ప్రపంచ వ్యాప్తంగా ఓమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుంది.. దీంతో ప్రపంచ దేశాలు ఇప్పటికే అప్రమత్తం అవుతున్నాయి. కొన్ని దేశాల్లో రెండో డోసు పంపిణీ చేయడంలో వేగం పెంచాయి. అలాగే మరి కొన్ని దేశాల్లో మూడో డోసు పంపిణీ చేయడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. కానీ ఇజ్రాయిల్ దేశ ప్రభుత్వం ఓమిక్రాన్ వేరియంట్ ను ఎదుర్కొవడానికి ఏకంగా నాలుగో డోసు పంపిణీ చేయడానికి సిద్ధమైపోయింది. ఇప్పటికే ఇజ్రాయిల్‌లోని 150 మంది వైద్య సిబ్బందికి ఫైజర్ వ్యాక్సిన్ నాలుగో డోసును…
ఏపీలో ఒమిక్రాన్ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం మధ్యాహ్నం నాడు వైద్యశాఖ అధికారులతో అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా వైద్యశాఖలో సాధారణ బదిలీలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు వైద్యశాఖలో ఉద్యోగాల భర్తీపై సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి నాటికి ఆస్పత్రుల్లో పూర్తిస్థాయి సిబ్బంది అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. అదే సమయానికి కొత్త నియామకాలు కూడా పూర్తి చేయాలని అధికారులను సీఎం జగన్…
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఈశాన్య రాష్ట్రాలకు పాకింది. సోమవారం మణిపూర్ రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇంఫాల్ పశ్చిమ జిల్లాకు చెందిన 48 ఏళ్ల వ్యక్తి ఇటీవల టాంజానియా నుంచి ఢిల్లీ మీదుగా ఇంఫాల్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అతను స్వదేశానికి వచ్చిన ఎనిమిది రోజుల తర్వాత కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. టాంజానియా నుంచి రాష్ట్రానికి చేరుకోగానే డిసెంబర్ 21న ఆ వ్యక్తి నుంచి నమూనాలు సేకరించామని మణిపూర్ హెల్త్ డిపార్ట్‌మెంట్…
దేశంలో ఒమిక్రాన్ టెన్షన్ రోజురోజుకు పెరిగిపోతున్నది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకలపై అనేక రాష్ట్రాలు ఇప్పటికే నిషేధం విధించాయి. తాజాగా కేరళ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ అమలు…
ప్రపంచ వ్యాప్తంగా కరోనా, ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. కేసులు పెరిగిపోతుండటంతో అనేక దేశాల్లో ఆంక్షలు అమలు చేస్తున్నారు. యూరప్‌తో పాటుగా ఆస్ట్రేలియాలోనూ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆస్ట్రేలియాలోని అత్యధిక జనాభా కలిగిని న్యూసౌత్‌వేల్స్‌లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. న్యూసౌత్‌వేల్స్ రాష్ట్రంలో ఒక్కరోజులో 6 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. కరోనా కేసులతో పాటుగా ఒమిక్రాన్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. తాజాగా ఆస్ట్రేలియాలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది.…
తెలంగాణలో ఒమిక్రాన్ కరోనా వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో ముగ్గురికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని అధికారులు వెల్లడించారు. ఇటీవల దుబాయ్ నుంచి ముస్తాబాద్ మండలానికి వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ సోకింది. అయితే అతడి భార్య, తల్లితో పాటు స్నేహితుడికి కూడా ఒమిక్రాన్ లక్షణాలు కనిపించడంతో అధికారులు టెస్టులు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. Read Also: తీన్మార్ మల్లన్నపై ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు తాజాగా నమోదైన మూడు…
గత రెండు సంవత్సరాలుగా యావత్తు ప్రపంచ దేశాలతో పాటు భారత్‌ను పట్టిపీడిస్తున్న కరోనా మహ్మారి బెడద ఇంకా తగ్గడం లేదు. తాజాగా దేశవ్యాప్తంగా కొత్తగా 6,531 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా దేశంలో కరోనా నుండి గడిచిన 24 గంటల్లో మరో 7,141 మంది కోలుకొని ఆసుప్రతి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 75,841 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ భారత్‌లోని పలు…
దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించింది. ఇటీవల ఈ వేరియంట్ భారత్‌లోకి కూడా ప్రవేశించింది. అయితే రోజురోజుకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగతూ వస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా మరో 69 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్‌లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 530కి చేరుకుంది. మహారాష్ట్రలో మొత్తం 141 ఒమిక్రాన్ కేసులు ఉండగా, ఢిల్లీలో 79, కేరళలో 57, గుజరాత్‌లో 49, తెలంగాణలో 44, ఏపీలో 6 చొప్పున…
ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5గంటల వరకు ఢిల్లీలో కర్ఫ్యూ అమలులో ఉండనుంది. ఇవాళ ఢిల్లీలో 290 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య 16శాతం పెరిగింది. మరోవైపు పాజిటివిటీ రేటు ఐదు శాతానికి మించడంతో… ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. దీంతో ఢిల్లీలో న్యూఇయర్ వేడుకలకు ఫుల్‌స్టాప్ పడింది.