Off The Record: ముతుకుమిల్లి శ్రీభరత్….విశాఖపట్టణం ఎంపీ…!. బలమైన రాజకీయ వారసత్వ పునాది మీద భవిష్యత్ వెతుక్కుంటున్న నేత. గంటా శ్రీనివాసరావు… ఏపీ పాలిటిక్స్‌లో పెద్దగా పరిచయం అవసరంలేని సీనియర్ పొలిటీషియన్. రెండున్నర దశాబ్దాల రాజకీయ ప్రయాణంలో పార్టీలైతే మారారుగానీ… ఒక్కసారి కూడా ఓడిపోకపోవడం ఈ మాజీ మంత్రి ట్రాక్ రికార్డ్. రాజకీయ పరిణితి, అనుభవంలో ఈ ఇద్దరు నేతలకు అసలు పోలికే వుండదు. కానీ… ఇప్పుడు ఇద్దరూ భీమిలి మీద పట్టుకోసం పోటీపడుతున్నారనే ప్రచారం జోరందుకుంది.…
Off The Record: జాగృతి జనం బాటలో కవిత కాస్త డిఫరెంట్‌గా వ్యవహరిస్తున్నారా? ఆమె తీరు గులాబీ దళానికి అస్సలు మింగుడు పడ్డం లేదా? ఏదైతే అదైంది ఇక నుంచి ఫుల్ స్వింగ్‌లో రివర్స్ అటాక్ చేయాలన్న నిర్ణయానికి వచ్చారా? ఇంతకీ కవిత తీరులో కనిపిస్తున్న మార్పు ఏంటి? రాష్ట్ర పర్యటనలో ఆమె ఎవర్ని టార్గెట్ చేస్తున్నారు? జాగృతి జనం బాట పేరుతో జిల్లాల్లో పర్యటిస్తున్నారు ఎమ్మెల్సీ కవిత. ఇప్పటికి ఏడు జిల్లాల టూర్ పూర్తయింది. అయితే……
Off The Record: తెలుగుదేశం పార్టీకి మొదట్నుంచి సమస్యగా ఉన్న నియోజకవర్గాల్లో శింగనమల ప్రధానమైనది. ఇప్పుడే కాదు…. గత ఏడేళ్ళుగా ఇక్కడ ఏకాభిప్రాయం లేదు.. కార్యకర్తలు సంతృప్తిగా లేరు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఒకటే గొడవగా మారింది. అందుకు ప్రధాన కారణం 2019 ఎన్నికలకు ముందు బండారు శ్రావణికి టికెట్ ఇవ్వడమేనన్నది లోకల్ కేడర్ చెప్పే మాట. శ్రావణి నాయకత్వాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు కొందరు. ఈ గొడవల క్రమంలో… 2024 ఎన్నికలకు ముందు కూడా…
ఆ మంత్రి మెరుపు తీగలా మాయమవుతాడు. పాదరసంలా జారుకుంటాడు. అవసరం వుంటేనే జిల్లాలో వాలిపోతాడు. ఇప్పుడా అవసరం ఏంటనే చర్చ…అనవసర రాద్దాంతం అవుతోంది. చివరికి మినిస్టర్‌కే తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఎంతకీ ఎవరా అమాత్యుడు? మంత్రి అనగాని సత్యప్రసాద్ చిక్కడు..దొరకడు అన్నట్టుగా తెగ ఫీలవుతున్నారు తిరుపతి జిల్లా తెలుగు తమ్ముళ్లు. ఉమ్మడి జిల్లానైనా, లేదంటే విడిగా తిరుపతి జిల్లా చూసుకున్నా మంత్రి పదవి మాత్రం స్థానిక నేతలకు దక్కలేదు. ఆ తర్వాత జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా ప్రస్తుత రెవెన్యూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్టేట్ ప్రమోషన్ విషయంలో లైట్‌గా ఉంటున్నారా?.. పథకాల ప్రారంభోత్సవాల్లో చురుగ్గా పాల్గొంటున్న పవన్ పెట్టుబడుల సదస్సు, పరిశ్రమల ఏర్పాటు లాంటి కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు?.. ఆయన దూరంగా ఉంటున్నారా? లేక దూరం పెడుతున్నారా?.. ఆ విషయమై కూటమి సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ ఏంటి?. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 16 నెలలు అవుతోంది. ఓవైపు పథకాల అమలు, పెట్టుబడుల ఆకర్షణలో బిజీగా ఉంటూనే… మరోవైపు మూడు పార్టీల…
