Miss Teen Universe 2024: దక్షిణాఫ్రికాలో జరిగిన మిస్ టీన్ యూనివర్స్ 2024 అందాల పోటీలో కీట్ యూనివర్సిటీ ఫ్యాషన్ స్కూల్ విద్యార్థిని తృష్ణా ర.. మిస్ టీన్ యూనివర్స్ 2024 టైటిల్‌ను గెలుచుకుంది. కిట్ ఫ్యాషన్ టెక్నాలజీ స్కూల్ విద్యార్థిని తృష్ణా రే ఈ టైటిల్‌ను గెలుచుకోవడం ద్వారా కిట్ విశ్వవిద్యాలయం, ఒడిశా, భారతదేశానికి కీర్తిని తెచ్చిపెట్టింది. నవంబర్ 1 నుంచి 9 వరకు పోటీలు జరిగాయి. ఈ పోటీలో ప్రపంచం నలుమూలల నుండి పోటీదారులు పాల్గొన్నారు. గత సంవత్సరం కూడా కల్నల్ దిలీప్ కుమార్ రే, రాజశ్రీల కుమార్తె తృష్ణా ఈ పోటీలో పాల్గొనడానికి ప్రయత్నించారని తెలిసిందే. వీసా సమస్య కారణంగా గతేడాది కొలంబియా, డొమినికన్ రిపబ్లిక్‌లలో జరిగిన పోటీల్లో పాల్గొనలేకపోయారు. తన కఠోర శ్రమ, చదువు, పట్టుదలతో ఈ అంతర్జాతీయ విజయాన్ని సాధించించి. ప్రస్తుతం భువనేశ్వర్‌లో కేఐఐటీ వర్సిటీలో ఫ్యాషన్ టెక్నాలజీ చదువుతున్నారు. ఈ విజయంపై కిట్ & కిస్ వ్యవస్థాపకురాలు అచ్యుత్ సమంతా తృష్ణను అభినందించారు.
Read Also: Champions Trophy 2025: పాకిస్థాన్ ఎందుకు రావట్లేదు.. అభిమానికి బదులిచ్చిన సూర్యకుమార్!
ఇటీవల దక్షిణాఫ్రిరాలోని క్లింబరీ వేదికగా ఈ పోటీలో జరగగా.. ఇందులో పెరూ, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, కెన్యా, పోర్చుగల్, నమీబియా, నెదర్లాండ్స్‌తో సహా వివిధ దేశాలకు చెందిన మోడళ్లు పాల్గొన్నారు. వారందని వెనక్కి నెట్టి మిస్ టీన్ యూనవర్స్ కిరీటాన్ని తృష్ణా రే(19) సొంతం చేసుకున్నారు. పెరూకు చెందిన అన్నే థోర్సెన్, నమీబియాకు చెందిన ప్రెషియస్ ఆండ్రీలు రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
KIIT proudly celebrates Trishna Ray from the School of Fashion Technology for being crowned Miss Teen Universe 2024 in South Africa, shining as a global star.
Congratulations to Trishna for bringing honor to Odisha and KIIT! pic.twitter.com/MHU1ldme0w
— KIIT – Kalinga Institute of Industrial Technology (@KIITUniversity) November 11, 2024