Nupur Sharma-Raja Singh: మహ్మద్ ప్రవక్తపై వివదాస్పద వ్యాఖ్యలు చేశారనే కారణంతో ముస్లిం కమ్యూనిటీ మాజీ బీజేపీ నేత నూపుర్ శర్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు మతోన్మాదులు నూపుర్ శర్మకు మద్దతు తెలిపారని పలువురిని హత్యలు కూడా చేశారు. ఉదయ్‌పూర్‌లో ఓ దర్జీని తల నరికి చంపేశారు. తాజాగా ఓ మతపెద్ద నూపుర్ శర్మతో పాటు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, టీవీ న్యూస్ ఛానల్ ఎడిటర్‌ని చంపేందుకు కుట్ర పన్నాడు. గుజరాత్‌లోని సూరత్‌లో 27 ఏళ్ల వ్యక్తిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని మౌల్వీ సోహెల్ అబుబకర్ తిమోల్‌గా గుర్తించారు.
నిందితుడు పాకస్తాన్, నేపాల్‌లోని హ్యాండర్లతో కలిసి హిందీ టీవీ న్యూస్ ఛానెల్ ఎడిటర్, తెలంగాణకు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్, బీజేపీ పార్టీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మలను బెదిరించినట్లు సూరత్ సీనియర్ పోలీస్ అధికారి అనుపమ్ సింగ్ గెహ్లాట్ తెలిపారు. అబూబకర్ తిమోల్ ఒక థ్రెడ్ ఫ్యాక్టరీలో మేనేజర్‌గా పనిచేశాడు మరియు ముస్లిం పిల్లలకు ఇస్లాం గురించి ప్రైవేట్ ట్యూషన్ కూడా ఇచ్చేవాడని వెల్లడించారు.
Read Also: Pawan Kalyan: నాతో పెట్టుకుంటే గుంటూరు కారం పూసుకున్నట్లే.. గుంటూరు సభలో పవన్ ఫైర్
వాట్సాప్ గ్రూప్‌లో వివిధ వ్యక్తులతో టచ్‌లో ఉంటూ మతపరమైన సెంటిమెంట్లను దెబ్బతీసేలా, ఎన్నికల సమయంలో మతహింసను ప్రేరేపించేలా కంటెంట్ పోస్ట్ చేస్తున్నాడని పోలీసులకు సమాచారం అందింది. పక్కా సమాచారం ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. తిమోల్ మొబైల్ చాట్‌లలో నేపాల్, పాకిస్తాన్ వ్యక్తులతో కలిసి రూ. 1 కోటి సుపారీ(హత్యకు కాంట్రాక్ట్) అందించి, పాకస్తాన్ నుంచి ఆయుధాలు సేకరించి వీరిని హతమార్చాలని చూశాడని, ఇతని మొదటి టార్గెట్ హిందూ సనాతన్ సంఘ్ జాతీయ అధ్యక్షుడు ఉపదేశ్ రాణా అని పోలీసు అధికారులు వెల్లడించారు.
నిందితుడి ఫోన్‌ని తనిఖీ చేయగా అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక హిందీ టీవీ న్యూస్ ఛానెల్ ఎడిటర్, నూపుర్ శర్మ, రాజా సింగ్‌లను లక్ష్యంగా చేసుకుని బెదిరించడం వంటి విషయాలను పలు యాప్‌లో చర్చించినట్లు తెలిసింది. దీని కోసం వారు నిధులు సేకరించి ఆయుధాలను సేకరించాలని యోచిస్తున్నట్లు పోలీస్ అధికార గెహ్లాట్ తెలిపారు. పాకిస్థాన్, నేపాల్‌కు చెందిన ఫోన్ నంబర్లు కలిగిన డోగర్, షెహనాజ్ అనే ఇద్దరు వ్యక్తులతో తిమోల్ కాంటాక్ట్‌లో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. హిందూ మతానికి వ్యతిరేకంగా ప్రసంగాలు చేశాడని తెలిసింది.