దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. శనివారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన… ఒమిక్రాన్ పట్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలందరూ తప్పకుండా మాస్కు ధరించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కరోనాను భారత్ సమర్థంగా ఎదుర్కొంటోందని స్పష్టం చేశారు. మనమంతా అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది అని మోదీ అన్నారు. దేశంలో సరిపడా ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా 18 లక్షల ఐసోలేషన్…
ఓవైపు కరోనా మహమ్మారి రూపం మార్చుకుని ఒమిక్రాన్‌తో విజృభింస్తుంటే చాలా మంది కరోనా నిబంధనలు పాటించకుండా ఇష్టా రాజ్యంగా తిరుగుతున్నారు. అలాంటి వారికి ఇప్పుడు ఢిల్లీ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ఎక్కడ ఎవరూ మాస్క్ ధరించకపోయినా చేతుల్లో ఉన్న సెల్ ఫోన్ కెమెరాలకు పని చెబుతున్నారు. ఫోటో తీయడం వారికి జరిమానా విధించడం .. ఎక్కడ లాఠీలకు పనిచెప్పాల్సిన అవసరం లేదు. గడిచిన రెండు రోజుల్లో కోవిడ్ ప్రోటోకాల్ ఉల్లంఘించిన వారి నుంచి సుమారు 1.5 కోట్ల…
కరోనాకు మందు తయారుచేసి సంచలనం సృష్టించిన ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య తాజాగా ఒమిక్రాన్ వేరియంట్‌కు కూడా మందు తయారు చేశారు. సుమారు 22 రకాల దినుసులతో ఈ మందును తయారుచేసినట్లు ఆనందయ్య వెల్లడించారు. ఒమిక్రాన్ సోకకుండా అందరూ ముందు జాగ్రత్తగా బూస్టర్ డోస్ మాదిరి ఈ మందును వేసుకోవాలని ఆనందయ్య సూచించారు. ఈ మందును ఒకేరోజు రెండు పూటలా తీసుకుంటే సరిపోతుందన్నారు. ఈ మేరకు ఒమిక్రాన్ మందును పంపిణీ చేస్తున్నట్లు ఆనందయ్య పేర్కొన్నారు. ఒమిక్రాన్ సోకిన వారు…
దేశంలో రోజు రోజుకు పెరిగిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. భారత్‌లో ఇప్పటికే 245 కేసులకుపైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మొత్తం పదిహేడు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే వీటి తీవ్రత మాత్రం పది రాష్ట్రాల్లోనే ఉండటంతో రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక బృందాలను పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా రాష్ట్రాల్లో ఈ బృందాలు పర్యటించి కేసులను అధ్యయనం చేయడంతో పాటు ఒమిక్రాన్ కేసుల రోజువారి నమోదు, కోవిడ్‌నిబంధనల అమలు వంటి వాటిపై ఈ బృందం…
ఒకవైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్ దాడులు చేస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్‌లు వేగంగా విస్తరిస్తున్నాయి. ఒమిక్రాన్ దెబ్బకు దేశాలకు దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. ప్రస్తుతం ఈ వేరియంట్ యూరప్, అమెరికా దేశాల్లో వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచం మొత్తంమీద లక్షన్నర కేసులు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో వ్యాప్తి అధికంగా ఉండే అవకాశం ఉన్నది. ఇక ఇదిలా ఉంటే, ఇండియాలోనూ ఒమిక్రాన్ కేసులు పెద్ద సంఖ్యలోనే నమోదవుతున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ఇండియాలో నిర్వహించారు. అయినప్పటికీ కేసులు…
కొవిడ్ మహమ్మారి దెబ్బకు బ్రిటన్ విలవిల్లాడుతోంది. ఓ వైపు డెల్టా, మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్లు…ఆ దేశాన్ని హడలెత్తిస్తున్నాయి. దీంతో గత కొన్ని రోజులుగా రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తాజాగా రికార్డు స్థాయిలో అక్కడ లక్షకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత బ్రిటన్‌లో ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే తొలిసారి. బ్రిటన్‌లో 24 గంటల వ్యవధిలో లక్షా 6వేల 122 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒమిక్రాన్ బాధితుల…
కరోనా మహమ్మారి రూపం మార్చుకుని ఒమిక్రాన్ రూపంలో విస్తరిస్తుండటంతో కఠిన చర్యలు చేపట్టే దిశగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులతో ఆయా రాష్ట్రాలు ఆంక్షల బాట పట్టాయి. ఓవైపు దేశ వ్యాప్తంగా కరోనా నివారణకు టీకా కార్యక్రమం వేగంగా కొనసాగుతున్నప్పటికీ ముందు జాగ్రత్తగా కోవిడ్ ప్రోటోకాల్స్‌ను ఆయా ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. లాక్ డౌన్ లాంటి పరిస్థితులు తలెత్తకుండా ముందుగానే నిర్ణయం తీసుకుని ఒమిక్రాన్ ముప్పును ఎదుర్కొవాలని భావిస్తున్నాయి.…
ఆంధ్రప్రదేశ్ ఏపీ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ డా. హైమవతి ఒమిక్రాన్ కేసులపై ప్రస్తుతం రాష్ర్టంలో ఉన్న పరిస్థితులపై మీడియాతో మాట్లాడారు. రాష్ర్టంలో ప్రస్తుతం రెండు ఒమిక్రాన్ యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు.కేంద్రం డిసెంబర్ మొదటి తేదీ నుంచి కోవిడ్ నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చిందని తెలిపారు. రాష్ర్టంలో 99శాతం మందికి మొదటి డోసు వేయడం పూర్తయిందని వెల్లడించారు. మేము నవంబర్ చివరి వారం నుంచే ప్రయాణికులను ట్రేస్ చేయటం ప్రారంభించడంతో కేసులు పెరగకుండా చూడగలిగామని పేర్కొన్నారు. 72 శాతం…
దేశంలో కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 3, 2022 నాటికి భారత్‌లో గరిష్ట స్థాయికి కేసులు చేరుకోవచ్చని ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుత ట్రెండ్ ప్రకారం ఫిబ్రవరి నాటికి కరోనా థర్డ్ వేవ్ వస్తుందని వారు అంచనా వేశారు. థర్డ్ వేవ్‌ను అంచనా వేయడానికి పరిశోధకుల బృందం గాస్సియన్ మిక్సర్ మోడల్‌ను ఉపయోగించింది. Read Also: ఒమిక్రాన్ పై యూపీ సర్కార్ కీలక నిర్ణయం…