లావు శ్రీకృష్ణదేవరాయలు..... పార్టీలు వేరైనా...వరుసగా రెండు సార్లు నరసరావుపేట ఎంపీగా గెలిచిన నాయకుడు. 2019లో తొలిసారి వైసీపీ తరపున, 2024లో టీడీపీ నుంచి లోక్‌సభలో అడుగుపెట్టారాయన. అంతవరకు బాగానే ఉన్నా... తన నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలతో లావు సంబంధాలపై కొత్త చర్చ జరుగుతోంది. పార్టీ మారినా ఆయన తీరు మాత్రం మారలేదా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్‌లో. 2019లో వైసీపీ నుంచి గెలిచినప్పుడు మొదట్లో అంతా బాగానే ఉంది. రాజకీయాలకు కొత్త కావడంతో అందరితో కలిసిపోయినట్టు…
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే వివాదాస్పదంగా మారిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి మోగిపోతోంది. సిట్ దర్యాప్తులో సంచలన అంశాలు వెలుగు చూస్తున్న క్రమంలో కవిత ఫోన్ ట్యాప్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వందల మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు ప్రచారం జరగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా అదే పార్టీ ఎమ్మెల్సీ కవిత ఫోన్ ట్యాప్ చేశారా? అన్న చర్చ మొదలైంది.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో ఈనెల 9న చనిపోయారు. దీంతో... ఈ అసెంబ్లీ సీటు ఖాళీ అయింది. ఇందుకు సంబంధించి శాసనసభ సెక్రటరీ గెజిట్ ఇచ్చారు కూడా. అటు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పూర్తి సమాచారం చేరింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో.. బీఆర్ఎస్ క్యాడర్ పరిస్థితి వెన్న తిన్నవాడు వెళ్లిపోతే.. చల్ల తాగిన వాడిని చావ మోదినట్లు తయారైందట. ఒక వైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలు స్థానిక సంస్ధల ఎన్నికల కోసం.. వరుసగా గ్రామ, మండల, నియోజకవర్గ స్దాయి సమీక్షా సమావేశాలు పెట్టుకుంటుంటే.. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్లో మాత్రం ఆ సౌండే లేదు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా అంత మొనగాళ్ళు లేరని మీసాలు తిప్పిన మాజీలంతా.. ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారట.
జగన్.. గుర్తు పెట్టుకో.. నిన్ను అధహ్ పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కల్యాణే కాదు.., నా పార్టీ జనసేనే కాదు.., ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్ ఇవి. అయితే, అది పవన్ వల్ల జరిగిందా? లేక ఇతరత్రా అన్ని కారణాలు కలిసి కొట్టాయా అన్నది వేరే సంగతి గానీ... మొత్తం మీద ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసింది.
ఓటమి నుంచి కోలుకుని ఫుల్లీ రీఛార్జ్ మోడ్‌లోకి వచ్చేసిన వైసీపీ అధ్యక్షుడు జగన్.... వరుస పర్యటనలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినందున ఇక హనీమూన్ పిరియడ్ ముగిసిందని, ప్రభుత్వ వైఫల్యాలపై దూకుడుగా వెళ్ళాలని భావిస్తున్నారట ఆయన.
రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు వివాదాలు రెండు వైపులా పదునున్న కత్తి లాంటివి. ఒక్కోసారి... అవే పాపులర్ చేస్తాయి. ఇంకోసారి ఎత్తి అగాధంలోకి పడేస్తాయి. హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలో ఈ రెండూ జరిగిపోయాయి. ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్‌గా కెరీర్ ప్రారంభించిన మాధవ్.... 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. పార్టీలోకి ఎంటర్ అవుతూనే... ఎంపీ టికెట్ దక్కడం, హిందూపురం నుంచి భారీ మెజారిటీతో గెలవడం చకచకగా జరిగిపోయాయి.
బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారశైలి ఇటీవల పార్టీలో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఆయన లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ అన్నీ తేడాగానే ఉంటున్నట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. సొంత పార్టీ నాయకుల మీద చేస్తున్న కామెంట్స్ వివాదాస్పదం అయిన సందర్భాలు సైతం ఉన్నాయి.
సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లా టూర్స్‌పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో. నెత్తిన నోరుంటే పెత్తనం సాగుతుందనుకున్న నేతలకు... ఇప్పుడు కాలం కలిసి రావట్లేదా అంటూ వ్యంగ్యంగా మాట్లాడేసుకుంటున్నారు హాస్తం పార్టీలోని కొందరు నేతలు.