ప్రపంచీకరణతో సరిహద్దులు చెరిగిపోతున్నాయి. ఇప్పుడే కాదు ఎల్లలు లేని కళలు ఏ నాడో సాగరాలు దాటి సందడి చేస్తున్నాయి. ఈ సమయంలో మరింతగా కళలు కళకళలాడే పరిస్థితి ఏర్పడింది. సకల కళలకు వేదికగా నిలచిన సినిమా రంగం ఉత్తర, దక్షిణ – తూర్పు, పడమర భేదాలను తుడిచివేయనుందని పరిశీలకులు ఘోషిస్తున్నారు. ప్రపంచ సినిమాను శాసించిన ‘హాలీవుడ్’ చూపు ప్రస్తుతం భారతదేశం వైపు సాగుతోంది. ఇప్పుదే కాదు, తమ కళలకు, కథలకు అనువైన వాతావరణం కోసం హాలీవుడ్ పలుమార్లు…
మనలో కళ ఉండాలే కానీ, కళకళలాడే ఓ రోజు వస్తుంది. ఈ సత్యాన్ని నమ్ముకొని నవతరం నాయిక సాయిపల్లవి చిత్రసీమలో అడుగు పెట్టింది. ఆమెకు ఉన్న కళ ఏమిటంటే – నాట్యం! సంగీత దర్శకుల బాణీలకు అనువుగా తన కాళ్ళతోనూ, చేతులతోనూ నర్తనం చేసి ఆకట్టుకోగల నైపుణ్యం సాయి పల్లవి సొంతం. నృత్యంలో అనుభవం ఉన్న కారణంగా ముఖంలో భావాలను ఇట్టే పలికించగలదు. అందువల్లే సాయిపల్లవి తన పాత్రల్లోకి అతి సులువుగా ఒదిగిపోతూ కనిపిస్తుంది. సాయిపల్లవి 1992…
ప్రేమకథా చిత్రాలకు తిరుగులేదు. అందుకు నాటి ‘పాతాళభైరవి’ మొదలు ఈ నాటికీ వస్తున్న ప్రేమకథా చిత్రాలే నిదర్శనం! ఆ ఉద్దేశంతోనే దర్శకుడు జయంత్ సి.పరాన్జీ తన తొలి ప్రయత్నంగా తెరకెక్కించిన చిత్రానికి ప్రేమకథనే ఎంచుకున్నారు. దానికి ‘ప్రేమించుకుందాం…రా!’ అన్న టైటిల్ నూ నిర్ణయించారు. వెంకటేశ్ హీరోగా డి.రామానాయుడు సమర్పణలో సురేశ్ బాబు నిర్మించిన ‘ప్రేమించుకుందాం…రా!’ చిత్రం 1997 మే 9న విడుదలై విజయఢంకా మోగించింది. ‘ప్రేమించుకుందాం…రా!’ కథలోకి తొంగి చూస్తే – రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ వీరభద్రయ్యకు, రెడ్డప్ప…
ఒక ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలకు తగినట్టు భాషలు అభివృద్ధి చెందాయి. అలా మన దేశంలో దాదాపు ఇరవై వేల భాషలు ఉన్నాయి. ఐతే కొన్నిటికి మాత్రమే భారత రాజ్యాంగం అధికార భాష హోదా కల్పించింది. కనుక, ఒక భాష మరొక భాషపై ఆధిపత్యం చలాయించే అవకాశం లేదు. దేశం పట్ల మన ప్రేమను ప్రతి భాష పట్ల కూడా చూపించాలి. మన దేశంలో ప్రాంతీయత, ప్రాంతీయ భాషలకు చాలా ప్రాధాన్యం ఉంది. భాషల ఆధారంగానే రాష్ట్రాలు ఏర్పడ్డాయని…
NTV Specials : రాజన్న.. ఈ ‘వీఆర్‌ఏ’ పరిస్థితి ఎందన్న.. పేదల దైవంగా.. కోరిన కోర్కెలు తీర్చే కోడె మొక్కుల దేవుడు శ్రీరాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలోనే ఓ అవమానీయ ఘటన వెలుగులోకి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా. రెవెన్యూ విభాగంలో వీఆర్ఏగా పనిచేస్తున్న ప్రశాంత్ అధికారుల ఆదేశాలతో ప్రతిరోజు ఉదయం వేములవాడలోని ఆర్డీవో కార్యాలయాన్ని శుభ్రం చేసి తిరిగి తన విధులకు వెళ్తున్నాడు. వేములవాడలో ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు చేసి దాదాపు 10 నెలలు గడుస్తున్నా సిబ్బందిని…
ఉరుకుల పరుగుల జీవితాలు.. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రించే వరకు.. నిద్రలోనూ.. భవిష్యత్ కార్యచరణపై ఆలోచనలతో సాగిపోతున్న వేళ.. కనివిని ఎరుగని రీతిలో కరోనా మహమ్మారి దెబ్బకొట్టింది. గత రెండు సంవత్సరాల నుంచి కరోనా ధాటికి ఎన్నో కుటుంబాలు కకావికలమయ్యాయి. కరోనా దెబ్బకు అగ్రరాజ్యమైన అమెరికా సైతం కరోనా ముందు మోకరిళ్లింది అనడంలో అతిశయోక్తి లేదు. కరోనా కట్టడికి కోవిడ్ నిబంధనలు పెట్టి, ఆఖరికి ప్రజలందరి కాళ్లకు లాక్‌డౌన్‌తో బంధం వేసినా కరోనా అదుపులోకి రాలేదు.…