Geert Wilders: మాజీ బీజేపీ అధికార ప్రతినిధి నపూర్ శర్మ గతేడాది మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఈ వ్యాఖ్యల ఫలితంగా ఆమెను బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించింది. ఈ వ్యాఖ్యలు ఇటు ఇండియాలోనే కాకుండా ఖతార్, సౌదీ, యూఏఈ వంటి దేశాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఆమెపై చర్యలు తీసుకోవాలని ఇస్లామిక్ దేశాలు డిమాండ్ చేశాయి. ఇదే కాకుండా ఆమెను చంపేస్తామంటూ రాడికల్ ఇస్లామిస్టులు బెదిరింపులకు పాల్పడ్డారు. నుపూర్ శర్మకు మద్దతు తెలిపినందుకు రాజస్థాన్ రాష్ట్రంలో కన్హయ్య లాల్ అనే వ్యక్తిని, మహారాష్ట్రలో ఉమేష్ కోల్హీ వంటి వారిని ఇస్లామిక్ ఉగ్రవాదులు చంపేశారు.
ఇదిలా ఉంటే నుపూర్ శర్మ వ్యాఖ్యలు నెదర్లాండ్స్ రాజకీయ నేత గీర్ట్ వైల్డర్స్ మద్దతు తెలిపారు. ఆయన మద్దతుగా నిలవడంతో ఒక్కసారిగా ఇండియాలో ఆయన బాగా ఫేమస్ అయ్యారు. తాజాగా ఆయన, అతని ఫ్రీడమ్ పార్టీ(పీవీవీ) అక్కడి ఎన్నికల్లో భారీ విజయం సాధింస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచానా వేశాయి.. జాతీయవాద నాయకుడిగా ఈ డచ్ లీడర్ పేరు తెచ్చుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో 150 స్థానాలకు గానూ 35 సీట్లను గెలుచుకుంటుందని తెలిపింది. జూలై నెలలో నెదర్లాండ్స్‌లో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయి ముందుస్తు ఎన్నికలకు తెరలేచింది. ప్రధాన మంత్రి మార్క్ రుట్టే పార్టీ 23 స్థానాలతో మూడో స్థానంలో నిలుస్తారని, ఈ ఎన్నికల ఫలితాలతో మార్క్ రుట్టే 13 ఏళ్ల పాలన ముంగింపుకు చేరుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. నెదర్లాండ్స్‌లో ఎగ్జిట్ పోల్‌లు సాధారణంగా రెండు సీట్ల మార్జిన్ లోపంతో నమ్మదగినవి.
Read Also: Gurpatwant Singh Pannun: ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూ హత్యకు కుట్ర.. భారత్‌పై అమెరికా కీలక వ్యాఖ్యలు..
వైల్డర్ తరుచుగా ఇస్లాం వ్యతిరేక వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటారు. నుపూర్ శర్మకు మద్దతు పలకడాన్ని గల్ఫ్ దేశాలు ఖండించినప్పటికీ, ఆయన ఎక్కడా వెనక్కి తగ్గలేదు. భారత్‌ని దూషిస్తూ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ) విడుదల చేసిన ప్రకటను కూడా వైల్డర్ విమర్శించారు. భారతదేశం గురించి మీరు ఏమనుకుంటున్నారో నిర్ణయించుకునే ముందు మీరు అద్ధంలో ముఖం చూసుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు షరియా చట్టాన్ని ప్రజాస్వామ్యం, మానవహక్కుల కంటే ఎక్కువగా చూస్తున్నారంటూ ఆయా దేశాలపై మండిపడ్డారు.
వైల్డర్స్ గతంలో ప్రవక్తను పెడోఫిల్ అని, ఇస్లాంని ‘ఫాసిస్ట్ భావజాలం’ అఅంటూ విమర్శించారు, వెనకబడిన మతంగా అభివర్ణించారు. నెదర్లాండ్స్‌లో మసీదులు, ఖురాన్ నిషేధానికి ఇతను అనుకూలంగా ఉన్నాడు. గతంలో ఆయన వ్యాఖ్యలపై మరణ బెదిరింపులు ఎదుర్కొన్నాడు. ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన తర్వాత వైల్డర్స్ వలసలపై ఉక్కుపాదం మోపుతానని ప్రకటించారు.