కరోనా సమయంలో ఎంతగానో ప్రాచుర్యం పొందిన ఆనందయ్య పసరు మందుకు జనాలు సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. అప్పట్లో దీనిపై అయిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. ప్రభుత్వం అనుమతులు ఇవ్వకున్నా జనాలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఒకానొక సమయంలో జనాలను కంట్రోల్ చేసేందుకు అటు ఏపీ ప్రభుత్వానికి సైతం ఇబ్బందులు తప్పలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆనందయ్య మందును శాస్త్రీయ పద్ధతుల్లో తయారు చేయడం లేదంటూ మందు పంపిణీ నిలిపి వేయాలని…
ఒమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో పలు వీసాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూలను అమెరికా విదేశాంగ శాఖ తాత్కాలికంగా రద్దు చేసింది. నాన్ ఇమ్మిగ్రెంట్ వర్క్ వీసా హెచ్1బీతో పాటు హెచ్3, హెచ్4 వీసాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈ రద్దు వర్తిస్తుందని తెలిపింది. వచ్చే ఏడాది 2022 వరకు వీటిని రద్దు చేస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం పేర్కొంది. దీనిపై స్థానిక పరిస్థితులను బట్టి ఆయా ప్రాంతీయ కాన్సులేట్/ఎంబసీ అధికారులు తుది…
రోజురోజుకు తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. కరోనా కేసుల వైద్యం కోసం అదనపు పడకలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నా దాని తీవ్రత తక్కువేనని ఆయన తెలిపారు. కరోనా థర్డ్ వేవ్ వచ్చిన తట్టుకొనే విధంగా 1400 పడకలు హైద్రాబాద్ లో ఏర్పాటు చేశామన్నారు. నిలోఫర్‌లో 800 పడకలు ఏర్పాటు చేస్తున్నామని, మరో 6…
కరోనా రక్కసి కొత్త కొత్తగా రూపాంతరాలు చెంది ప్రజలపై విరుచుకుపడుతోంది. ఇప్పటికే కరోనా డెల్టా వేరియంట్తో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ ఇప్పడు భారత్‌లో వ్యాప్తి చెందుతోంది. రోజు రోజుకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 358 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే తాజాగా తమిళనాడులో కూడా ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్ ఉన్నతస్థాయి అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు.…
ఇప్పటికే డెల్టా వేరియంట్ సతమతమవుతున్న భారత్‌కు ఒమిక్రాన్ టెన్షన్ మొదలైంది. ఇటీవల భారత్‌లోకి ప్రవేశించిన ఈ వేరియంట్ క్రమక్రమంగా రాష్ట్రాలను ఆక్రమిస్తోంది. ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా 89 ఒమిక్రాన్ కేసులు నమోదవడంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 361కు చేరింది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో కోవిడ్ నిబంధనలు మరోసారి కఠినతరం చేస్తున్నారు. ఢిల్లీలో క్రిస్మస్, న్యూయర్ వేడుకలపై నిషేధం విధించారు. అలాగే ముంబైలో రాత్రిపూట 144 సెక్షన్‌ను…
దేశంలో కోవిడ్, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ప్రధాని మోడీ సమీక్షను నిర్వహించారు. కోవిడ్ కట్టడికి రాష్ట్రాలు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ మందులు, ఆక్సీజన్ సిలీండర్లు, కాన్సన్‌ట్రేటర్లు అందుబాటులో ఉంచాలని అన్నారు. పీఎస్ఏ ప్లాంట్స్, ఐసీయూ బెడ్స్ సిద్ధంగా ఉంచాలని అన్నారు. కరోనా వ్యాక్సిన్‌ను వేగవంతం చేయాలని తెలిపారు. కోవిడ్‌పై యుద్ధం ముగియలేదని, ఇంకా పోరాటం చేయాలని అన్నారు. వైరస్ నియంత్రణకు కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేయాలని తెలిపారు. జిల్లాస్థాయిలో ప్రత్యేక వార్…
ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఇండియాలో పలు చోట్ల ఒమిక్రాన్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ వేరియంట్ కేసులు తెలుగు రాష్ట్రాలలోనూ నమోదవుతున్నాయి. ఏపీతో పోలిస్తే తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఒమిక్రాన్ కేసు నమోదైంది. గల్ఫ్ నుంచి వచ్చిన వ్యక్తికి మూడురోజుల క్రితం ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో బాధితుడిని హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. Read…
ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ మధ్యప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం సూచనల మేరకు రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్టు సర్కార్ పేర్కొన్నది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నట్టు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మధ్యప్రదేశ్‌లో ఇప్పటి వరకు ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా నమోదుకాలేదు. ముందస్తు చర్యల్లో భాగంగా నైట్ కర్ఫ్యూ విధించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఇదిలా ఉంటే, మహారాష్ట్రలో కొత్తగా 23…
దేశంలో ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో జాగ్రత్తగా ఉండాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలకు సూచించింది. కోవిడ్ మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఢిల్లీ సర్కార్ ప్రకటించింది. కొత్త వేరియంట్‌ను ఎదుర్కొనడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రతిరోజూ లక్ష కోవిడ్ కేసులు వచ్చినా చికిత్స అందించడంతో పాటు ప్రతిరోజూ 3 లక్షల పరీక్షలు నిర్వహించే సామర్థ్యాన్ని కూడా సిద్ధం చేసుకున్నట్టు ఢిల్లీ సర్కార్ స్పష్టం చేసింది. Read: లైవ్: ఏపీ మంత్రి…