గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే వివిధ దేశాలకు వ్యాప్తి చెందింది. అయితే ఇటీవలే ఈ ఒమిక్రాన్ వేరియంట్ భారత్‌లోకి కూడా ప్రవేశించింది. దీంతో పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదువుతున్నాయి. అయితే తాజాగా భారత్‌లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 61కు చేరింది. భారత్‌లో ఒమిక్రాన్ ప్రభావం మహారాష్ట్రపై ఎక్కవగా కనిపిస్తోంది. రోజురోజుకు మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి.
ఈ రోజు మరో 8 ఒమిక్రాన్ కేసులు మహారాష్ట్రలో నమోదవడంతో.. మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 28కు చేరింది. ఒమిక్రాన్ వ్యాప్తిపై అప్రమత్తమైన మహారాష్ట్ర ప్రభుత్వం గత శని, ఆదివారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్‌ను అమలులో పెట్టింది. అంతేకాకుండా ఒమిక్రాన్ సోకిన వ్యక్తలు కాంటాక్టులను కూడా వీలైనంత త్వరగా గుర్తించి టెస్టింగ్‌లు చేస్తున్నారు.