ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా మొత్తం మీద పలాస రాజకీయాలు కాస్త తేడాగా ఉంటాయని చెప్పుకుంటారు. అందుకు తగ్గట్టే.... అసెంబ్లీ ఎన్నికల తర్వాత జిల్లా అంతా ప్రశాంతంగా ఉంటే... పలాసలో మాత్రం రాజకీయ కొలిమి రగులుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు పొలిటికల్ సెగలు పెరిగిపోతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో మంటెక్కిస్తున్నారు నేతలు.
మెదక్ జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటి మెదక్, రెండోది నర్సాపూర్. నర్సాపూర్ ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట. తర్వాత హస్తం పార్టీ హవా నడిచిన సెగ్మెంట్. కానీ... గత మూడు విడతల నుంచి బీఆర్ఎస్ విజయ పరంపర కొనసాగుతోంది. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇక్కడ కాంగ్రెస్ సమీకరణలు మారిపోయాయి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న కంఠారెడ్డి తిరుపతి రెడ్డి మెదక్ అసెంబ్లీ టికెట్ ఆశించారు.
మాజీ మంత్రి చిన్నారెడ్డిని కాదని మేఘారెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం, ఆయన గెలవడంతో ముసలం మొదలైందంటున్నారు. ఆ తర్వాత చిన్నారెడ్డికి రాష్ట్ర ప్లానింగ్ కమిటీ వైస్ చైర్మన్ పదవి కట్టబెట్టినా.... ఆయన మాత్రం నియోజక వర్గానికే పరిమితం కావడంతో ప్రోటోకాల్ సమస్యతో పాటు వర్గపోరు ముదిరి పాకాన పడిందని అంచనా వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు వేగం పెంచారు తెలంగాణ అధికారులు. ప్రభాకర్‌రావు విచారణ కొనసాగుతున్న క్రమంలో... ఇక ఏ మాత్రం ఆలస్యం కానివ్వకూడదని భావిస్తోందట ప్రభుత్వం. అటు బాధితులు...ఇటు సాక్షులను విచారిస్తోంది సిట్ బృందం.
తెలంగాణ కాంగ్రెస్ విషయంలో ఏఐసీసీ పెద్దలకు క్లారిటీ లేకుండా పోయిందా? తొమ్మిది నెలల నుంచి పోస్ట్‌ల భర్తీలో ఎందుకు కన్ఫ్యూజ్ అవుతోంది? అరకొర కమిటీతో ఇంకెన్నాళ్ళు బండి లాగిస్తారు? అత్యంత కీలకమైన పదవుల భర్తీకి ఇంకెన్నేళ్ళు పడుతుంది? పార్టీ పెద్దల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదా? లెట్స్ వాచ్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా….మహేష్ గౌడ్‌ను నియమించిన ఏఐసీసీ ఆయనకి టీంని సమకూర్చడానికి తొమ్మిది నెలలు పట్టింది. అయినాసరే… ఇప్పటికీ పూర్తి స్థాయిలో పీసీసీ కమిటీ నియామకం…
వైసీపీ నుంచి సస్పెండ్ అయ్యాక.... ఇటు ఇంటికి, అటు పార్టీకి పూర్తిగా దూరమయ్యారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. దీంతో దశాబ్దాలుగా ఆయన్ని నమ్ముకుని ఉన్న కేడర్ చెల్లాచెదురవుతోందట. దీంతో టెక్కలి నియోజకవర్గ వైసీపీ కేడర్‌ను నడిపించే బాధ్యతను శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి తలకెత్తుకున్నారట. వైసీపీ దూరం పెట్టాక... అడపదడప మినహా..
Off The Record: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తిరుగులేని ఆధిపత్యాన్ని చూపించింది జనసేన. జిల్లాలోని ఆరు సీట్లలో పోటీ చేసి అన్ని చోట్ల విజయం సాధించి కంచుకోటగా నిలబడింది. అలాంటి జిల్లాలో పార్టీ అధినేత ఆశించిందొకటి.. ఎమ్మెల్యేలు చేస్తున్నదొకటి అన్నట్టుగా తయారైందట పరిస్థితి. ఇక్కడి నుంచి తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన జనసేన నేతలు.. మళ్ళీ అవకాశం వస్తుందో లేదో… భవిష్యత్తు సంగతి మనకెందుకు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందామన్నట్టు ఆత్రంగా వ్యవహరిస్తున్నారట.…
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్. ఉందా.. లేదా అన్నట్టుగా... ఉండీ లేనట్టుగా... అలా అలా బండి లాగించేస్తున్న పార్టీ. అసలు ఒంట్లో బలం ఉందా లేదా అన్నదాంతో... సంబంధం లేకుండా సహజంగా వచ్చే డీఎన్ఏ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఏపీ కాంగ్రెస్‌ని కూడా వేధిస్తున్నాయట. ఐకమత్యం, అందర్నీ కలుపుకునిపోవడం, కలిసి పనిచేయడంలాంటిని కాంగ్రెస్‌లో పెద్దగా కనిపించని లక్షణాలు.
అధికారం పోయాక కేసీఆర్ కుటుంబంలో విభేదాలు పతాకస్థాయికి చేరుకుంటున్నాయి. ప్రత్యేకించి అన్నా చెల్లెళ్ళ మధ్య పూడ్చలేనంత అగాధం ఏర్పడ్డట్టు అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు. తనకు పార్టీలో సరైన ఆదరణ లభించడంలేదని కుంగిపోయిన కవిత ఇటీవల తండ్రికి రాసిన లేఖ సంచలనం సృష్టించింది. అందులోని అంశాలతో పాటు ఆ తర్వాత చేసిన వ్యాఖ్యలు కూడా ఇంకా కలకలంరేపాయి. కేసీఆర్ దగ్గర కోవర్ట్‌లు ఉన్నారని, ఆయన దేవుడేగానీ... చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ కవిత లెటర్లో రాసిన అంశాలు రాజకీయంగా…
తెలంగాణ కేబినెట్ విస్తరణలో కచ్చితంగా అవకాశం దక్కి తీరుతుందని అనుకున్న వాళ్ళు ఐదుగురు. అవకాశం దక్కింది ముగ్గురికి. కానీ... ఈ ఆశించిన ఐదుగురిలో ఎవరూ ఆ ముగ్గురిలో లేరు. దీంతో ఇప్పుడు పార్టీలో కొత్త చర్చ మొదలైంది. వాళ్ళంతా... తాత్కాలికంగా సైలెంట్ అయ్యారా..? వాళ్ళకు ఏ పదవులు ఇచ్చి నచ్చచెప్తారంటూ తెగ గుసగుసలాడేసుకుంటున్నాయి పార్టీ వర్గాలు.