తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమ క్రమంగా పెరిగి పోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం లో కొత్తగా 3 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో 44 కి ఒమిక్రాన్ కేసుల సంఖ్య చేరింది. ఇందులో రెండు నాన్ రిస్క్ దేశాల నుండి వచ్చిన కేసులు కాగా… ఒకటి ఒమిక్రాన్ పేషేంట్ కాంటాక్ట్ లో మరో కేసు నమోదు అయింది. ఇక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో యాక్టివ్ ఒమిక్రాన్ కేసులు సంఖ్య 34 గా…
ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ మన దేశంలోనూ పలు రాష్ట్రాలకు వ్యాపిస్తోంది. ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీ సాయిబాబా ఆలయంపై ఒమిక్రాన్ ప్రభావం పడింది. మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ విధించడంతో అధికారులు ఆలయ వేళల్లోనూ మార్పులు చేశారు. షిర్డీ సాయిబాబా ఆలయాన్ని రాత్రి వేళ మూసివేస్తున్నట్టు షిర్డీసాయి సంస్థాన్ ఒక ప్రకటనలో తెలిపింది. Read Also: 2021: రివైండ్ – ప్రభావం…
ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇండియాలో కూడా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌లతో ప్రజలు, ప్రభుత్వాలు ఆర్థికంగా చాలా నష్టపోయాయి. అయితే ఇప్పుడు ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్ విధిస్తే ఆర్థిక రాష్ట్రాల్లో కురుకుపోయే ప్రమాదం లేకపోలేదు. ఇటు చూస్తే ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో కర్ణాటకలో నైట్ కర్ఫ్యూ…
గత 2 సంవత్సరాలుగా అగ్రదేశమైన అమెరికాతో పాటు ప్రపంచ దేశాల్లో భయాందోళన సృష్టిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా పూర్తి తగ్గడం లేదు. కరోనా కొత్తకొత్తగా రూపాంతరాలు చెందుతూ ప్రజలు విరుచుకుపడుతోంది. ఇటీవల దక్షిణాఫ్రికాలో మరో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి రావడంతో ఇప్పడు మరోసారి ప్రపంచ దేశాలు సైతం భయాందోళన చెందుతున్నాయి. అయితే తాజాగా ఇండియాలో 6,987 కరోనా కేసులు రాగా, 162 మంది కరోనా సోకి మరణించారు. అయితే ప్రస్తుతం 76,766 కరోనా కేసులు…
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా దేశంలోని రాష్ట్రాల్లో పాకుతోంది. ఇప్పటికే దేశంలోని 19 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. ఏపీలో కూడా ఒమిక్రాన్ కేసులు వెలుగు చూస్తున్నాయి. అయితే తాజాగా మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదవడంతో ఆయా జిల్లాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దక్షిణాఫ్రికాలో ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి హైదరాబాద్ మీదుగా ప్రకాశం జిల్లా ఒంగోలుకు చేరుకున్నాడు. అయితే ఆ వ్యక్తికి దక్షిణాఫ్రికాలో నిర్వహించిన టెస్టుల్లో నెగటివ్…
కరోనా మహమ్మారి ప్రజలను వదలడం లేదు. ఇప్పుడు మరోసారి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచం మొత్తం భయాందోళనలను సృష్టించింది. తాజాగా బయటపడిన మరో వేరియంట్ డెల్మిక్రాన్ హడలెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. ప్రజలను జాగ్రత్తగా ఉండమని కోరుతూ, మరోమారు లాక్ డౌన్ పరిస్థితులు రాకుండా ఉండడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది. అయితే కొంతమంది ఇంకా కోవిడ్-19 వ్యాక్సిన్ ను తీసుకోలేదు. అది తీసుకుంటే కరోనాతో పాటు ఒమిక్రాన్ కూడా తగ్గుతుందనేది వైద్యుల సలహా.…
కరనా రక్కసి మరోసారి ఒమిక్రాన్ రూపంలో రెక్కలు చాస్తోంది. ఇప్పటికే డెల్టా వేరియంట్‌తోనే ప్రపంచ దేశాలు సతమతమవుతుంటే.. ఇప్పుడు ఒమిక్రాన్ పలు దేశాలకు వ్యాపించి దాని ప్రభావాన్ని చూపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు సంఖ్య 1,83,240కి చేరుకుంది. ఇప్పటి వరకు 31 మంది ఒమిక్రాన్ సోకి మృతి చెందారు. యూకేలో 1,14,625 ఒమిక్రాన్ కేసులు ఉండగా, డెన్మార్క్‌లో 32,877, కెనడాలో 7,500, యూఎస్‌లో 6,331 చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పటికే పలు దేశాలు విదేశాల…
దక్షిణాఫ్రికాలో గత నెల వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే భారత్‌లోని పలు రాష్ట్రాల్లో వ్యాపించింది. అయితే తాజాగా ఏపీలో మరో ఒమిక్రాన్ కేసు నమోదవడంతో స్థానికంగా కలకలం రేగింది. ఉద్యోగం కోసం దక్షిణాఫ్రికాలో ఉంటూ ఇటీవలే ప్రకాశం జిల్లా ఒంగోలుకు వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ గా నిర్దారణైంది. విదేశాలలో చేయించుకున్న పరీక్షల్లో నెగిటివ్ రాగా, ఒంగోలులో మరోసారి నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ వ్యక్తి శ్యాంపిల్స్‌ను హైదరాబాద్…
కరోనా వ్యాక్సినేషన్ పై ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. జనవరి 3 నుంచి పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభం కానుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. 15-18 ఏళ్ళ వారికి వ్యాక్సిన్ కొనసాగుతుందన్నారు మోడీ. జాతి నుద్దేశించి ప్రధాని మోడీ ఇవాళ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఒమిక్రాన్ వ్యాపిస్తోందని… ఒమిక్రాన్ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. పిల్లల కోసం బెడ్స్ సిద్ధంగా వున్నాయని… కరోనాను మనం సమర్థంగా ఎదుర్కొన్నామన్నారు. మనం వ్యాక్సిన్ల విషయంలో అందరికంటే ముందున్నాని…