Udaipur tailor Murder: 2022లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారిని ఉదయ్‌పూర్ దర్జీ హత్య కేసులో నిందితుడికి బెయిల్ లభించింది. టైలర్ కన్హయ్యలాల్‌ని దారుణంగా హత్య చేసిన నిందితుల్లో ఒకరైన మహ్మద్ జావేద్‌కి రాజస్థాన్ హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) జూలై 22, 2022న ఉదయ్‌పూర్‌లో జావేద్‌ని అరెస్ట్ చేసింది. జూన్ 28న తన షాపులో పనిచేసుకుంటున్న కన్హయ్య లాల్ అనే టైలర్‌ని అత్యంత దారుణంగా రియాజ్ అట్టారి, గౌస్ మహ్మద్ తల నరికి చంపారు. ఈ దారుణ హత్యను మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేయడమే కాకుండా, ప్రధాని నరేంద్రమోడీని కూడా నిందితులు బెదిరించారు. హత్య చేసేందుకు ఉపయోగించిన కత్తలును ప్రదర్శించారు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Rahul Gandhi: మహారాష్ట్రలో శివాజీ విగ్రహం కూలిపోవడంపై రాహుల్ కీలక వ్యాఖ్యలు
మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అప్పటి బీజేపీ నేత నూపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన కారణంగా నిందితులు అతడిని పాశవికంగా హత్య చేశారు. నిందితులలో ఒకరైన మహ్మద్ జావేద్‌కి ఈ హత్యతో ప్రమేయం ఉంది. కన్హయ్య లాల్ దుకాణం ముందు రెక్కీ నిర్వహించి, అతను దుకాణంలో ఉన్న సమాచారాన్ని అట్టారి, గౌస్‌లకు అందించడంలో జావేద్ కీలక పాత్ర పోషించాడు. దాడికి 8 రోజుల ముందు కన్హయ్య హత్యకు పథకం రచించారు. కన్హయ్యను ఐఎస్ఐఎస్ తరహాలో తల నరికి చంపడానికి జూన్ 20న కుట్రపన్నారు. ఈ హత్యతో పాకిస్తాన్‌కి చెందిన దావత్ ఏ ఇస్లామీతో సంబంధం ఉన్నట్లు విచారణలో తెలిసింది. 2014లో దావత్-ఎ-ఇస్లామీ సీనియర్ కార్యకర్తలు గౌస్ మహ్మద్‌ను పాకిస్థాన్‌కు ఆహ్వానించినట్లు తేలింది. కరాచీకి చెందిన ఈ సంస్థ సున్నత్, ఖురాన్ బోధనల్ని ప్రపంచవ్యాప్తంగా షరియాను అమలు చేసే లక్ష్యంతో ఏర్పాటైంది.