“ఆర్ఆర్ఆర్” సినిమాతో అద్భుతమైన హిట్ ను అందుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, తారక్ ఫుల్ జోష్ లో ఉన్నారు. జక్కన్న మ్యాజిక్ మరోమారు వర్కౌట్ అయ్యింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు కొల్లగొడుతూ రికార్డులు కొల్లగొడుతోంది. ఇక “ఆర్ఆర్ఆర్” బ్లాక్ బస్టర్ హిట్ తో పాన్ ఇండియా క్రేజ్ ను ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు హీరోలు. ఇప్పటికే సినిమా విజయవంతం కావడంతో ఫుల్ హ్యాపీగా ఉన్న రామ్ చరణ్ యూనిట్ లో ఒక్కొక్కరికి 10 గ్రాముల గోల్డ్ కాయిన్ ఇచ్చి సంతోషంలో ముంచెత్తారు. తన గోల్డెన్ హార్ట్ తో టీం మొత్తాన్ని ఆనందంలో ముంచెత్తారు. ఇక ఇప్పుడు తాజాగా ఆడియన్స్ కు మరి సర్ప్రైజ్ ఇచ్చాడు రామ్ చరణ్.
Read Also : Yami Gautam : హీరోయిన్ సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్
ముంబైలోని బాంద్రాలో ఉన్న Gaitey థియేటర్ ను రామ్ చరణ్ ఆకస్మికంగా సందర్శించారు. ఆ థియేటర్లో సినిమా చూస్తున్న ప్రేక్షకులను సంబ్రమాశ్చర్యంలో ముంచెత్తారు. సీరియస్ గా సినిమా చూస్తున్న ప్రేక్షకుల ముందుకు సడన్ గా రామ్ చరణ్ ఎంట్రీ ఇవ్వడంతో అందరూ షాకయ్యారు. ఆ తరువాత చెర్రీని ప్రేక్షకులు సాదరంగా ఆహ్వానించారు. చెర్రీ థియేటర్ ను సందర్శించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.