Trivikram తాజాగా మరో రెండు బిగ్ ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టినట్టుగా తెలుస్తోంది. అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ ‘అల వైకుంఠపురములో’తో తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ని సాధించాడు. ఇప్పుడు మాటల మాంత్రికుడు సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ మూవీకి దర్శకత్వం వహించనున్నాడు. ఈ బిగ్ ప్రాజెక్ట్ షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. ఈ మూవీ సంగతి పక్కన పెడితే.. త్వరలోనే త్రివిక్రమ్ మరో రెండు భారీ ప్రాజెక్టులు చేపట్టనున్నాడనే టాక్ నడుస్తోంది. అది కూడా ఇద్దరు…
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సినిమా ప్రమోషన్ల కోసం ఎవరినీ వదలిపెట్టరన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరు హీరోయిన్లతో “మా ఇష్టం” (డేంజరస్) అనే సినిమాతో ప్రేక్షకులను అలరించాడనికి సిద్ధమైపోయాడు వర్మ. ఈ నేపథ్యంలో వర్మ తాజాగా “ఆర్ఆర్ఆర్” టీంపై చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. “వెల్ సర్… మీకు రామ్ చరణ్, తారక్ వంటి డేంజరస్ బాయ్స్ ఉంటే… నాకు అప్సర రాణి, నైనా గంగూలీ వంటి డేంజరస్ అమ్మాయిలు ఉన్నారు” అంటూ…
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది… అసెంబ్లీ లోపల, బయట అనే తేడాలేదు.. విషయం ఏదైనా.. రెండు పార్టీల మధ్య తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణల పర్వం కొనసాగుతోంది.. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబుపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి… పెట్రోల్, డీజిల్ ధరలపై మాట్లాడని టీడీపీ నేతలు కరెంట్ ఛార్జీల పెంపుపై మాట్లాడుతారా? అంటూ నిలదీసిన ఆయన.. చంద్రబాబు…
ఏపీ రాజకీయాల్లో ఒకప్పుడు కీలకమైన ఆ నేత.. ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. గత ఎన్నికల్లో ఓటమి అనంతర పరిస్థితులు ఆయన్ను రాజకీయాలకు దూరం చేశాయి. ఆయన భార్య జాతీయస్థాయిలో కీలకంగా ఉండటంతో తనకెందుకు వచ్చిన రాజకీయాలు అని అనుకున్నారు. కానీ.. కుమారుడి కోసం ఆ ఆలోచన మార్చుకున్నట్టు టాక్. ఇంతకీ ఆయన దారేది? ఎవరా నాయకుడు? ఐదుసార్లు ఎమ్మెల్యే.. రెండుసార్లు ఎంపీ..!దగ్గుబాటి వెంకటేశ్వరరావు. మాజీ సీఎం చంద్రబాబు కంటే సీనియర్‌గా తెలుగుదేశం పార్టీలో ఆయన ప్రస్థానం కొనసాగింది.…
రికార్డ్స్… రికార్డ్స్… రికార్డ్స్… రాజమౌళి అంటే రికార్డ్స్… అంటే అప్పటికే క్రియేట్ అయిన రికార్డులను బ్రేక్ చేయడమే కాదు కొత్త హిస్టరీని క్రియేట్ చేస్తాడు. కెరీర్లో ఒక్కటంటే ఒక్క ఫ్లాప్ కూడా లేని దర్శకధీరుడిని చూసి ఎంతటి ఘనులైనా కుళ్ళుకోవాల్సిందే. శిల్పాలను చెక్కినట్టు సినిమాలను ఏళ్ళ తరబడి చెక్కుతాడు అనే విమర్శలు వచ్చినప్పటికీ జక్కన్న అనే పేరును సార్థకం చేసుకున్నారు రాజమౌళి. తన సినిమాను అద్భుతమైన శిల్పంలా చెక్కడంలో తనకు తానే సాటి. నాటి ‘స్టూడెంట్ నెంబర్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. RRR బ్లాక్ బస్టర్ హిట్ తో తారక్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అదే జోష్ లో నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. మరోవైపు RRRలో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ చూసి ఎంజాయ్ చేసిన తారక్ అభిమానులు సోషల్ మీడియాలో NTR 30ని ట్రెండ్ చేస్తున్నారు. వాళ్ళను మరింత హుషారెత్తించడానికా అన్నట్టుగా ఎన్టీఆర్ తాజా ఇంటర్వ్యూలో NTR 30కి సమందించిన పలు…
టీడీపీ ఆవిర్భావ సభలో సంచలన కామెంట్లు చేసిన లోకేష్ గురించి తెలుగునాట చర్చ సాగుతోంది. గతంలో తనపై వచ్చిన విమర్శలు, తన మాటతీరుపై వచ్చిన వ్యంగ్యాస్త్రాలను దాటుకుని తన స్టయిల్ మార్చేశారు చంద్రబాబు తనయుడు లోకేష్. తాను చంద్రబాబు తరహా కాదని.. మూర్ఖుడినన్నారు లోకేష్.తన మామ బాలయ్య బాబు డైలాగులతో ఆవిర్భావ సభలో ప్రసంగించిన లోకేష్ తీరుని చూసి క్యాడర్ అవాక్కవుతున్నారు. చినబాబు కెవ్వుకేక అంటున్నారు. 2024 నాటికి రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి మీద రూ. 2…
తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదలి రా.. అంటూ నలభై ఏళ్ల క్రితం 1982 మార్చి 29వ తేదీన ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపు ఓ ప్రభంజనం అయింది. ఓ విజయం మరో సంక్షోభం.. అంతకు మించి సవాళ్లు ఎన్నో ఎదుర్కొంటోంది టీడీపీ. కానీ ఎప్పటికప్పుడు కాల పరీక్షలో నిలబడుతూనే ఉంది. జాతీయ పార్టీలు తప్ప.. నలభై ఏళ్ల పాటు నిలబడిన ప్రాంతీయ పార్టీలు అరుదనే చెప్పాలి. ఒక ప్రాంతీయ పార్టీ చరిత్రలో నాలుగు దశాబ్దాలంటే తక్కువ సమయమేమీ కాదు.…
TDP Women Leader Vangalapudi Anitha Made Sensational Comments on YCP Government. ప్రాంతీయ పార్టీగా ఉంటూ అనేక రిఫామ్స్ తీసుకు వచ్చింది టీడీపీ అని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. టీడీపీ ఆవిర్భవించి 40 వంసతాలు పూర్తి చేసుకున్నందన హైదరాబాద్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వంగలపూడి అనిత పాల్గొని మాట్లాడుతూ.. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడింది ఎన్టీఆర్ అయితే ఆత్మ విశ్వాసం పెంచింది చంద్రబాబు అని ఆమె కొనియాడారు. ఏపీ…
తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ, తెలంగాణలో టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని పార్లమెంట్లో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ టీడీపీతో పాటు ఆ పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ పేరును ప్రస్తావించారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు ప్రజలకు ఆత్మగౌరవాన్ని సంపాదించిపెట్టిన ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని లోక్‌సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా టీడీపీ 40 వసంతాల పండుగ జరుపుకుంటున్న విషయాన్ని కూడా ఆయన…