ప్రపంచంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో ప్రపంచదేశాలు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. సౌతాఫ్రికాలో మొదలైన ఈ కేసులు క్రమంగా ప్రపంచదేశాలకు విస్తరిస్తోంది. యూరప్ దేశాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. కేసులు పెరిగితే మరణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించింది. ఆసుపత్రుల్లో చేరే రోగుల సంఖ్యను అందించాలని పేర్కొన్నది.
Read: దారుణం: పేలిన పెట్రోల్ ట్యాంకర్… 50 మంది మృతి…
బ్రిటన్‌లో వచ్చే ఏప్రిల్ నాటికి 25 నుంచి 75 వేల వరకు మరణాలు సంభవించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించింది అంటే తీవ్రత ఏ స్థాయిలో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. వీలైనంత వరకు కేసులు పెరగకుండా ఎక్కడికక్కడ కట్టడికి చర్యలు తీసుకోవాలని లేదంటే చేయిదాటిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇక ఇండియాలోనూ ఒమిక్రాన్ కేసులు మెల్లిగా పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో బయటపడ్డ కేసులతో కలిపి మొత్తం ఈ కేసుల సంఖ్య 61కి చేరింది.