కరోనాకు మందు తయారుచేసి సంచలనం సృష్టించిన ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య తాజాగా ఒమిక్రాన్ వేరియంట్‌కు కూడా మందు తయారు చేశారు. సుమారు 22 రకాల దినుసులతో ఈ మందును తయారుచేసినట్లు ఆనందయ్య వెల్లడించారు. ఒమిక్రాన్ సోకకుండా అందరూ ముందు జాగ్రత్తగా బూస్టర్ డోస్ మాదిరి ఈ మందును వేసుకోవాలని ఆనందయ్య సూచించారు. ఈ మందును ఒకేరోజు రెండు పూటలా తీసుకుంటే సరిపోతుందన్నారు.
ఈ మేరకు ఒమిక్రాన్ మందును పంపిణీ చేస్తున్నట్లు ఆనందయ్య పేర్కొన్నారు. ఒమిక్రాన్ సోకిన వారు మందు కోసం తనను సంప్రదించవచ్చని ఆయన సూచించారు. ప్రస్తుతం ఈ మందును ఒమిక్రాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న బ్రిటన్, అమెరికా వంటి దేశాలకు ఎక్కువగా పంపిస్తున్నామన్నారు. ఈ మందును ఏడాది పాటు నిల్వ ఉంచుకోవచ్చని ఆనందయ్య తెలిపారు. అయితే మందు తీసుకునే వారు 15 రోజుల పాటు ఎలాంటి మాంసాహారం, మద్యం తీసుకోకూడదని హితవు పలికారు. కాగా ఒమిక్రాన్‌కు ఆనందయ్య మందుకు తమ అనుమతి లేదని శుక్రవారం నాడు ఆయుష్ శాఖ వెల్లడించింది. ఈ విషయంపై ఎవరూ తమను సంప్రదించలేదని… గుర్తింపు లేని వ్యక్తులు అందించే మందులను ఆయుర్వేదిక్ మందులుగా పరిగణించి వాడొద్దని ఆయుష్ శాఖ సూచించింది.