Anupama: మౌనం వీడిన అనుపమ: టాక్సిక్ రిలేషన్‌షిప్‌పై సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ కథానాయిక అనుపమ పరమేశ్వరన్ తన పాస్ట్ రిలేషన్, వ్యక్తిగత జీవితంలోని చేదు అనుభవాలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఒకప్పుడు తాను అనుభవించిన టాక్సిక్ రిలేషన్, ఎదుర్కొన్న మానసిక వేదన గురించి ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు. ఒక పార్టనర్ పక్కన ఉన్నప్పుడు ఎవరైనా ప్రశాంతంగా, సురక్షితంగా భావిస్తారు. కానీ తాను మాత్రం ఆ బంధంలో ఉన్నంత కాలం ప్రతి నిమిషం భయంతో, ఆందోళనతో గడిపానని అనుపమ ఆవేదన వ్యక్తం చేశారు. “ఆ రిలేషన్లో ఉన్నప్పుడు ప్రతి క్షణం ఎంతో భయంగా ఉండేది. నేను మామూలుగా చేసుకునే పనులు కూడా నేను సరిగ్గా చేసుకోలేకపోయేదాన్ని. ఏదైనా మాట్లాడే ముందు ‘నేను ఇది మాట్లాడితే ఎదుటి వ్యక్తి ఎలా స్పందిస్తారో?’ అని మనసులోనే వందసార్లు ప్రాక్టీస్ చేసుకోవాల్సి వచ్చేది. ప్రతిరోజూ ఒక అనిశ్చితి, భయం నన్ను వెంటాడేవి. కానీ ఈ పరిస్థితిలోకి మనం ఎలా వెళ్తామో మనకే తెలియదు. చాలా నెమ్మదిగా, నిశ్శబ్దంగా మనల్ని ఆ పరిస్థితిలోకి తీసుకెళ్తారు” అని ఆమె చెప్పారు.
తమ ఇరు కుటుంబాలు కలవడం, ఇరువైపులా ఒకరి ఇళ్లల్లో ఒకరం సమయం గడపడం వల్ల ‘ఈ వ్యక్తితోనే జీవితం’ అని బలంగా నమ్మానని, కానీ ఆ తర్వాతే అసలు స్వరూపం బయటపడిందని ఆమె వివరించారు. కంట్రోల్ మరింత పెరిగిపోయిందని ఆమె ఆరోపించారు. “నా కెరీర్లో అత్యంత విజయవంతమైన ‘డ్రాగన్’ సినిమా ప్రమోషన్లకు కూడా నేను ఎందుకు వెళ్లలేదో నాకు మాత్రమే తెలుసు. ఎన్నో మంచి ప్రాజెక్టులను వదులుకోవాల్సి వచ్చింది. నా ప్రతి విషయంలోనూ ప్రత్యక్షంగా, పరోక్షంగా జోక్యం చేసుకునేవారు. నా కుటుంబానికి, స్నేహితులకు నన్ను దూరం చేశారు. బయటకి వచ్చి ఎవరైనా ‘ఎలా ఉన్నావు?’ అని ప్రేమగా అడిగితే ఎక్కడ ఏడ్చేస్తానో అని భయపడేదాన్ని” అని అనుపమ భావోద్వేగానికి గురయ్యారు. ఎదుటి వ్యక్తి వల్ల తనకు ఎంత హాని జరుగుతున్నా, తనను ఎలా అడ్డుకుంటున్నా… ఒకానొక దశలో తనే సొంత కుటుంబం నుంచి ఆ వ్యక్తిని కాపాడుతూ వచ్చానని ఆమె చెప్పారు. స్నేహితులకు కూడా క్రమంగా దూరమైపోయా అని పేర్కొన్నారు. అనుపమ చేసిన ఈ సంచలన ఆరోపణలు, టాక్సిక్ రిలేషన్షిప్ అనుభవాలు ప్రస్తుతం నెట్టింట హాల్చల్ చేస్తున్నాయి. మరి ఈ వ్యవహారంపై అవతలి వ్యక్తి నుంచి ఎలాంటి క్లారిటీ లేదా వివరణ వస్తుందో అని సినీ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.
Also Read
- స్టార్ హీరో లేడు.. భారీ ప్రమోషన్ లేదు.. రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూ.130 కోట్లు వసూళ్లు.. Hanuman Ansh ఫుల్ స్టోరీ ఇదే!
- Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
- Anand Deverakonda : వాళ్ళ సపోర్ట్ లేకుండా ఉంటే ఏమీ చేయలేక పోయేవాడిని!
- Raaka Remuneration: పుష్ప తర్వాత బన్నీ మార్కెట్ ఇదేనా? ‘రాకా’ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
తాజావార్తలు
-
Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్‌కు షాక్.. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు దూరం.. అసలు కారణం ఇదే!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్‌తో మరింత ఆదా.!
-
CM Chandrababu: నేడు కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులతో ముఖాముఖి, పార్టీ కార్యకర్తలతో సమావేశం!
-
కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!
-
స్టార్ హీరో లేడు.. భారీ ప్రమోషన్ లేదు.. రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూ.130 కోట్లు వసూళ్లు.. Hanuman Ansh ఫుల్ స్టోరీ ఇదే!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!