ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తోన్న కరోనా మహమ్మారి మరోసారి రూపం మార్చుకొని ప్రజలపై విరుచుకు పడుతోంది. గత నెల దక్షిణాఫ్రికాలో బయటపడ్డ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ 66 దేశాలకు వ్యాప్తి చెందింది. డెల్టా వేరియంట్ కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ ఇటీవల భారత్‌లోకి కూడా ప్రవేశించింది. దీంతో ప్రస్తుతం భారత్‌లో 33 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కూడా ఒమిక్రాన్ వ్యాప్తి అధికంగా ఉండడంతో నిన్న, నేడు ఆ రాష్ట్రంలో…
ప్రపంచంలో కరోనా కేసులతో పాటు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. డెల్టా వేరియంట్ ఇప్పటికే ప్రపంచాన్ని చుట్టేసింది. డెల్టా నుంచి ఇంకా ప్రపంచం బయటపడలేదు. యూరప్ వంటి దేశాల్లో డెల్టా కేసులు భారీగా నమోదువుతున్నాయి. యూకే, జర్మనీ, ఫ్రాన్స్ తోపాటు యూరప్ దేశాల్లో కేసలు భారీగా పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో పాజిటవ్ కేసులు బయటపడుతున్నాయి. దీంతో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి. బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఇజ్రాయిల్‌లో కొత్త వేరియంట్ బయటపడటంతో సరిహద్దులు మూసేసింది.…
దేశంలో ఒమిక్రాన్ టెన్షన్ మొదలైంది. ఒమిక్రాన్ కేసులు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. కేసులు పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తం అయింది. ఒమిక్రాన్ కేసులతో పాటుగా కరోనా కేసులు కూడా వ్యాప్తి చెందుతుండటంతో కేంద్ర ఆరోగ్యశాఖ కేంద్రాలకు లేఖలు రాసింది. కోవిడ్ నిబంధనలపై నిర్లక్ష్యం వద్దని, కరోనా వ్యాప్తి చెందుతున్న జిల్లాలపై మరింత దృష్టి సారించాలని కేంద్రం సూచించింది. దేశంలోని 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గత రెండు వారాలుగా పాజిటివిటీ రేటు పెరుగుతోందని, దీనిపై దృష్టి పెట్టాలని…
మన దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు దేశంలో 32 మందికి ఒమిక్రాన్ వేరియంట్ వల్ల కరోనా సోకింది. అయితే, ఇందులో సగం మంది బాధితులు మహారాష్ట్రలోనే ఉన్నారు. మహారాష్ట్రలో ఇంత వరకూ 17 మంది ఒమిక్రాన్ బారిపడ్డారు. మహారాష్ట్ర నిన్న ఒక్క రోజే ఏడు కొత్త ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. బాధితుల్లో ఒకరు ఓ మూడేళ్ల చిన్నారి కావడం ఆందోళన కలిగిస్తోంది. ముంబైలోని దార్వీ ప్రాంతానికి చెందిన వ్యక్తికి కూడా…
ఓమిక్రాన్ వేరింయట్ వేగంగా వ్యాప్తి నేపథ్యంలో, కోవిడ్ 19 వ్యాప్తిని నివారించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. దీనికి సంబంధించి కేంద్రం జారీ చేసిన పరిమితులు/మార్గదర్శకాల జాబితా చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తులందరూ మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. నిబంధనలు పాటించకుంటే రూ. 100 జరిమానా విధిస్తారు. మాస్క్ ముక్కు, నోటిని కప్పి ఉంచాలి. సంస్థలు లేదా దుకాణాలు మాస్క్ లేని వ్యక్తిని తమ ప్రాంగణంలోకి అనుమతిస్తే పరిస్థితి తీవ్రతను…
ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ భయంతో అన్ని దేశాలు బూస్టర్ డోస్ పై చర్చను ప్రారంభించాయి. అభివృద్ధి చెందిన దేశాలలో బూస్టర్ డోస్‌ను వారి ప్రజలకు ఇస్తున్నాయి. అయితే దీనిపై డబ్ల్యూహెచ్‌ఓ అభ్యంతరం వ్యక్తం చేసింది. బూస్టర్ డోస్‌ల పేరుతో వ్యాక్సిన్ నిల్వలను అంటిపెట్టుకోవద్దని వాటి పేద దేశాలకు అందజేయాలని సూచించింది. అయితే మనదేశంలో బూస్టర్ డోస్‌పై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఒమిక్రాన్ విజృంభిస్తుండటంతో బూస్టర్ డోసుకు సంబంధించిన వివరాలను పార్లమెంటరీ ప్యానెల్‌కు వెల్లడించినట్లు…
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (IITH) బృందం కోవిడ్ ట్రాకర్ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఐఐటీహెచ్ ప్రొఫెసర్ ఎం విద్యాసాగర్ మాట్లాడుతూ.. 2022 జనవరి 27వ తేదీన ఒమిక్రాన్ కేసులు ఇండియాలో గరిష్టస్థాయికి చేరుకుంటాయని కోవిడ్ ట్రాకర్ ఫలితాల మేరకు ఆయన వెల్లడించారు. జనవరిలో దేశవ్యాప్తంగా 1.5 లక్షల ఒమిక్రాన్ కేసుల నమోదయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే ఇప్పటికే కోవిడ్ టీకాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పంపిణి…
కరోనాను కట్టడి చేయడానికి వ్యాక్సీన్లు వచ్చేశాయి… ఇక మనం భయపడాల్సిన పనిలేదు అనుకున్నారంతా. కానీ… కరోనా వైరస్ తన రూపాన్ని మార్చుకుంది. ఒమిక్రాన్‌గా విజృంభిస్తోంది. రెండు డోసుల వ్యాక్సీన్ తీసుకున్న వాళ్లను సైతం ఈ ఒమిక్రాన్ వేరియంట్ వదలడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా 59 దేశాలకు కరోనా ఒమిక్రాన్ వేరియంట్ విస్తరించింది. ఆయా దేశాల్లో 2 వేల 936 మందికి ఒమిక్రాన్ సోకినట్టు ఇప్పటి వరకూ స్పష్టమైంది. అలాగే, కరోనా సోకినట్టు నిర్ధారణైన 78 వేల మందిలో…
గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి భారత్‌తో పాటు ప్రపంచ దేశాలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఈ కరోనా వైరస్ కొత్తకొత్తగా రూపాంతరాలు చెంది ప్రజలపై విరుచుకుపడుతోంది. అయితే గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుటికే 50 దేశాలకు పైగా వ్యాప్తి చెంది అక్కడ ప్రజలపై తన ప్రభావాన్ని చూపుతోంది. ఇటీవల భారత్‌లోకి కూడా ఈ వేరియంట్ ప్రవేశించి దేశ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. డెల్టా వేరియంట్ కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి…
మనిషిని చంపడానికి భయం ఒక్కటి చాలు.. ఆ భయం ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేలా చేస్తోంది. కరోనా భయంతో ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఒమిక్రాన్ భయంతో ఒక డాక్టర్ దారుణానికి ఒడిగట్టాడు.. బంగారంలాంటి కుటుంబాన్ని తన చేతులారా చంపాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. కాన్పూర్ పరిసర ప్రాంతంలో సుశీల్ కుమార్ అనే వైద్యుడు తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. స్థానిక వైద్యశాలలో విధులు నిర్వహించే సుశీల్…