Nupur Sharma: మహమ్మద్ ప్రవక్తపై కామెంట్లతో వివాదంలో చిక్కుకున్న బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆమెపై దేశవ్యాప్తంగా నమోదైన 10 కేసులపై విచారణను ఢిల్లీ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు బుధవారం ఆదేశాలిచ్చింది. విచారణ నిమిత్తం ఢిల్లీ పోలీసులకు బదిలీ చేసింది. జస్టిస్‌లు దీంతో ఆమెకు గొప్ప ఉపశమనం లభించినట్లు అయింది. ప్రాణ హాని ఉందన్న ఆమె విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. ఆమె వినతి పిటిషన్‌కు సానుకూలంగా స్పందించింది. అంతే కాకుండా దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆమెను అరెస్ట్ చేయకూడదని తెలిపింది. అరెస్ట్ విషయంలో ఇప్పటిదాకా రక్షణ కల్పించిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని సుప్రీంకోర్టు వెల్లడించింది. అంతేకాదు తనకు వ్యతిరేకంగా దాఖలైన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను కొట్టేయాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించే స్వేచ్ఛను సైతం నూపుర్ శర్మకు ఇస్తున్నట్లు తెలిపింది.
తనకు వ్యతిరేకంగా వివిధ రాష్ట్రాల్లో కేసులు నమోదు అయ్యాయని, అయితే విచారణ నిమిత్తం తాను అక్కడికి వెళ్తే దాడులు జరగొచ్చని, తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని నుపుర్ శర్మ అత్యున్నత న్యాయస్థానంలో వినతి పిటిషన్ వేసింది. తనపై నమోదైన అన్ని కేసులను ఒకే చోట విచారించే విధంగా ఆదేశాలివ్వాలని నూపుర్ శర్మ సుప్రీంకోర్టును కోరారు. కాబట్టి, తనకు వ్యతిరేకంగా దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లను ఢిల్లీకి బదిలీ చేసేలా ఆదేశించాలని పిటిషన్‌లో కోరింది. ఈ మేరకు జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జేబీ పార్దీవాలా నేతృత్వంలోని బెంచ్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో కొత్తగా ఏదైనా ఎఫ్‌ఐఆర్ నమోదు అయినా కూడా ఢిల్లీకే బదిలీ చేయాలని సుప్రీం పేర్కొంది. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయడం కోసం శర్మ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించవచ్చని, భవిష్యత్తులో ఈ అంశంపై నమోదు చేయవచ్చని ధర్మాసనం పేర్కొంది.
CJI: భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ నియామకం
నుపుర్ శర్మ మే నెలలో ఓ టీవీ చర్చా కార్యక్రమంలో మాట్లాడారు. అప్పట్లో ఆమె బీజేపీ అధికార ప్రతినిధిగా ఉండేవారు. మహమ్మద్ ప్రవక్తపై ఆమె చేసిన వ్యాఖ్యలతో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమైంది. పాకిస్థాన్, కతార్, వంటి 14 ముస్లిం దేశాలు తమ అభ్యంతరాన్ని తెలిపాయి. దీంతో ఆమెను బీజేపీ సస్పెండ్ చేసింది. ఈ వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రవక్త మహమ్మద్‌పై వ్యాఖ్యలు చేసినందుకు మండిపడింది. ఆమె వ్యాఖ్యలు దేశంలో దురదృష్టకర సంఘనలకు దారి తీశాయని పేర్కొంది. దేశంలో జరుగుతున్న సంఘటనలకు ఆమె మాత్రమే బాధ్యురాలని పేర్కొంది. ఉదయ్‌పూర్‌లో దర్జీ కన్నయ్య లాల్ హత్యకు ఆమె వ్యాఖ్యలే కారణమని పేర్కొంది. నూపుర్ శర్మ జాతీయ టెలివిజన్ చానల్‌లో యావత్తు దేశానికి క్షమాపణ చెప్పాలని తెలిపింది. ఆమె తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, క్షమాపణ చెప్పడానికి చాలా ఆలస్యం చేశారని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.