దేశంలో కరోనా కేసులు కొంతమేర తగ్గుముఖం పట్టినప్పటికీ, కొత్త వేరియంట్ టెన్షన్ పట్టుకుంది. కొత్త వేరియంట్ వేగంగా వ్యాపించే లక్షణాలు ఉండటంతో కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకు 77 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. ప్రతిరోజు కేసుల సంఖ్య పెరుగుతున్నది. దీంతో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించే కిట్‌లను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం. జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపి రిజల్డ్ వచ్చేసరికి అలస్యం అవుతున్నది. ఈలోగా ఒమిక్రాన్ ఏవైనా ఉంటే అవి సామాజికంగా వ్యాపించడం మొదలుపెడతాయి. ఇది…
ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒకటే మాట వినిపిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. కరోనా వైరస్‌లోని ఒక వేరియంట్ ఇది. సార్స్ కోవ్ జాతిలో అనేక మ్యూటేషన్ల కారణంగా పుట్టుకొచ్చింది ఈవేరియంట్. ఇందులో 30కి పైగా మ్యూటేషన్లు ఉండటంతో వ్యాధిని వేగంగా వ్యాపింపజేస్తున్నది. ఒమిక్రాన్‌ను నిరోధించాలంటే స్పైక్ ప్రోటీన్లను తొలగించాలి. దీనికోసం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వం చెబుతూ వస్తున్నది. Read: కరోనా వ్యాప్తికి ఇదే కారణమా…! ఇక ఇదిలా ఉంటే,…
సౌతాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్.. ఇప్పుడు భారత్ దేశంలోని పలు రాష్ట్రాలకు వ్యాపించింది.. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీని ఒమిక్రాన్ టెన్షన్ పెడుతోంది.. తాజాగా మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 10కి పెరిగింది.. ప్రస్తుతం తొమ్మిది మంది బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. మరో వ్యక్తి ఒమిక్రాన్ నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్టు అధికారులు ప్రకటించారు.. మరోవైపు.. కొత్త వేరియంట్ కలకలం…
కరోనా ప్రపంచ వ్యాప్తంగా చేసిన మృత్యు కేళి మరువక ముందే ఒమిక్రాన్ రూపంలో మరో వేరింయట్‌తో ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఈ కొత్త వేరింయట్ వేగంగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తుంది. తాజాగా బ్రిటన్‌లో మునుపెన్నడు లేని విధంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కోవిడ్ మొదలైన నాటి నుండి బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజే 78, 610 కొత్త కేసులు వెలుగుచూశాయి. జనవరిలో నమోదైన గరిష్ట సంఖ్య కన్నా 10 వేలు…
యావత్త ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేసిన కరోనా మహమ్మారి కొత్త కొత్త రూపాలతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. మొన్నటి వరకు ప్రపంచ దేశాలు డెల్టా వేరియంట్‌తోనే సతమతవుతున్నాయి. ఇప్పడిప్పుడే కొన్ని దేశాలు డెల్టా వేరియంట్ నుంచి బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పడు ప్రజల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే వివిధ దేశాలకు వ్యాప్తి చెందిన ఈ వేరియంట్ ఇటీవల భారత్‌లోకి కూడా ప్రవేశించి…
ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని భయపెడుతున్నది. వేగంగా కేసులు నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో వ్యాక్సినేషన్ ను వేగవంతం చేశారు. కరోనాకు పుట్టినిల్లైన చైనాలో ఎన్నో రకాల వ్యాక్సిన్ల అందుబాటులోకి వచ్చాయి. ఈ వ్యాక్సిన్ల పనితీరుపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠత మొదలైంది. దీనికి కారణం హాంకాంగ్ శాస్త్రవేత్తలు అందించిన సర్వే అని చెప్పవచ్చు. చైనాకు చెందిన సీనోఫామ్ సంస్థ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ను ప్రపంచంలోని చాలా దేశాలకు ఎగుమతి చేసింది. కోట్లాది మంది ఈ వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. …
తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయిన సంగతి తెలిసిందే. నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ కేసులపై స్పందించారు. ఒమిక్రాన్ కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు నగర పోలీస్ కమిషనర్. ఇతర దేశాల నుండి వచ్చేవారు టెస్ట్ చేసి రిజల్ట్ వచ్చిన తర్వాతనే బయటకి రావాలన్నారు. ఒమిక్రాన్ గురించి భయపడాల్సింది లేదు. ఒమిక్రాన్ వచ్చిన వారికి గచ్చిబౌలి లోని టిమ్స్ లో ట్రీట్మెంట్ చేస్తారన్నారు. బంజారాహిల్స్ పారామౌంట్ కాలనీలో అదుపులోకి తీసుకున్న ఇద్దరు, వారితో కాంటాక్ట్ అయిన…
ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తెలంగాణలో అడుగు పెట్టేసింది.. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలిపోయింది.. మరో వ్యక్తికి ఒమిక్రాన్‌పై క్లారిటీ రావాల్సి ఉంది.. అయితే, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు.. ఒమిక్రాన్ కేసులో హైదరాబాద్‌లో వెలుగుచూసిన సందర్భంలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఒమిక్రాన్ రిస్క్ ఉన్న దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులతో పాటు.. విదేశాల నుంచి…
క్రమంగా ప్రపంచాన్ని చుట్టేసే పనిలో పడిపోయింది కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ఇప్పటికే భారత్‌లో పలు రాష్ట్రాల్లో ఈ కేసులు వెలుగు చూడగా.. ఇప్పుడు తెలంగాణను కూడా తాకింది. నిన్నటి వరకు భారత్‌లో 37 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఏపీలోనూ ఒక కేసు వెలుగుచూసింది.. ఇప్పుడు తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.. అయితే, మరో వ్యక్తికి సంబంధించిన పూర్తి రిపోర్ట్ రావాల్సి ఉందని చెబుతున్నారు.. కెన్యా,…
సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. జట్ స్పీడ్‌తో ఇతర దేశాలకు వ్యాపిస్తూనే ఉంది.. అయితే, ఒమిక్రాన్ వేగంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది… మరింత అప్రమత్తత అవసరమని వార్నింగ్ ఇస్తోంది.. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఈ కొత్త వేరియంట్ కేసులు ఇప్పటికే 77 దేశాల్లో నమోదు అయినట్టు తెలిపారు డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధనమ్ గెబ్రియాసిస్.. ఇంకా అనేక దేశాల్లో ఈ వేరియంట్‌ను గుర్తించే పనిలో పడిపోయారని వెల్లడించారు.. ఇదే…