(ఏప్రిల్ 11తో జూ.యన్టీఆర్ కెరీర్ కు 25 ఏళ్ళు) నందమూరి నటవంశంలో మూడోతరం స్టార్ హీరోగా జేజేలు అందుకుంటున్నారు యంగ్ టైగర్ యన్.టి.ఆర్. రాజమౌళి తాజా చిత్రం `ఆర్.ఆర్.ఆర్.`లో నటనాపరంగా అధిక మార్కులు పోగేసుకున్నది యన్టీఆర్ అని జనం ముక్తకంఠంతో ఘోషిస్తున్నారు. కొమురం భీమ్ పాత్రలో జీవించిన యంగ్ టైగర్ ఈ యేడాది ఏప్రిల్ 11తో నటునిగా పాతికేళ్ళు పూర్తి చేసుకుంటున్నారు. ఆ మాటకొస్తే మరింత పసివయసులోనే తాత నటరత్న యన్టీఆర్ తెరకెక్కించిన హిందీ `బ్రహ్మర్షి విశ్వామిత్ర`లో…
దిగ్గజ దర్శకుడు రాజమౌళి మ్యాగ్నమ్ ఓపస్ మూవీ RRR విడుదలైన 16 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మరో బెంచ్ మార్క్ సెట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల కలెక్షన్లు రాబట్టేసిన ఈ చిత్రం ఇప్పటికే ఆ రికార్డును అందుకున్న దంగల్, బాహుబలి 2 రికార్డులను సైతం బ్రేక్ చేశారు. ఈ సందర్భంగా రానా దగ్గుబాటి ట్విట్టర్‌లో చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. “వన్ ఇండియా వన్ సినిమా అనేది ఒక వ్యక్తి వచ్చి, ఇది ఇలా…
కెజిఎఫ్ చిత్రంతో ఒక్కసారిగా పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమా విజయంతో టాలీవుడ్ లో కెర్స్ తెచ్చుకున్న ఈ డైరెక్టర్ ప్రస్తుతం స్టార్ హీరోలందరితో సినిమాలు చేస్తూ బిజీగా మారాడు. ఇక టాలీవుడ్ లో ఈ డైరెక్టర్ తీస్తున్న చిత్రాలలో క్రేజియెస్ట్ కాంబో గా నిలిచింది మాత్రం ఎన్టీఆర్ తోనే అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కెజిఎఫ్ 2 రిలీజ్ కి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. …
(ఏప్రిల్ 9న ‘డాక్టర్ – సినీయాక్టర్’కు 40 ఏళ్ళు) తాను అభిమానించే వారినే ఎవరైనా ఆదర్శంగా తీసుకుంటారు. ఓ దశకు వచ్చాక వారితోనే పోటీపడాలనీ ఆశిస్తారు. ఎందుకంటే, తన ఆదర్శమూర్తితో తాను సరితూగాలని ప్రతి అభిమానికీ అభిలాష ఉంటుంది. అలాంటి కోరికతోనే హీరో కృష్ణ చిత్రసీమలో అడుగు పెట్టారు. చిన్నతనంలో తాను ఎంతగానో అభిమానించిన మహానటుడు యన్టీఆర్ తో కలసి నటించారాయన. ఆ సంతోషం చాలక, రామారావు సినిమాలు విడుదలయ్యే సమయంలోనే తన చిత్రాలనూ రిలీజ్ చేసి…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మర్చి 25 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని నమోదు చేసుకోవడమే కాకుండా 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన తొలి సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సందర్భంగా ముంబైలో హిందీ డిస్ట్రిబ్యూటర్ పెన్ స్టూడియోస్ జయంతి లాల్ గడ గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో…
RRR విడుదలైనప్పటి నుండి ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రల గురించి చర్చలు జరుగుతున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మ్యాగ్నమ్ ఓపస్ లో రామ్, భీమ్ పాత్రలను, ఆయా పాత్రల హీరోయిజాన్ని సమానంగా చూపించినప్పటికీ, ఆ విషయంలో టాక్ మాత్రం విభిన్నంగా నడుస్తోంది. కొందరు ఎన్టీఆర్ కంటే చరణ్‌కు మంచి పాత్ర లభించిందని అంటే, మరికొందరేమో చరణ్‌ని డామినేట్ చేస్తూ సినిమా మొత్తాన్ని ఎన్టీఆర్ తన భుజాలపై వేసుకున్నాడని అంటున్నారు. ఏదేమైనా ఇద్దరు హీరోలు మాత్రం తమ…
దర్శక దిగ్గజం రాజమౌళి మ్యాగ్నమ్ ఓపస్ మూవీకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. మరోవైపు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో చిత్రబృందం సైతం సంతోషంగా ఉన్నారు. బుధవారం రాత్రి ముంబైలో సినిమా హిట్ అయిన సందర్భంగా “ఆర్ఆర్ఆర్ సక్సెస్ పార్టీ”ని నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ త్రయం ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. మీడియా సమావేశంలో స్టార్ హీరోలిద్దరూ “ఆర్ఆర్ఆర్” సీక్వెల్ ఉండాలని కోరుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ…
RRR మార్చి 24న థియేటర్లలో విడుదల కాగా, ఇప్పటికి ఈ సినిమా సృష్టించిన సంచలనం ఇంకా తగ్గనే లేదు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు అలియా భట్, అజయ్ దేవగన్, శ్రియా శరణ్ కీలక పాత్రల్లో నటించారన్న విషయం తెలిసిందే. దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో చిత్రబృందం ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. అందులో భాగంగానే ఏప్రిల్ 6న ముంబైలో ‘ఆర్ఆర్ఆర్ సక్సెస్…
RRR Success Celebrations బుధవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. రాజమౌళి మాగ్నమ్ ఓపస్ RRR ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే ఒక్క భారతదేశంలోనే కాకుండా సినిమాకు విదేశీ సినీ ప్రియుల నుంచి కూడా అద్భుతమైన స్పందన లభించింది. ఏప్రిల్ 6న జరిగిన RRR Success Celebrationsలో మీడియాతో మాట్లాడిన రాజమౌళి…
RRR బ్లాక్ బస్టర్ హిట్ తో చిత్రబృందం ఫుల్ ఖుషీగా ఉంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్ కీలక పాత్రల్లో పోషించగా, దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో బాక్సాఫీస్ వద్ద ‘ఆర్ఆర్ఆర్’ మూవీ చరిత్ర సృష్టించింది. ఇక ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ టీం సినిమా విజయాన్ని పురస్కరించుకుని సంబరాల్లో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. తాజాగా ముంబైలో RRR Success Celebrations…