ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మానవ సంబంధాలు తలదించుకునే ఉదంతం వెలుగు చూసింది. ఇక్కడ బస్తా ప్రాంతానికి చెందిన దంపతులు బైక్ కొనుక్కోవాలనే కారణంతో తమ తొమ్మిది రోజుల నవజాత శిశువును విక్రయించారు. ఆ దంపతులు తమ అమాయకపు బిడ్డను కేవలం రూ.60 వేలకే వేరొకరికి విక్రయించినట్లు సమాచారం. ఈ అక్రమ చర్యపై సమాచారం అందుకున్న పోలీసులు నవ దంపతుల నుంచి చిన్నారికి విముక్తి కల్పించారు. నిందితులైన దంపతులు, తమ బిడ్డను పెంచలేకపోవడం వల్లే తమ బిడ్డను దానం…
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం అంతకంతకు బలపడుతోంది. వచ్చే 24 గంటల్లో వాయుగుండంగా మారుతుందని ఐఎండీ ప్రకటించింది. ఏపీ తీరానికి సమాంతరంగా పయనిస్తూ మయన్మార్ వైపు వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావం కాకినాడ నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు తీవ్రంగా ఉండనుంది. తీరం వెంట గంటకు 60 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది.
ఐటీ కారిడార్‌లో బొమ్మ తుపాకీ చూపించి దోచుకున్న ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లోని రాయదుర్గం పీఎస్ పరిధిలోని నాలెడ్జ్ సిటీలో గల తేవర్ బార్‌లో దోపిడీ జరిగింది. బొమ్మ తుపాకీతో బార్ సెక్యూరిటీ గార్డ్‌ను బెదిరించి, రూమ్‌లో బంధించి నాలుగు లక్షల యాభై వేల రూపాయల నగదు, ఒక ఐ ప్యాడ్, ఆపిల్ లాప్‌టాప్‌ను దుండగులు దోచుకెళ్లారు.
లొంగిపోయిన మావోయిస్టులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వరాల జల్లు కురిపించారు. బస్తర్‌లో లొంగిపోయిన మావోయిస్టులకు 15,000 ఇళ్లు కట్టిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.
CMR Shopping Mall: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ & ఒడిశా రాష్ట్రాలలో అతిపెద్ద వస్త్ర వ్యాపార సంస్థ సి. ఎం.ఆర్. టెక్స్టైల్స్ & జ్యూయలర్స్ ప్రైవేట్ లిమిటెడ్, సి.ఎం.ఆర్. షాపింగ్ మాల్‌ను పార్క్ రోడ్, కర్నూలులో తేది 11 డిసెంబరు 2024న ఉ॥ 09:45కు పాణ్యం శాసనసభ్యులు శ్రీమతి గౌరు చరితా రెడ్డి గారిచే ఘనంగా ప్రారంభించడం జరిగింది, షాపింగ్ మాల్ ప్రారంబోత్సవం అనంతరం స్టోరులోని అన్నిరకాల వస్త్రాలను పరిశీలించారు అందరూ మెచ్చే అన్నిరకాల డిజైన్లు చాలా తక్కువ…
దేశ భద్రతా వ్యవహారాలపై ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని లోక్‌సేవాభవన్ కన్వెన్షన్ సమావేశ మందిరంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న సదస్సు. ఈ సదస్సులో ఈరోజు ( నవంబర్ 30) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు.
ఒడిశాలోని బోలంగీర్ జిల్లాలో ఓ గిరిజన యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగు చూసింది. అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఆ వ్యక్తి (మానవ) మలాన్ని బలవంతంగా నోటిలో పోశాడు. ఈ ఘటన బంగముండ పోలీస్ స్టేషన్ పరిధిలోని జూరబంధ గ్రామంలో చోటుచేసుకుంది. నిందితుడు 20 ఏళ్ల యువతిపై దాడి చేసి వేధించాడని చెబుతున్నారు. ఆ మహిళ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఒడిశాలోని నువాపాడా జిల్లాలో చిరుతపులిని వేటాడిన షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ వేటగాళ్ళు చిరుతపులిని చంపి, దాని చర్మం తీసి, దాని మాంసాన్ని వండుకుని తిన్నారు. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు నిందితులను అటవీ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ కేసు నువాపా జిల్లా దేవ్ధార గ్రామ సమీపంలో ఉంది.