Udaipur tailor Murder: 2022లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారిని ఉదయ్‌పూర్ దర్జీ హత్య కేసులో నిందితుడికి బెయిల్ లభించింది. టైలర్ కన్హయ్యలాల్‌ని దారుణంగా హత్య చేసిన నిందితుల్లో ఒకరైన మహ్మద్ జావేద్‌కి రాజస్థాన్ హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) జూలై 22, 2022న ఉదయ్‌పూర్‌లో జావేద్‌ని అరెస్ట్ చేసింది.
Geert Wilders: మాజీ బీజేపీ అధికార ప్రతినిధి నపూర్ శర్మ గతేడాది మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఈ వ్యాఖ్యల ఫలితంగా ఆమెను బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించింది. ఈ వ్యాఖ్యలు ఇటు ఇండియాలోనే కాకుండా ఖతార్, సౌదీ, యూఏఈ వంటి దేశాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఆమెపై చర్యలు తీసుకోవాలని ఇస్లామిక్ దేశాలు డిమాండ్ చేశాయి. ఇదే కాకుండా ఆమెను చంపేస్తామంటూ రాడికల్ ఇస్లామిస్టులు బెదిరింపులకు పాల్పడ్డారు. నుపూర్ శర్మకు మద్దతు తెలిపినందుకు…
Udaipur Tailor Murder Case: గతేడాది రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ లో కన్హయ్యలాల్ అనే టైలర్‌ని ఇద్దరు మతోన్మాదులు అత్యంత దారుణంగా తలను నరికి చంపారు. షాపులో పనిచేసుకుంటున్న సమయంలో కస్టమర్లుగా వచ్చిన రియాజ్ అట్టారి, మహ్మద్ గౌస్ కత్తితో తలను నరికేశారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. మహ్మద్ ప్రవక్తపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపూర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియా పోస్ట్ పెట్టిన కారణంగా ఇద్దరు వ్యక్తులు హత్య చేశారు.
గత ఏడాది టీవీ చర్చలో ప్రవక్త మహమ్మద్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నిరసనలు, హింసకు కారణమై పార్టీ నుంచి సస్పెండ్ చేయబడిన బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ ఇప్పుడు తుపాకీ లైసెన్స్ కలిగి ఉన్నారు.
2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో సస్పెండ్ అయిన బీజేపీ నేత నుపుర్ శర్మ ఢిల్లీ నుంచి పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) నేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
Supreme Court denies to entertain plea seeking Nupur Sharma's arrest: మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధిని అరెస్ట్ చేయాలంటూ అందుకు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించింది సుప్రీంకోర్టు. చీఫ్ జస్టిస్ యూయూ లలిత్ తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను శుక్రవారం తోసిపుచ్చింది. ఈ పిటిషన్ ఉపసంహరించుకోవాలని సూచించింది. దీంతో పిటిషనర్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. గత నెలలో నుపుర్ శర్మపై ఎలాంటి బలవంతపు…
మహమ్మద్ ప్రవక్తపై కామెంట్లతో వివాదంలో చిక్కుకున్న బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆమెపై దేశవ్యాప్తంగా నమోదైన 10 కేసులపై విచారణను ఢిల్లీ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు బుధవారం ఆదేశాలిచ్చింది.