Off The Record: తూర్పు గోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేరు చెబితేనే నియోజకవర్గంలో చాలామంది హడలిపోతున్నారట. అలాగని ఆయనేమన్నా… అసాంఘిక శక్తుల్ని ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారా.. అవినీతిపరుల భరతం పడుతున్నారా అంటే…. అబ్బే.. అలాంటిదేం లేదు. అసలు ఎమ్మెల్యే అనుచరుల తీరే తేడాగా ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయట లోకల్‌గా. టీడీపీ, బీజేపీతో పొత్తు ఉన్నా… అది రాజకీయం వరకేగానీ… మిగతా వ్యవహారాల్లో మన రూటే సపరేటు అంటున్నారట ఈ జనసేన శాసనసభ్యుడి అనుచరులు. ప్రతి పనికి పర్సంటేజ్ కామన్ అయిపోయిందన్నది లోకల్ టాక్. రాజమండ్రి ఎయిర్ పోర్ట్ ఎదుట జనసేన ఆఫీస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ పేరుతో ఎమ్మెల్యే భారీగా బలవంతపు విరాళాలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇక నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పని కాంట్రాక్ట్ దక్కాలన్నా…. ముందు డీల్ కుదుర్చుకోవాల్సిందేనట. స్థానిక టీడీపీ, బీజేపీ నాయకులు శంకుస్థాపన రోజు శిలాఫలకాల దగ్గర ఫోటోలకు ఫోజులివ్వడానికి పరిమితమైతే…. ఆ తర్వాతి వ్యవహారాలు మొత్తాన్ని ఎమ్మెల్యే అనుచరులు చక్కబెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు.
Read Also: Rinku Singh: యోగి సర్కార్ క్రికెటర్ రింకు సింగ్ కు బిగ్ గిఫ్ట్.. ఆ విభాగంలో ప్రభుత్వాధికారిగా..
రాజానగరం నియోజకవర్గంలో 500 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి పనులు వివిధ గ్రామాల్లో జరుగుతున్నాయి. వీటన్నిటిలో నాకంత, నీకింత అన్న తంతే నడుస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ ఇటీవల రేవ్ పార్టీలు, పేకాట శిబిరాలు పెరిగిపోయాయంటున్నారు. ఎమ్మెల్యే బలరామకృష్ణ మనుషుల ప్రోద్బలంతోనే… అవన్నీ నడుస్తున్నట్టు ఆరోపిస్తున్నారు వైసీపీ నాయకులు. అటు ఇసుక దందా దర్జాగా కొనసాగుతోందట. కోట్ల రూపాయల విలువైన ఇసుకను ఎమ్మెల్యే మనుషులు కొట్టేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు రాజానగరంలో. స్థానిక అధికారుల అండతో…. పగలు అధికారికంగా నామ మాత్రపు వ్యవహారాలు నడిపించి…. రాత్రయితే ఇసుక ర్యాంపుల్లో చెలరేగిపోతోందట మాఫియా. అధికారిక అనుమతులు ఉన్న ర్యాంపులకంటే… లేనివే ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. మైనింగ్ అక్రమాలు జరిగితే ఖబడ్దార్ అంటూ.. ఒకపక్క ఎమ్మెల్యే బత్తుల హెచ్చరిస్తున్నా.. అక్రమాలు మాత్రం ఆగడం లేదట. ఆయన అలాగే చెబుతుంటారు అనుకుంటూ…. అనుచరులు అడ్డగోలుగా ఇసుక దోపిడీ చేస్తున్నారన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట. సీతానగరం, ముగ్గళ్ల, కాటవరం ఇసుక ర్యాంపుల్లో అక్రమ వ్యవహారాలు నడిపిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇక నియోజకవర్గంలో మద్యం మాయాజాలం వేరే లెవల్ అట. పదుల సంఖ్యలో ఉన్న అధికారిక దుకాణాలకు అనుబంధంగా… వందల సంఖ్యలో బెల్ట్ షాపులున్నాయన్నది లోకల్ వాయిస్. ఎమ్మెల్యే అనుచరులే నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడి వ్యాపారానికి తెరలేపినట్టు తెలుస్తోంది.
Read Also: Hyderabad: ఓయో రూంలో యువతి మృతదేహం.. ఇది హత్యా.. ఆత్మహత్యా..?
అన్ని షాపుల దగ్గర అనధికార పర్మిట్‌రూమ్స్ పెట్టి లూజ్ సేల్స్ సైతం చేసేస్తున్నట్టు సమాచారం. దీనివల్ల కొన్ని చోట్ల కల్తీ మద్యం కూడా చెలామణిలో ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మద్యం దుకాణాల సమయ పాలన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని అంటున్నారు స్థానికులు. షాపుల వెనక నుంచి, పక్క నుంచి ఎనీటైం మందు స్కీమ్ అమలవుతోందన్న సెటైర్స్ సైతం నడుస్తున్నాయి. ఇంత జరుగుతున్నా… ఎక్సైజ్ అధికారులు మాత్రం మాకేమీ కనిపించడంలేదన్నట్టుగా ఉంటున్నారట. కారణం ఏంటంటే…. ఎమ్మెల్యే మనుషులే అన్నది రాజానగరంలో చెప్పుకుంటున్న మాట. అటు మట్టి తవ్వకాలతో దుమ్మురేపుతున్నారట బత్తుల అనుచరులు. గ్రామాల్లో చెరువులు అభివృద్ధి పేరుతో మట్టి తవ్వేసి అమ్ముకుంటూ… లక్షల రూపాయలు జేబుల్లో వేసుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. శాసనసభ్యుడికి తెలియకుండా అనుచరులు ఇవన్నీ చేయగలుగుతారా అన్నది లోకల్ క్వశ్చన్. ఇవన్నీ కలగలిపి మొత్తంగా కూటమి మీదనే వ్యతిరేక ప్రభావం చూపుతాయని, ఎమ్మెల్యే, ఆయన అనుచరుల తీరు మారకుంటే మూడు పార్టీలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న వార్నింగ్స్ వస్తున్నాయట.