బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. అర్ధరాత్రి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. బుధవారం ఉదయానికి తీవ్ర తుఫాన్‌గా మారనుంది. ఈ తుఫాన్ ప్రభావం పశ్చిమ బెంగాల్, ఒడిశాపై తీవ్ర ప్రభావం చూపించనుంది. గంటకు 120 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన డానా తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. ఈనెల 23న తుఫాన్ తీరం దాటనుంది. దీంతో దేశంలోని పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 23-25న అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
దేశంలోని రెండు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాళాతంలో ఏర్పడిన తుఫాన్ ఈనెల 23న తీరం దాట నుంది. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమబెంగాల్లోని వివిధ జిల్లాల్లో అత్యంత భారీ వర్షం నమోదు అవుతుందని ఐఎండీ తెలిపింది.
Exclude cow From animal List: ఉత్తరాఖండ్‌లోని జ్యోతిష్ పీఠ్‌కు చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి ఆవును జంతువుల వర్గం నుండి మినహాయించాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ప్రభుత్వ జాబితాలో ఆవు ఒక జంతువు అని, అయితే సనాతన ధర్మంలో గోవుకు తల్లి అనే పేరు ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆవును జంతువు అని అనడం సనాతన ధర్మాన్ని అవమానించడమే. శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి ఆవు ప్రతిష్ట జెండాను స్థాపించడానికి భారతదేశ పర్యటన సందర్భంగా ఒడిశా…
Odisha custodial assault: ఒడిశాలో ఆర్మీ అధికారికి కాబోయే భార్యపై పోలీసులు కస్టడీలో దాడి చేయడం సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా పోలీసుల తీరు ప్రజల్లో ఆగ్రహానికి గురైంది. ఈ ఘటన చర్చనీయాంశం కావడంతో ఉన్నతాధికారులు స్పందించి, మహిళపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేసింది. అయితే, ఈ ఘటన ఆర్మీ వర్సెస్ పోలీస్‌గా మారింది. చాలా మంది వెటరన్ ఆర్మీ అధికారులు పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు వారిపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదిక…
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ గ్రామస్థులు అంగన్వాడీ కార్యకర్తను చెట్టుకు కట్టేసి కొట్టారు. మహిళా ఉద్యోగి అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు సక్రమంగా ఆహారం, ముఖ్యంగా గుడ్లు అందించడం లేదని ఆరోపించారు.
పోలీసులు తనను వేధించిన విషయాన్ని ఓ బాధితురాలు వెల్లడించింది. ఆ రాత్రి పోలీస్ స్టేషన్లో బాధితురాలిపై పోలీసు సిబ్బంది చేసిన అమానుష ప్రవర్తన వింటే మీరు కూడా షాక్ అవుతారు.
Odisha: ఒడిశాలోని కటల్‌లో జరిగిన మిలాద్-ఉన్-నబీ వేడుకలు వివాదాస్పదంగా మారాయి. ఊరేగింపు సందర్భంగా ఓ వ్యక్తి పాలస్తీనా జెండాను ప్రదర్శించడం ఉద్రిక్తతలను పెంచింది. సోమవారం నగరంలో ఊరేగింపు సందర్భంగా ఈ ఘటన జరిగింది. పాలస్తీనా జెండా ఊపుతూ ఓ వ్యక్తి కనిపించడంతో కొద్దిసేపు ఊరేగింపుని పోలీసులు నిలిపేశారు. ఈ ఘటన నగరంలోని దర్గా బజార్లో జరిగినట్లు వారు తెలిపారు.
Odisha: ఒడిశాలోని బెర్హంపూర్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని పరాలా మహారాజా ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఏడుగురు విద్యార్థులు కాలేజీ హాస్టల్లో ‘గొడ్డు మాంసం’’ వండారనే ఆరోపణలతో వారిని బహిష్కరించారు.