దేశంలో కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 3, 2022 నాటికి భారత్‌లో గరిష్ట స్థాయికి కేసులు చేరుకోవచ్చని ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుత ట్రెండ్ ప్రకారం ఫిబ్రవరి నాటికి కరోనా థర్డ్ వేవ్ వస్తుందని వారు అంచనా వేశారు. థర్డ్ వేవ్‌ను అంచనా వేయడానికి పరిశోధకుల బృందం గాస్సియన్ మిక్సర్ మోడల్‌ను ఉపయోగించింది.
Read Also: ఒమిక్రాన్ పై యూపీ సర్కార్ కీలక నిర్ణయం
ఈ మేరకు కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ డేటాతో పాటు ఒమిక్రాన్ కేసుల పెరుగుదల ఆధారంగా పరిశోధకులు నివేదిక రూపొందించారు. తమ పరిశీలన ప్రకారం జనవరి 30, 2020లో భారత్‌లో అధికారికంగా తొలి కరనా కేసు నమోదైందని… డిసెంబర్ నెల మధ్య నుంచి ఒమిక్రాన్ కేసులు పెరుగుతాయని.. అవి ఫిబ్రవరి 3, 2022 నాటికి గరిష్ట స్థాయికి చేరతాయని పరిశోధకులు వివరించారు. గతంలోనూ కరోనా సెకండ్ వేవ్ విషయంలో ఐఐటీ కాన్పూర్ పరిశోధకుల అంచనాలు నిజం కావడంతో ఇప్పుడు థర్డ్ వేవ్‌పై వారు చెప్పిన విషయాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. అయితే వ్యాక్సినేషన్ అంశాన్ని ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు ఈ అధ్యయనంలో పరిగణనలోకి తీసుకోలేదు. అందువల్ల ఫిబ్రవరి నాటికి ఎన్ని కేసులు వస్తాయన్న విషయంపై తాజా అధ్యయనంలో పేర్కొనలేదు.