Alia Bhatt: ఆర్ఆర్ఆర్ పోస్టులు డిలీట్.. క్లారిటీ ఇచ్చిన సీత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎట్టకేలకు మార్చి 25 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. రికార్డుల కలెక్షన్స్ అందుకుంటున్న ఈ సినిమా గురించి గతకొన్నిరోజులుగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో సీతగా నటించిన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, రాజమౌళి పై అలక పూనిందని, తనకు ఆశించిన ఫలితం రాకపోయేసరికి తన సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ పోస్టులను డిలీట్ చేసేసిందని వార్తలు గుప్పుమన్నాయి. ఇక ఈ వార్తలు ఆ నోటా ఈనోటా పాకుతూ అలియా భట్ వరకు వెళ్లడంతో ఆమె ఈ పుకార్లకు చెక్ పెట్టింది.
” ఆర్ఆర్ఆర్ టీమ్ వలన నేను అప్సెట్ అయ్యానని, అందుకే ఆర్ఆర్ఆర్ పోస్ట్లు డిలీట్ చేశానని ఈరోజుఎవరో నాతో అన్నారు. దయచేసి ఇది నా మనవి.. ఇంస్టాలో జరిగేవాటిని బట్టి ఎలాంటి ఊహాగానాలు పెట్టుకోకండి. ఎప్పటికప్పుడు నా ఇన్స్టాగ్రామ్ లో నేను చాలావాటిని డిలీట్ చేస్తూ ఉంటాను.. ఎందుకంటే నాకు చిందరవందరగా ఉంటె నచ్చదు.. అందుకే తక్కువ పోస్ట్లు ఉండేలా చూసుకుంటాను. నేను ఆర్ఆర్ఆర్ ప్రపంచంలో భాగమైనందుకు ఎంతగానో గర్విస్తున్నాను. సీత పాత్ర నేను ప్రేమించి చేశాను.. రాజమౌళి సర్ తో వర్క్ చేయడం నేను చాలా ఇష్టపడ్డాను. ఇక చరణ్, తారక్ తో కలిసి పనిచేయడం నాకెంతో ఇష్టం. ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన ప్రతిదీ నేనెంతో ఇష్టపడి చేశాను. ఈ విషయం నేను చెప్పడానికి కారణం కేవలం రాజమౌళి సర్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారు.. ఎన్నో ఏళ్లు ఈ సినిమా కోసం పనిచేశారు. అలాంటిది న వలన ఈ సినిమా గురించి తప్పుగా మాట్లాడుకోవడం, మిస్ యూజ్ చేయడం లాంటివి జరగకూడదని చెప్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక దీంతో ఈ వార్తలకు చెక్ పడినట్లే అని తెలుస్తోంది.
Also Read
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!