RRR : బాలీవుడ్ సైలెన్స్ కు కారణమేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రికార్డ్స్… రికార్డ్స్… రికార్డ్స్… రాజమౌళి అంటే రికార్డ్స్… అంటే అప్పటికే క్రియేట్ అయిన రికార్డులను బ్రేక్ చేయడమే కాదు కొత్త హిస్టరీని క్రియేట్ చేస్తాడు. కెరీర్లో ఒక్కటంటే ఒక్క ఫ్లాప్ కూడా లేని దర్శకధీరుడిని చూసి ఎంతటి ఘనులైనా కుళ్ళుకోవాల్సిందే. శిల్పాలను చెక్కినట్టు సినిమాలను ఏళ్ళ తరబడి చెక్కుతాడు అనే విమర్శలు వచ్చినప్పటికీ జక్కన్న అనే పేరును సార్థకం చేసుకున్నారు రాజమౌళి. తన సినిమాను అద్భుతమైన శిల్పంలా చెక్కడంలో తనకు తానే సాటి. నాటి ‘స్టూడెంట్ నెంబర్ 1’ నుంచి నేటి ‘ఆర్ఆర్ఆర్’ వరకు ఏ సినిమా అయినా బ్లాక్ బస్టర్ హిట్ అంతే ! “బాహుబలి-2” సెన్సేషన్ తర్వాత ఆయన తెరకెక్కించిన “ఆర్‌ఆర్‌ఆర్” సినిమా దేశవ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఐదేళ్ల క్రితం బాహుబలితో సృష్టించిన రికార్డును ఇటు సౌత్ నుంచి అటు నార్త్ దాకా ఒక్క చిత్రం కూడా బ్రేక్ చేయలేకపోయింది. అన్నీ నాన్ బాహుబలి రికార్డులే ! ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’తో రాజమౌళి మాత్రమే ఆ రికార్డును బ్రేక్ చేశాడు.
Read Also : Macherla Niyojakavargam First Attack : మాచర్ల మాస్ మొదలు.. యాక్షన్ ప్యాక్డ్ టీజర్
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
అన్ని భాషల్లోని ప్రేక్షకులతో పాటు సెలెబ్రిటీలు కూడా సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు ‘ఆర్ఆర్ఆర్’ మేనియా నడుస్తోంది. అయితే ఈ సినిమాపై బాలీవుడ్ నోరు మెదపక పోవడం గమనార్హం. కరణ్ జోహార్, రణబీర్ కపూర్ వంటి ఒకరిద్దరు సెలెబ్రిటీలు తప్ప ఇంకెవరూ సినిమా గురించి కనీసం పెదవి కదపకపోవడానికి కారణం ఏమై ఉంటుందా? అని ఆరా తీస్తున్నారు నెటిజన్లు. ఒకవైపు థియేటర్లలో నార్త్-ఇండియా అభిమానుల హంగామా వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ సెలెబ్రిటీలు మాత్రం సినిమాపై మౌనం వహిస్తున్నారు. సినిమాలో హీరోయిన్ గా నటించిన అలియా కూడా పెద్దగా స్పందించలేదు. మరి దీనికి కారణం, అర్థం ఏంటో !?
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!