ఒడిశాలోని బోలంగీర్ జిల్లాలో ఓ గిరిజన యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగు చూసింది. అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఆ వ్యక్తి (మానవ) మలాన్ని బలవంతంగా నోటిలో పోశాడు. ఈ ఘటన బంగముండ పోలీస్ స్టేషన్ పరిధిలోని జూరబంధ గ్రామంలో చోటుచేసుకుంది. నిందితుడు 20 ఏళ్ల యువతిపై దాడి చేసి వేధించాడని చెబుతున్నారు.
ఆ మహిళ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
READ MORE: Leopard: చిరుతను చంపి.. వండుకుని తిన్నారు.. ఎక్కడంటే?
ఫిర్యాదు ప్రకారం.. గిరిజనేతరుడైన నిందితుడు మహిళ పొలంలో నుంచి ట్రాక్టర్‌ను తీసుకెళ్తున్నాడు. దీంతో పంటలకు నష్టం వాటిల్లింది. దీనిపై మహిళ నిరసన వ్యక్తం చేస్తూ ట్రాక్టర్‌ను తమ పొలంలో నుంచి తీసుకెళ్లవద్దని కోరింది. ఆ సమయంలో నిందితులు ఆమెపై దాడి చేశాడు. మహిళను దుర్భాషలాడుతూనే, నిందితుడు ఆమె కులం మీద కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు ఘర్షణ పెరగడంతో.. బలవంతంగా ఆమె నోటిలో మానవ మలాన్ని పోశాడు. ఘటన అనంతరం నిందితుడు పరారీలో ఉన్నాడు. యువతి ఫిర్యాదు మేరకు బంగోముండ పోలీసులు 288/24 కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.
READ MORE: Side Effects of Over Sitting: ఎక్కువ సేపు కూర్చుంటున్నారా? .. ఎంత ప్రమాదమంటే?
కాగా, నిందితులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రతిపక్ష బిజూ జనతాదళ్ (బిజెడి) ఎంపీ నిరంజన్ బీసీ ఆరోపించారు. దీని కారణంగా గిరిజనులలో ఆగ్రహం వ్యక్తమైంది. ఘటన అనంతరం స్థానిక గిరిజన సంఘాలు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. తక్షణమే అధికారులు చర్యలు తీసుకోకుంటే ఐక్యంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.