కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో ప్రజలపై మరోసారి విరుచుకుపడుతోంది. ఇప్పటికే భారత్‌లోకి ప్రవేశించిన ఒమిక్రాన్ వేరియంట్ రోజుకో రాష్ట్రంలో వెలుగు చూస్తోంది. ఇటీవల తెలంగాణాకు పక్కనే ఉన్న ఏపీలోనూ రెండు ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఒమిక్రాన్‌పై అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం ఆరోగ్యశాఖ కీలక సమావేశం నిర్వహించనుంది. ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ సమావేశంలో థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనే ప్రణాళికలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మందులు, ఆక్సిజన్, టెస్టింగ్‌కిట్ ఏర్పాట్లపై సమీక్షించనున్నారు. తెలంగాణలో ఒమిక్రాన్ వేవ్ ప్రవేశించినా… విజృంభించినా ధర్థ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.