Off The Record: హస్తినలో కుస్తీ జరుగుతుందా ? రొటీన్ మీటింగేనా?
- హస్తినకు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అధిష్టానం పిలుపు..
- సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్..
- ఢిల్లీలో జరిగే మీటింగ్ పై పార్టీలోలో... పొలిటికల్‌గా పెద్ద చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: చాలా రోజుల తర్వాత హస్తినకు తెలంగాణ కాంగ్రెస్ నేతలని అధిష్టానం పిలిచింది. సీఎం రేవంత్ రెడ్డి ..డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…పాటుగా మంత్రులు… పిసిసి చీఫ్ మహేష్ గౌడ్.. ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌ను ఏఐసీసీ పిలిచింది. గతంలో ఎన్నికల సందర్భంగా అందరినీ ఏకం చేసేందుకు ఇలాంటి సమావేశాన్ని నిర్వహించారు. అలాంటి సమావేశం తిరిగి గురువారం జరగబోతోంది. ఢిల్లీలో జరిగే మీటింగ్ పై పార్టీలోలో… పొలిటికల్‌గా పెద్ద చర్చ జరుగుతుంది. ఇటీవల మంత్రుల మధ్య వివాదాలు…మంత్రులు చేసిన గలాటాలు…కొంత మంది మంత్రులపై సొంత పార్టీ MLA లు ఫిర్యాదులు లాంటి అంశాలన్నీ ప్రధానంగా ఉన్నాయి. ప్రభుత్వంపై ఎలాగూ అడపా దడపా వెళ్ళే ఫిర్యాదులు కూడా ఉండనే ఉన్నాయి. వీటన్నింటిపై అధిష్టానం సీరియస్ గానే చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఐతే… పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా జరుగుతున్న సమావేశం కావడం… సరిగ్గా ఇదే సమయానికి అటు సర్పంచ్.. ఇటు మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజార్టీ తో గెలుచుకోవడం లాంటి అంశాలు.. పార్టీకి…ప్రభుత్వానికి కలిసి వచ్చే అంశాలు. రెండేళ్ల పాలనలో సరిదిద్దుకోవాల్సినన అంశాలపై దిశా నిర్దేశం చేయబోతుంది అధిష్టానం. ప్రభుత్వం సాఫీగా సాగుతున్నా… పరిపాలన పరంగా .. పోస్టింగులు… నియామకాల విషయంలో తన..పర అనే అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని…కొంత మంది అధికారులు MLA లు…పార్టీ నాయకులకు కూడా పని చేయడం లేదనే ఫీలింగ్ ఎక్కువగా ఉంది. దీనిపై ఫోకస్ పెట్టాలనే సూచన కూడా చేయాలని చూస్తున్నారు కొందరు నేతలు.
Also Read
పార్టీలో పదవులు… నామినేటెడ్ పోస్టుల భర్తీ లాంటి అంశాలపై కూడా సమావేశంలో చర్చకి రానుంది. పార్టీ నిర్మాణం మీద … పార్టీలో ఖాళీ గా ఉన్న పదవులు లాంటి అంశాలపై డిల్లీ మీటింగ్ తర్వాత క్లారిటీ రాబోతుంది.
తాజావార్తలు
-
PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
-
Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ రూమర్లు నిజమేనా?
-
Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
-
AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?