Cyclone Dana: దానా తుపాను తీరం దాటక ముందే ఒడిశా సర్కార్ అలర్ట్ అయింది. అలాగే, ఒడిశాలోని అనేక తీర జిల్లాల నుంచి సుమారు 10 లక్షల మందిని తరలించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ దానా తుపాను.. ఈరోజు (గురువారం) లేదా రేపు (శుక్రవారం) భిటార్కనికా, ధమ్రా మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారలు తెలిపారు. కాగా, 120 కిలో మీటర్ల వేగంతో కదులుతున్న ఈ తుపాను ఒడిశాలోని సగం జనాభాపై తీవ్ర ప్రభావం చూపే ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Read Also: Custard Apple: సీతాఫలం పండ్లు తింటే శరీరానికి ఎంత మేలు తెలుస్తుందో తెలుసా?
మరోవైపు, దానా తుపాను నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కోల్‌కతా, భువనేశ్వర్ విమానాశ్రయాల్లో నేటి నుంచి రేపు ఉదయం వరకు కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేసింది. ఈ తుపాన్ బుధవారం రాత్రి 11.30 గంటల సమయానికి పారాదీప్ (ఒడిశా)కి ఆగ్నేయంగా 330 కిలో మీటర్ల దూరంలో, ధమ్రా (ఒడిశా)కి 360 కిలో మీటర్ల దక్షిణ-ఆగ్నేయంగా, సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) దక్షిణ-ఆగ్నేయంగా 420 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
Read Also: Israel Hezbollah War: ఇజ్రాయెల్ మిలిటరీ కంపెనీపై హెజ్‌బొల్లా దాడి.. తిప్పికొట్టిన ఐడీఎఫ్
ఇక, ఈ దానా తుపాన్ ప్రభావంతో పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, పుర్బా , పశ్చిమ మెదీనీపూర్, ఝర్‌గ్రామ్, కోల్‌కతా, హౌరా , హుగ్లీ జిల్లాల్లో ఈరోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే కోల్‌కతా ఎయిర్ పోర్టు నేటి సాయంత్రం 6 గంటల నుండి రేపు(శుక్రవారం) ఉదయం 9 గంటల వరకు విమాన కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, భువనేశ్వర్ విమానాశ్రయం నేటి సాయంత్రం 5 నుండి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు బంద్ చేస్తున్నట్లు చెప్పారు. ఇక, దానా తుపాను నేపథ్యంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మీదుగా నడిచే దాదాపు 200 రైళ్లను రైల్వేశాఖ క్యాన్సిల్ చేసింది.
#CycloneDana
Lies around 200kms off #Odisha coast at 5.30 am IST on 24th Oct. It is likely to landfall today evening/night (a tough time for relief personnel due to darkness) as a very severe cyclonic storm with expected windspeed of 120 kmph.
Take care.@Windycom @zoom_earth pic.twitter.com/6PxsR7MGnS— Prof RV (@TheTechocrat) October 24, 2024
In view of Cyclone DANA's impact on the coastal region of West Bengal, including Kolkata, it has been decided to suspend the flight operations from 1800 IST on 24.10.2024 to 0900 IST on 25.10.2024 due to predicted heavy winds and heavy to very heavy rainfall at Kolkata. pic.twitter.com/jhd4E7S3NS
— Kolkata Airport (@aaikolairport) October 23, 2024