దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా రెట్టింపు అవుతున్నది. ఈ ఒక్కరోజే దేశంలో 50 వరకు కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్రం రాష్ట్రాలకు కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం, కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కంటైన్మెంట్, బఫర్ జోన్లు ఏర్పాటు చేయాలని సూచించింది. అవసరమైతే నైట్ కర్ఫ్యూ విధించాలని రాష్ట్రాలకు సూచించింది. దీంతో గుజరాత్ ప్రభుత్వం అప్రమత్తం అయింది. Read: ఆవులపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు… గుజరాత్‌లోని అహ్మదాబాద్, గాంధీనగర్,…
దేశంలో ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే 17 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ విస్తరించింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కట్టడికి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఇక ఇదిలా ఉంటే, తమిళనాడులో ఒమిక్రాన్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. తమిళనాడులో తాజాగా 33 కేసులు నిర్ధారణ జరిగినట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈనెల 15 వ తేదీన తొలి ఒమిక్రాన్ కేసు నమోదవ్వగా, ఈరోజు మరో 33 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం 34 కేసులు…
దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలో 293 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 17 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకలను దృష్టిలో పెట్టుకొని కోవిడ్, ఒమిక్రాన్ కట్టడికి చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం మరోసారి సూచించింది. ఒమిక్రాన్ కట్టడిపై కేంద్రం అలర్ట్ అయింది. కేసుల పెరుగుదలపై రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, ఒమిక్రాన్ పట్ల అన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించింది. ఎక్కువ కేసులున్న కోవిడ్ క్లస్టర్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని,…
ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తోంది. కేసులు భారీగా పెరుగుతున్నాయి. కేసులు పెరిగిపోతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అనేక దేశాల్లో తిరిగి ఆంక్షలు విధించారు. కొత్త సంవత్సరం వేడుకలను బ్యాన్ చేశారు. రోజు రోజుకు భారీ సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ను తప్పనిసరి చేశాయి వివిధ దేశాలు. అయితే, వేగంగా వ్యాప్తి చెందే ఒమిక్రాన్ వేరియంట్‌ను గుడ్డతో తయారు చేసిన మాస్క్‌లు ఎంతవరకు నిలువరించగలుగుతాయి అనే దానిపై ప్రస్తుతం పరిశోధనలు చేస్తున్నారు.…
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు వాయు వేగంతో దేశాలను చుట్టేస్తోంది… సౌతాఫ్రికా నుంచి ఇతర దేశాలకు వ్యాప్తిచెందిన ఈ మహమ్మారితో ఇప్పుడు బ్రిటన్, అమెరికా లాంటి దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.. అయితే, ఇప్పటికే పలు రకాల అధ్యయనాల్లో చాలా వేగంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపిస్తుందని తేలింది.. తాజాగా మరో స్టడీలో ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి.. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్‌లో వ్యాధి తీవ్రత, ఆస్పత్రిపాలయ్యే అవకాశం తక్కువగా ఉంటుందని తేల్చింది యూనివర్సిటీ…
సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచదేశాలను టెన్షన్ పెడుతూనే ఉంది… ఇప్పటికే భారత్‌లోని చాలా రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది.. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ భారీ నష్టాన్ని మిగిల్చడంతో.. కొత్త వేరియంట్‌ను ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై దృష్టిసారించారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఈ నేపథ్యంలో ఇవాళ కీలక సమావేశం నిర్వహించనున్నారు… దేశంలో కోవిడ్ వ్యాప్తి పరిస్థితిని సమీక్షిస్తారు. రోజురోజుకీ కోవిడ్ కేసులు పెరుగుతుండగా.. మరోవైపు…
ఇప్పుడిప్పుడే కరోనా డెల్టా వేరియంట్ నుంచి బయటపడుతున్న భారత్‌ను ఒమిక్రాన్ టెన్షన్ పట్టిపీడిస్తోంది. గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే భారత్‌లోకి ప్రవేశించింది. అంతేకాకుండా దాని ప్రభావాన్ని రోజురోజుకు పెంచుకుంటూ పోతోంది. దేశంలో 17 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వ్యాపించింది. తాజాగా దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు 39 నమోదయ్యాయి. దీంతో దేశంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 263కు చేరుకుంది. తెలంగాణలో కొత్తగా 14, గుజరాత్ 9, కేరళలో 9, రాజస్థాన్‌లో 4, హర్యానా,…
తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలో మరో 14 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం రాష్ట్రంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 38కి చేరింది. ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన 14 మందికి కరోనా నిర్ధారణ జరిగినట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలియజేసింది. కేసులు పెరిగిపోతుండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఇప్పటికే మాస్క్‌ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. మాస్క్ లేకుంటే భారీ జరిమానాలు విధిస్తున్నారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా అవసరమైతే నైట్…
ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. డెల్టా వేరియంట్ కంటే మూడు రెట్ల వేగంతో ఈ వేరియంట్ విస్తరిస్తోంది. ఇలానే కొనసాగితే మరికొన్ని రోజుల్లో ప్రపంచంలోని అన్ని దేశాలను చుట్టేయడం ఖాయమని చెబుతున్నారు. ఈ స్థాయిలో కేసులు పెరగడానికి కారణాలు ఏంటి? ఎందుకు కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి అనే విషయాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్‌ను సౌతాఫ్రికాలో గుర్తించారు. ఒమిక్రాన్ వేరియంట్‌కు హెచ్ఐవీ తో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు…