Nandankanan Express: ఒడిశాలోని భద్రక్‌లో నందన్‌కనన్ ఎక్స్‌ప్రెస్ రైలుపై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. రైలు న్యూఢిల్లీ నుంచి భువనేశ్వర్ వెళ్తోన్న సమయంలో ఈ ఘయ్తన జరిగింది. ఈ సంఘటన భద్రక్, బౌదాపూర్ సెక్షన్ మధ్య జరిగింది. అందిన సమాచారం ప్రకారం, రైలు నంబర్ 12816 గార్డ్ బ్రేక్ వద్ద రెండు రౌండ్ల కాల్పులు జరిగాయి. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ ఘటన గురించి రైలు గార్డు మహేంద్ర బెహెరా మాట్లాడుతూ.. ఒక వ్యక్తి పిస్టల్‌తో రైలుపై కాల్పులు జరుపుతున్నట్లు చూశానని చెప్పారు. కాల్పుల ఘటన తర్వాత రైలు కిటికీకి రంధ్రం పడింది. అనంతరం ఆర్పీఎఫ్ సిబ్బంది రైలుకు భద్రత కల్పించి రైలును పూరీకి తరలించారు.
Read Also: Harish Shankar: మిస్టర్ బచ్చన్ డిజాస్టర్‌పై రానా జోకులు.. హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్
ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. 12816 ఆనంద్ విహార్ – పూరీ నందన్ కానన్ ఎక్స్‌ప్రెస్‌లోని గార్డ్ వ్యాన్ కిటికీపై ఏదో దాడి చేసినట్లు సమాచారం అందింది. నివేదిక ప్రకారం, ఒడిశాలోని భద్రక్ – బౌద్‌పూర్ సెక్షన్‌లో ఉదయం 9.15 గంటలకు ఈ సంఘటన జరిగింది. ఇప్పటివరకు కేవలం బాంబు బెదరింపులు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు నేరుగా తుపాకీ కాల్పులు జరగడంతో ప్రయాణికులు భయబ్రాంతులకు లోనవుతున్నారు. ఘటనకు సంబంధించి అధికారులు నిందితులను పెట్టుకొనేందుకు చర్యలు చేపడుతున్నారు.
Read Also: Suriya Siva Kumar: సూర్యకు థియేటర్ల తలనొప్పి.. ఇదేం లాజిక్ !
#WATCH | Odisha | Shots were fired at Puri-Anand Vihar Nandankanan Express train near Bhadrak this morning; Police investigation underway pic.twitter.com/6JN5ZSfK6A
— ANI (@ANI) November 5, 2024