వైవిధ్యానికి మారుపేరుగా నిలిచారు ప్రముఖ దర్శకుడు భారతీరాజా. ఒకప్పుడు భారతీరాజా సినిమా వస్తోందంటే చాలు వైవిధ్యానికి జై కొట్టేవారందరూ థియేటర్ల ముందు క్యూ కట్టేవారు. వారి అభిరుచికి తగ్గట్టుగానే భారతీరాజా సినిమాలు రూపొందేవి. దర్శకునిగానే కాదు, నటునిగానూ కొన్ని చిత్రాలలో అలరించారు భారతీరాజా. భారతీరాజా అసలు పేరు చిన్నస్వామి. ఆయన 1941 జూలై 17న తమిళనాడులోని తేని అల్లినగరంలో జన్మించారు. బాల్యం నుంచీ భారతీరాజా కళల పట్ల ఆకర్షితుడై సినిమా రంగంలో తన ఉనికిని చాటుకోవాలని తపించేవారు.…
“ఎక్కడ పోగొట్టుకున్నామో, అక్కడే వెదుక్కోవాలి” అని సామెత. అందాల భామ కత్రినా కైఫ్ మనసు చిత్రసీమలో పారేసుకుంది. అయితే ఆరంభంలో ఆమె ఎత్తు ఓ అడ్డంకిగా మారింది. అసలు నటన రాదన్నారు. ఇంకొందరు ఐటమ్ సాంగ్స్ కు పరవాలేదన్నారు. ఇలాంటి విమర్శల నడుమ తనను తాను తీర్చిదిద్దుకొని, బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకున్న తారల్లో ఒకరిగా కత్రినా కైఫ్ జయకేతనం ఎగురవేసింది. ఆ తరువాత ఎందరికో కత్రినా స్ఫూర్తిగా నిలచింది. దేశవ్యాప్తంగా ఎనలేని అభిమానగణాలను సంపాదించుకుంది…
డి.వి.నరసరాజును చూడగానే చాలా గంభీరమైన వ్యక్తి అనిపిస్తారు. కొందరికి ముక్కోపిలా కనిపిస్తారు. ఆయన మాటకారి కాదు కానీ, ఆయన రచనలో జాలువారిన మాటలు తెలుగువారిని విశేషంగా మురిపించాయి. ‘గుండమ్మ’ను “గుండక్కా…” అని పిలిపించినదీ, ‘యమగోల’లో “తాళము వేసితిని గొల్లెము మరచితిని…” అని పలికించినదీ, “పిచ్చోడిలాగా ఏమిటి… ఖచ్చితమైన పిచ్చోడినైతే…” అంటూ శంకరం నోట ‘పెద్దమనుషులు’పై వ్యంగ్యం చిలికించినదీ నరసరాజే! దాట్ల వెంకట నరసరాజు 1920 జూలై 15న జన్మించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం తాల్లూరు నరసరాజు…
‘కథలు కరువైనప్పుడు పాత కథలనే ఆశ్రయించు’ అని పెద్దలు చెప్పారు. అదే తీరున సినీజనం కొత్తసీసాలో పాత సారాలాగా, పాత కథలకే కొత్త నగిషీలు చెక్కి ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంటారు. అలా పలుమార్లు రీమేక్ కు గురైన కథ ఏదయినా ఉందంటే, మన దేశంలో ‘దేవదాసు’ కథ అనే చెప్పాలి. ప్రముఖ బెంగాలీ రచయిత శరత్ చంద్ర ఛటోపాధ్యాయ 1901లో రాసిన ‘దేవదాసు’ నవల 1917 జూన్ 30న ప్రచురితమయింది. ఆ కథ ఆధారంగా 1928లో…
దరువేసి చిందేయించడమే కాదు, ముచ్చట గొలిపే బాణీలతో మురిపించడమూ మణిశర్మకు బాగా తెలుసు! అందుకే జనం ఆయనను ‘స్వరబ్రహ్మ’ అన్నారు, ‘మెలోడీ కింగ్’ అనీ కీర్తించారు. మణిశర్మ ఫుల్ ఫామ్ లో ఉన్న రోజుల్లో ఓ వైపు టాప్ స్టార్స్ ఇమేజ్ కు తగ్గ బాణీలు కడుతూనే, మరోవైపు యువకథానాయకులను విజయపథంలో పయనింపచేసే స్వరాలూ పలికించారు. అదే మ్యాజిక్ ఇప్పటికీ చేయగలనని అంటున్నారు మణిశర్మ. మణి శర్మ పూర్తి పేరు యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ. 1964…