దశాబ్దాల తరబడి నెత్తిన పెట్టుకుని మోసినా, ఇప్పుడు ఫుల్ ఫ్యామిలీ ప్యాకేజ్ ఇచ్చినా… ఆ టీడీపీ సీనియర్ నేత సంతృప్తిగా లేరు ఎందుకు? జీవిత కాలం పదవులు అనుభవించినా… ఆయనకు ఆ ఒక్క కోరిక మాత్రం మిగిలిపోయే ఉందా? అది తీరితే తప్ప ఆయనకు మనశ్శాంతి ఉండదా? ఎవరా సీనియర్ లీడర్? ఏంటాయన కోరిక? దాన్ని తీర్చాలన్న ఉద్దేశ్యం అస్సలు టీడీపీ అధిష్టానానికి ఉందా?. టీడీపీ ఆవిర్భావం నుంచి మెడలో పసుపు కండువా తప్ప మరోటి తెలియని…
Off The Record: తర్క వితర్కాలు, పెద్ద పెద్ద చర్చోపచర్చలతో నిమిత్తం లేకుండానే…. ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో పాటు వివిధ వర్గాల్లో ఒక స్థిరమైన అభిప్రాయమైతే ఉంది. అదే… వైసీపీలో కమ్మ కులానికి అంత ప్రాధాన్యం ఉండదని. అలాగే ఆ సామాజికవర్గంలో ఎక్కువ మంది అదే విషయాన్ని నమ్ముతారు కూడా. వాళ్ళతో మాకెలాంటి విభేదాలు లేవని వైసీపీ అధిష్టానం ఒకటికి పదిసార్లు చెప్పినా… అనుమానాలు మాత్రం తొలిగిపోలేదన్నది నిష్టుర సత్యం. అలా ఖచ్చితంగా ఆ సామాజికవర్గానికి, పార్టీకి…
Off The Record: వైసీపీలో గ్రూప్ పాలిటిక్స్‌కు అడ్డాగా మారిపోయింది జీడీనెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న సామెత… మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామికి రివర్స్‌లో ఉంటోందట. గడిచిన ఐదేళ్ళ నుంచి ఆయనకు మొత్తం అపసవ్య దిశలోనే తిరుగుతోందంటున్నారు. ఎమ్మెల్యేగా మూడు సార్లు పనిచేసినప్పుడు ఎటువంటి తలనొప్పులు పడని నారాయణ స్వామి….తమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి… ఇంకా చెప్పాలాంటే డిప్యూటీ సిఎం అయినప్పటి నుంచి రాష్ట్రం సంగతి తర్వాత…. సొంత నియోజకవర్గంలోనే ఐ…
Off The Record: రాజకీయాల్లో ఢీ అంటే ఢీ అని తలపడటం ఒక ఎత్తయితే…. ఎక్కువ మంది మాత్రం వ్యూహాత్మక ఎత్తుగడల్ని ఫాలో అవుతుంటారు. అందులో కూడా కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకునే సెక్షన్ కూడా ఒకటుంటుంది. వాళ్ళు మనవాళ్ళో పగవాళ్ళో తెలిసే లోపే… జరక్కూడని నష్టం జరిగిపోతుంది. కుదిరితే కుట్రలతో ప్రజాక్షేత్రంలో ఓడిస్తారు లేదంటే వెన్నుపోటు పొడిచి దెబ్బ తీస్తారు. ప్రస్తుతం ఇలాంటి రాజకీయాలకు కేరాఫ్‌గా మారుతోంది అనంతపురం జిల్లా. మరీ ముఖ్యంగా వైసీపీలో ఈ…