనల్ స్థాయిలో మోసాలు సాగుతుండటమే గాక, ప్రతి నెలా 15 నుంచి 20 కోట్ల వరకు మోసగిస్తున్నారు. దీనికి కీలక సూత్రధారులు ఎవరు? ఎవరెవరు దీన్ని నడిపిస్తున్నారు? అనే కోణాల్లో విచారణ జరుగుతోంది. ఈ ఉదంతం మరోసారి సైబర్ సెక్యూరిటీపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని చాటుతోంది.
తాజావార్తలు
-
Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
-
Ranabaali Postpone : విజయ్ దేవరకొండ ‘రణబాలి’ పోస్ట్‌పోన్ అవుతుందా?
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
UPI Charges: రూ.2,000 వరకు యూపీఐ లావాదేవీలపై.. ఛార్జీల విషయంలో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!