నేడు సినిమా అంటే కళాసేవ కంటే కాసులపై ధ్యాసనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందరో అభిరుచిగల నిర్మాతలు మారుతున్న కాలంతో పాటు విలువలు కనుమరుగై పోవడంతో చిత్రనిర్మాణానికి దూరంగా ఉన్నారు. ఇప్పటికీ అభిరుచితో చిత్రాలను నిర్మిస్తున్న అరుదైన నిర్మాతల్లో ‘స్రవంతి’ రవికిశోర్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తన బ్యానర్ పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నారాయన. నవతరం ప్రేక్షకులకు మాత్రం స్టార్ హీరో రామ్ పోతినేని పెదనాన్నగా గుర్తుంటారు. ఏది ఏమైనా ‘స్రవంతి’ రవికిశోర్ ఈ నాటికీ తన అభిరుచికి…
చిలకలపూడి సీతారామాంజనేయులు అంటే అంతగా ఎవరికీ తెలియదు కానీ, షార్ట్ గా ‘సీఎస్సార్’ అనగానే చప్పున గుర్తు పట్టేస్తారు జనం. తనదైన వాచకాభినయంతో అలరించిన సీఎస్సార్, విలక్షణమైన పాత్రల్లో ఎంతగానో ఆకట్టుకున్నారు. నటరత్న యన్టీఆర్ కు ముందు తెలుగునాట శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రలకు పెట్టింది పేరుగా నిలచిన వారిలో సీఎస్సార్ కూడా ఉన్నారు. ఆ పై ప్రతినాయకునిగా, గుణచిత్ర నటునిగా హాస్యం పలికిస్తూ సాగిపోయారాయన. సి.ఎస్.ఆర్.ఆంజనేయులు 1907 జూలై 11న మచిలీపట్నంలోని చిలకలపూడిలో జన్మించారు. స్కూల్ చదువు…
తెలుగు చిత్రసీమలో ఎందరో హాస్యనటులు తమదైన అభినయంతో ఆకట్టుకున్నారు. కొందరు కేవలం నవ్వులే కాదు, కన్నీరు పెట్టించారు, మరికొందరు కసాయితనం చూపించీ ప్రతినాయకులుగానూ మెప్పించారు. ఆ తరహా పాత్రల్లోనూ నవ్వకుండా నవ్వులు పూయించడం అన్నది కత్తిమీద సాములాంటిది! అలాంటి సాములను అనేకమార్లు అవలీలగా చేసిన ఘనుడు కోట శ్రీనివాసరావు. ఇప్పుడంటే కోట శ్రీనివాసరావు వయసు మీద పడడం వల్ల మునుపటిలా నవ్వులు పూయించలేక పోతున్నారు కానీ, అప్పట్లో కోట పండించిన నవ్వుల పంటలు తలచుకొని ఇప్పటికీ పడిపడి…
తనకు లభించిన ప్రతీపాత్రకూ న్యాయం చేస్తూ నటించిన మహానటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు. ఆయన ఏ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినా, అందులో తన జాడ కనిపించకుండా పాత్ర నీడనే చూపించేవారు. మన దేశం గర్వించదగ్గ ‘మెథడ్ ఆర్టిస్ట్స్’లో గుమ్మడికి సైతం ప్రత్యేక స్థానం ఉంది. గుమ్మడి వెంకటేశ్వరరావు 1927 జూలై 9న గుంటూరు జిల్లా తెనాలి తాలూకా రావికంపాడు గ్రామంలో ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. గుమ్మడి వెంకటేశ్వరరావుకు బాల్యం నుంచీ ఏదో ఒక వైవిధ్యం…
తెలుగువారినీ మెప్పించిన తమిళ దర్శకుల్లో కె.బాలచందర్ స్థానం ప్రత్యేకమైనది. తన సమకాలిక దర్శకులు సైతం మెచ్చేలా చిత్రాలను తెరకెక్కించి భళా అనిపించిన ఘనుడు బాలచందర్. ఆయన సినిమాల ద్వారా పరిచయమైన ఎందరో తరువాతి రోజుల్లో తారాపథంలో జైత్రయాత్ర సాగించారు. మధ్య తరగతి జీవితాల్లోని పలు కోణాలు ఆవిష్కరిస్తూ బాలచందర్ పలు చిత్రాలు తెరకెక్కించారు. సహజత్వానికి దగ్గరగా ఉండే ఆయన చిత్రాలు ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకొనేవి. నవతరం ప్రేక్షకులు సైతం బాలచందర్ చిత్రాలను చూసి ఆనందిస్తున్నారు. ఇక ఎందరో…
చూడగానే బాగా పరిచయం ఉన్న అమ్మాయిలా కనిపిస్తుంది. కళ్ళతోనే కోటి భావాలు పలికిస్తుంది. పెదాలు విప్పితే ఆమె ముత్యాల పళ్ళు పలకరిస్తాయి. వెరసి నటి రేవతి నవ్వు ఆకర్షిస్తుంది. అభినయంతో ఆకట్టుకుంటుంది. తెలుగువారిని తనదైన అభినయంతో అలరించిన రేవతి ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలతో పరవశింప చేస్తున్నారు. రేవతి అసలు పేరు ఆశా కేలున్ని. మళయాళ సీమ కొచ్చినలో 1966 జూలై 8న జన్మించారామె. భారతీరాజా దర్శకత్వంలో రూపొందిన ‘మణ్ వాసనై’ తమిళ చిత్రం ద్వారా…
“నారాయణతే నమో నమో…” అంటూ గానం చేస్తూ ఎస్.వరలక్ష్మి ‘సతీసావిత్రి’ చిత్రంలో తొలిసారి గళం వినిపించారు మంగళంపల్లి బాలమురళీకృష్ణ. అంతకు ముందే బాలగాయకుడిగా మధురం పంచి, బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతీ రామకృష్ణనే పరవశింప చేసిన ఘనత మంగళంపల్లి వారి సొంతం. “సలలిత రాగసుధారస సారం…” అని ఆలపించి, నటరత్న నందమూరి అభినయానికి తగిన గళవిన్యాసాలు చేసి ‘నర్తనశాల’లో సుధారసమే కురిపించారు మంగళంపల్లి. ఆపై యన్టీఆర్ కే ‘శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు కథ’లో “వసంత గాలికి వలపుల రేగ…” అంటూ…
srilanka former mp Hirunika Premachandra made sensational comments on her breast . Hirunika Premachandra, Special Story, NTV Special, Latest News, Big News,