Off The Record: ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీకి సీన్ రివర్స్ అవుతోందనే టాక్ నడుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి తర్వాత అన్ని జిల్లాల్లోని నేతలంతా యాక్టివ్ అవుతున్నారు. జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. అసెంబ్లీ ఇంఛార్జ్‌లు అందరూ కాస్త యాక్టివ్గానే ఉన్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు నియోజకవర్గాలకు అసలు ఇంఛార్జ్‌లు ఎక్కుడున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొందని సమాచారం. హిందూపురం పార్లమెంట్ ఇంఛార్జిగా గత ఎన్నికల…
Off The Record: ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు ఆశించిన టీడీపీ నేతలకు నిరాశే ఎదురైంది. ఐతే…పార్టీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ, ఇతర పదవులు ఇస్తామని అధిష్టానం కొందరికి హామీలు ఇచ్చిందట. ఆ హామీలు నెరవేరకపోవటంతో సీనియర్లు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ పదవుల మాటమోగానీ ఉన్న పార్టీ పదవులు కూడా ఉడిపోతున్నాయని భయపడుతున్నారట. ఉమ్మడి కర్నూలు జిల్లా…రెండు దశాబ్దాలకుపైగా ఎన్నికల్లో టీడీపీకి ఎప్పుడూ నిరాశే ఎదురైంది. అత్యధిక స్థానాలను…
Off The Record: పెనుమత్స విష్ణుకుమార్ రాజు… విశాఖ నార్త్ బీజేపీ ఎమ్మెల్యే. NDAతో సంబంధం లేకుండానే మొదటి నుంచి టీడీపీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న కమలం నేతల్లో ఈయనదే మొదటి స్ధానం అని చెబుతుంటారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేల కంటే విష్ణుకుమార్ రాజు వాయిస్సే ఎక్కువ వినిపించేదని టాక్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం కోసం కొన్నిసార్లు భాష కట్టలు తెంచుకున్నా పెద్దగా ఫీల్ అయ్యేవారు కాదట ఈ సీనియర్ నేత.…
Off The Record: తూర్పుగోదావరి జిల్లా టిడిపి అధ్యక్షులుగా బొడ్డు వెంకట రమణ చౌదరి నియామకం వివాదస్పాదంగా మారింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వలసదారుడిగా టిడిపిలో చేరిన ఆయనకు ఈ పదవి కట్టపెట్టడంపై పార్టీలో నిరుత్సాహం నెలకొందట. ప్రస్తుతం రుడా చైర్మన్‌గా, రాజానగరం నియోజకవర్గం టిడిపి ఇంఛార్జిగా కొనసాగుతున్నారు బొడ్డు వెంకటరమణ చౌదరి. మళ్లీ టిడిపి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టడంపై పార్టీ కార్యకర్తలు ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.…
Off The Record: బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన కొన్ని అంశాలపై కేసులు, విచారణలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి విచారణ కొనసాగుతోంది. మళ్లీ దానిపై అరెస్టులు జరుగుతాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయని తెలుస్తోంది. అయితే ఆ అరెస్టులకు సంబంధించి స్వయంగా హరీష్ రావే మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. గతంలో కాలేశ్వరం కేసుకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పాటు విచారణను ఎదుర్కొన్నారు హరీష్‌రావు. దాంతో పాటు ఇప్పుడు విచారణ జరుగుతున్న…
Off The Record: సీఎం రేవంత్ తన విజన్‌ను అధికారులతో క్లారిటీగా చెప్తున్నారు. దానికి అనుగుణంగా పని చేయండి అని సూచిస్తున్నారు. గడిచిన రెండేళ్లుగా అన్ని శాఖల సెక్రటరీలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. మీరు మారండి…గ్రౌండ్‌కి వెళ్ళండి అంటూ ఆదేశాలు ఇస్తూనే ఉన్నారు. ప్రతీ నెలా రిపోర్ట్ చూస్తాం అని మొత్తుకుంటున్నారు. కానీ అధికారులు మాత్రం వాళ్లు ఏం చేయాలనుకుంటున్నారో అదే చేస్తున్నట్టు కనిపిస్తోంది. క్షేత్రస్థాయికి వెళ్తే…భయంతోనో…తనిఖీలకు వస్తారనో జాగ్రత్తగా విధులు నిర్వహించే అవకాశం ఉంది.…
Off The Record: తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడుగా ఎమ్మెల్సీ బీద రవిచంద్రను నియమించింది పార్టీ అధిష్టానం. ఆ పోస్ట్ విషయంలో ఆయన అంత సుముఖంగా లేకున్నా… పార్టీ పెద్దల వ్యూహం మాత్రం వేరుగా ఉన్నట్టు తెలుస్తోంది. నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే….. అందులో కొందరు ఎమ్మెల్యేలతో పాటు పార్టీ ముఖ్య నాయకుల మధ్య కూడా సమన్వయం కొరవడుతోందట.ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు పార్టీలోని ఇంటర్నల్ వార్‌ను బయటపెట్టాయి. ముఖ్యంగా…
ఎవరు? ఆ లీకు వీరులెవరు..? ప్రధాని మోడీతో తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీల మీటింగ్ వివరాలను బయటికి చెప్పిందెవరు?.. దీని గురించి బయట ఎక్కడా చర్చ జరక్కూడదని స్వయంగా మోడీ చెప్పినా సరే.. లీక్ చేసింది ఎవరు? అనుమానపు చూపులు ఎటువైపు ఉన్నాయి? పార్టీ వర్గాలు ఏమంటున్నాయి?. కర్ణాటక మినహా దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో ఇటీవల ప్రత్యేకంగా సమావేశమయ్యారు ప్రధాని మోడీ. ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు, పార్టీ పని తీరుపై ఆరా తీశారు. ఇప్పటిదాకా…
Off The Record: క్షేత్ర స్థాయిలో ఏ రాజకీయ పార్టీకైనా ఊపిరి పోసేవి స్థానిక సంస్థల ఎన్నికలు. పంచాయతీ ఎలక్షన్స్‌లో అయితే… పార్టీ సింబల్స్ ఉండకపోవచ్చుగానీ… వాళ్ళు బలపరిచిన అభ్యర్థులే బరిలో ఉంటారు. ఇక్కడే తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ విషయంలో ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అధికార పార్టీగా నిన్నటి మొదటి విడత ఎన్నికల్లో పూర్తి ఆధిపత్యం కనబరిచినా… కొన్ని తప్పిదాల వల్ల ఇంకా ఎక్కువగా రావాల్సిన సీట్లు తగ్గాయంటున్నారు. వర్గపోరు, సొంతోళ్ళే దెబ్బ కొట్టడం…
Off The Record: రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కొత్త పంథా ఎంచుకున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. సాధారణంగా ఆయన ఏదైనా ఒక సబ్జెక్ట్ పట్టుకుంటే ఆ లోతుల్లోకి వెళ్ళి తవ్వకాలు జరిపి అవశేషాలను కూడా వెలికి తీస్తుంటారు. అవతలోళ్ళని గిల్లి గిచ్చి… ఓరి బాబోయ్…. వద్దు. నీకో దండం అనేలా చేస్తుంటారన్నది విస్తృతాభిప్రాయం. ఆ క్రమంలోనే ఇప్పుడు తన ఫోకస్ బీజేపీ మీదికి షిఫ్ట్ చేసినట్టు కనిపిస్తోందంటున్నారు. వ్యక్తిగా ఉండవల్లి బీజేపీ,…