దేశంలో ఒమిక్రాన్ కేసులు చాపకింద నీరులా పెరుగుతున్నాయి. క్రమంగా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే దేశంలో 32 కేసులు నమోదయ్యాయి. ఇందులో 17 కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. దేశంలో సెకండ్ వేవ్ ఎఫెక్ట్ మహారాష్ట్రలోనే అధికంగా ఉంది. తాజాగా మహారాష్ట్రలో 7 ఒమిక్రాన్ కేసులు నమోదవ్వగా ఇందులో మూడు కేసులు ముంబైలోనే నమోదయ్యాయి. Read: ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిపై అమెరికా సీడీసీ సంచలన వ్యాఖ్యలు… మాస్క్‌లు ధరించకుంటే… అయితే టాంజానియా నుంచి ముంబైలోని…
కరోనా రక్కసి రూపాలు మార్చుకొని ప్రజలపై విరుచుకుపడుతోంది. ఇప్పటికే పలు దేశాల్లో విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ఇప్పుడు భారత్‌లో కూడా వ్యాప్తి చెందుతోంది. ఇటీవల భారత్‌లోకి ప్రవేశించిన ఒమిక్రాన్ వేరియంట్ తన ప్రభావాన్ని చూపుతోంది. తాజాగా మహారాష్ట్రలో మరో 7 కొత్త ఒమిక్రాన్ కేసులు రావడంతో అధికారులు మరింత పటిష్టంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఒమిక్రాన్ కేసులతో భారత్‌లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 32 కు చేరుకుంది. రాజస్థాన్‌లో 9, గుజరాత్‌లో 3, కర్ణాటకలో…
ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనా మహమ్మారి కొత్తగా రూపాంతరాలు చెంది ప్రజలపై విరుచుకుపడుతోంది. కరోనా ముందు ఎంతో అత్యాధునిక టెక్నాలజీ ఉన్న అమెరికా సైతం మోకరిల్లిక తప్పలేదు. అంటే అర్థం చేసుకోవచ్చు దీని ప్రభావం ఏ రేంజ్‌లో ఉందని. అయితే భారత్ కూడా కరోనా రక్కసి చేతుల్లో చిక్కుకొని ఎంతో విలవిలలాడింది. కరోనా ఫస్ట్ వేవ్ కంటే కరోనా డెల్టా వేరియంట్ సృష్టించిన సెకండ్ వేవ్‌తో ఎంతో మంది జీవితాలు అతలాకుతలమయ్యాయి. డెల్టా వేరియంట్ నుంచి ఇప్పడిప్పుడే…
కోవిడ్-19 వ్యాక్సిన్ డోసుల్లో అత్యధిక భాగం సంపన్న దేశాలు తమ వద్ద అట్టిపెట్టుకోవడం వల్ల పేద దేశాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని పదే పదే చెబుతూ వస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) తాజాగా మరో హెచ్చరిక చేసింది. కోవిడ్ వ్యాక్సిన్ అక్రమ నిల్వలను అరికట్టకపోతే ఒమిక్రాన్‌ను ఎదుర్కొవడం అసాధ్యమని చెప్పింది. వ్యాక్సినేషన్‌పై సమావేశమైన డబ్ల్యుహెచ్‌ఓ నిపుణుల కమిటీ సంపన్న దేశాలు తమ ప్రజలకు బూస్టర్ డోసుల కోసం పెద్దఎత్తున వ్యాక్సిన్లను అంటిపెట్టేసుకున్నాయని, ఈ అదనపు నిల్వలను…
ప్రపంచాన్ని మరోసారి ఓమిక్రాన్ రూపంలో కరోనా భయపెడుతోంది. ఇప్పటికే 50 పైగా దేశాలకు వ్యాపించింది. 2 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఓమిక్రాన్ కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం అన్ని దేశాల్లో మరోసారి వ్యాక్సిన్ ప్రాముఖ్యత ఏర్పడింది. ఇప్పటికే వ్యాక్సిన్ డోసులు తీసుకున్నా.. బూస్టర్ డోసులు వేయాలని ప్రతిపాదనలు చేస్తున్నాయి పలు దేశాలు. ఇండియాలో కూడా బూస్టర్ డోసులపై నిర్ణయం తీసుకోవాలని పలు రాష్ట్రాలు, కేంద్రాన్ని కోరాయి. వైద్య సిబ్బందికి, ఫ్రంట్ లైన్…
కరోనా వైరస్‌తో ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఒమిక్రాన్ వేరింయట్‌తో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో కరోనా వైరస్ జన్యుక్రమాన్ని గుర్తించే జీనోమ్ స్వీక్వెన్సింగ్ ల్యాబ్ ఏపీలో లేకపోవడంతో ఫలితాల నిర్ధారణ కోసం హైద్రాబాద్‌కు పంపాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు వచ్చే వారంలో రాష్ర్టంలోనే ఈల్యాబ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ (సీసీఎంబీ)తో రాష్ర్ట వైద్య ఆరోగ్య శాఖ ఒప్పందం చేసుకుంది. విజయవాడలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ…
ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. విదేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఎక్కువ నమోదు అవుతుండటంతో ఇప్పటికే అంతర్జాతీయ విమానాలపై అధికారులు నిషేధం విధించారు. అయితే డిసెంబర్ 1 తర్వాత కేవలం 10 రోజుల వ్యవధిలో ఏపీకి 12,500 మంది విదేశీయులు రావడంతో ప్రజల్లో ఒమిక్రాన్ వైరస్ భయాందోళనలు ప్రారంభమయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన వారిలో అత్యధికంగా విశాఖ జిల్లా వారే ఉన్నట్లు అధికారులు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. Read Also: కరోనా అంతంపై…
కరోనా తగ్గుముఖం పడుతుందనే అంచనాతో డిసెంబర్ 17 నుంచి అంతర్జాతీయ సర్వీసులను పూర్తి స్థాయిలో పునరుద్దరించాలని సివిల్ ఏవియేషన్ మొదట ప్రకటించింది. అయితే, దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ కేసులు బయటపడటం, యూరప్ దేశాల్లో వేగంగా కరోనా వ్యాపిస్తుండటం, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ప్రపంచంలోని అనేక దేశాల్లో బయటపడటంతో అంతర్జాతీయ విమానాల సర్వీసులపై డీజీసీఐ పునరాలోచనలో పడింది. కరోనా మహమ్మారి మొదటి వేవ్ సమయంలో వివిధ దేశాల్లో చిక్కున్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు వందేభారత్ పేరుతో కొన్ని విమానాలను నడిపారు.…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇంకా వదిలిపోలేదు. రెండేళ్ల నుంచి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కరోనా మొదటి తరం కరోనా, ఆ తరువాత డెల్టా వేరియంట్ విజృంభించింది. కాగా ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ప్రపంచంలో వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్‌ను వేగంగా అందిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ కొంతమేర డెల్టా వేరియంట్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నది. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, వ్యాక్సినేషన్ విధానం ద్వారా మహమ్మారి 2022 చివరి వరకు…