ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గత రెండు సంవత్సరాల నుంచి భయపెడుతూనే ఉంది. ఇప్పటికే యావత్త ప్రపంచ దేశాలు డెల్టా వేరియంట్‌తో భయపడుతుంటే.. గత నెల దక్షిణాఫ్రికాలో మరో కొత్త కరోనా వేరియంట్ వెలుగులోకి వచ్చింది. అయితే కరోనా బాధితులకు పాక్స్‌లొవిడ్ మాత్ర ఇస్తే 90 శాతం ప్రభావం చూపుతోందని ప్రముఖ ఫార్మా సంస్థ ఫైజర్ తెలిపింది. తీవ్ర అస్వస్థతతో ఉన్న కరోనా బాధితులకు ఈ మాత్రతో 90 శాతం వరకు రక్షణ కలుగుతుందని ఫైజర్ వెల్లడించింది.…
గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే వివిధ దేశాలకు వ్యాప్తి చెందింది. అయితే ఇటీవలే ఈ ఒమిక్రాన్ వేరియంట్ భారత్‌లోకి కూడా ప్రవేశించింది. దీంతో పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదువుతున్నాయి. అయితే తాజాగా భారత్‌లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 61కు చేరింది. భారత్‌లో ఒమిక్రాన్ ప్రభావం మహారాష్ట్రపై ఎక్కవగా కనిపిస్తోంది. రోజురోజుకు మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఈ రోజు మరో 8 ఒమిక్రాన్ కేసులు మహారాష్ట్రలో…
తెలంగాణలో థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా వున్నామన్నారు వైద్యారోగ్య, ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు. 21 లక్షల హోమ్ ఐసోలేషన్ కిట్లు సిద్దం చేయాలని ఆదేశించారు. ప్రపంచ వ్యాప్త కరోనా పరిస్థితుల పరిశీలనకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. 545 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సౌకర్యం సిద్దం చేయాలన్నారు. ప్రజలు మాస్కులు ధరించాలి, రెండు డోసుల వాక్సిన్ తీసుకోవాలని హరీష్ రావు సూచించారు. కరోనా తాజా పరిస్థితులపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు.…
కోవిడ్19 వైరస్ కొత్త కొత్త రూపాలతో ప్రజలపై దాడికి పాల్పడుతోంది. మొన్నటి వరకు కరోనా డెల్టా వేరియంట్‌తోనే తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు ఇప్పడు దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్‌తో మరోసారి భయపడుతున్నారు. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించింది. దీంతో ఆయా దేశాల్లో ఒమిక్రాన్ తీవ్రతను బట్టి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అయితే తాజాగా కాలిఫోర్నియాలో మరోసారి కోవిడ్ నిబంధనలను తీవ్రం చేస్తున్నట్లు పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది.…
కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో ప్రజలపై మరోసారి విరుచుకుపడుతోంది. ఇప్పటికే భారత్‌లోకి ప్రవేశించిన ఒమిక్రాన్ వేరియంట్ రోజుకో రాష్ట్రంలో వెలుగు చూస్తోంది. ఇటీవల తెలంగాణాకు పక్కనే ఉన్న ఏపీలోనూ రెండు ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఒమిక్రాన్‌పై అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం ఆరోగ్యశాఖ కీలక సమావేశం నిర్వహించనుంది. ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సమావేశంలో థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనే ప్రణాళికలపై…
దేశంలో ఒమిక్రాన్ కేసులు మెల్లిగా పెరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో మరో కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 40కి చేరింది. మహారాష్ట్రలో కొత్త రెండు కేసులు కలిపి మొత్తం 20 కేసులు నమోదయ్యాయి. పూణే, లాతూర్‌లో రెండు కేసులు నమోదైనట్టు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. Read: ప్రపంచ ఆరోగ్యసంస్థ మరో హెచ్చరిక: కష్టాల ఊబిలోకి 50 కోట్లమంది… మహారాష్ట్రలో మొత్తం 20 కేసులు నమోదవ్వడంతో…
దక్షిణాఫ్రికాలో పురుడు పోసుకున్న ఒమిక్రాన్ వేరియంట్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వేరియంట్ 66 దేశాలకు పైగా పాకేసిందని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు. అయితే.. ఇప్పటి వరకు ఈ వేరియంట్ కారణంగా.. ఎవరూ మరణించలేదని.. సంబరపడుతున్న జనాలకు ఊహించని షాక్ తగిలింది. తాజాగా యూకే లో తొలి ఒమిక్రాన్ మరణం నమోదు అయింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది బ్రిటన్ ప్రభుత్వం. ఇవాళ ఉదయమే ఒమిక్రాన్ సోకిన రోగి..…
ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒకటే భయం పట్టుకుంది. దక్షిణాఫ్రికాలో మొదలైన ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచం మొత్తం చుట్టేసింది. అత్యంత వేగంగా ఈ వేరియంట్ వ్యాపిస్తోంది. సౌతాఫ్రికాలో మొదలైనప్పటికీ ఈ వేరియంట్ కేసులు యూరప్‌లో వేగంగా వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా బ్రిటన్‌లో రోజుకు వందల సంఖ్యలో ఈ వేరియంట్ కేసులు బయటపడుతున్నాయి. ఇప్పటికే సుమారు మూడు వేలకు పైగా కేసులు బ్రిటన్‌లో నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. క్రమంగా ఆసుపత్రులపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. Read:…
ప్రపంచాన్ని వణికిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్.. భారత్‌లోకి ప్రవేశించింది.. క్రమంగా రాష్ట్రాలకు విస్తరిస్తోంది.. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒమిక్రాన్ కేసు వెలుగు చూడడంతో.. ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసు బయటపడిన నేపథ్యంలో వైద్య, ఆరోగ్య రంగంపై సమీక్ష చేపట్టనున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమీక్ష సమావేశం జరగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ ఒమిక్రాన్ కేసులు లేకపోయినా తీసుకోవాల్సిన ముందస్తు చర్యల పై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం వైఎస్…