నిజామాబాద్ జిల్లాలో ఐటీ, మున్సిపల్, పరిశ్రమలశాఖ మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా.. నగరంలో ఐటీ టవర్ ను ప్రారంభించారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు కోరుకునేది అభివృద్ధి సంక్షేమమని తెలిపారు. ఎన్నికలు వస్తే సంక్రాంతి గంగిరెద్దుల వచ్చినట్లు వస్తారు.. జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ అన్నారు. సమైక్య పాలనలో తెలంగాణ అగమైందని.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాడ్డాక తెలంగాణలో ప్రతి వర్గం సంతోషంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉండటం కొందరికి నచ్చడం లేదని.. అందుకోసం లేనిపోని మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
Kethika Sharma : మత్తెక్కించే పరువాలతో రెచ్చగొడుతున్న బ్రో బ్యూటీ..
నిరుద్యోగ యువతకు ఓ వైపు శిక్షణ మరో వైపు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న నేతలే కలకాలం గుర్తుండిపోతారని ఆయన తెలిపారు. ప్రజల కోసం పనిచేసే వారినే వచ్చే ఎన్నికల్లో గెలిపించండని కోరారు. గతంలో పెద్ద పెద్ద నాయకులు ఎమ్మెల్యేలుగా గెలిచినా ప్రజలను పట్టించుకోలేదని.. సమైక్య పాలనలో తెలంగాణ ఆగమైందని కేటీఆర్ అన్నారు. వరి సాగులో నేడు తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని తెలిపారు. కేసీఆర్ విధానాల వల్లే నేడు నిండా చెరువులు పచ్చని పంటలు కనిపిస్తున్నాయని కేటీఆర్ అననారు
ISRO Recruitment 2023: టెన్త్ అర్హతతోఇస్రోలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..
అంతేకాకుండా.. ఎంపీ ధర్మపురి అర్వింద్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. నిజమాబాద్ ఎంపీ చిల్లరగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. నిజమాబాద్ ఎంపీ సంస్కారంగా మాట్లాడాలని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అర్వింద్ ఎక్కడ పోటీ చేసినా.. డిపాజిట్ కొల్లగొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ పేర్కొన్నారు. 70 ఏళ్ల వయస్సున్న కేసీఆర్ ను నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలిపారు. ధరలు పెంచిన బీజేపీ నేతలను నిలదీయండని అన్నారు. మరోవైపు 50 ఏళ్ళు అధికారం ఇస్తే కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. మళ్ళీ ఒక్క చాన్స్ అంటూ వస్తున్నారని.. 3 గంటల కాంగ్రెస్ కావాలా.. 3 పంటల కేసిఆరా.. మతం మంటలు పెడుతున్న బీజేపీ కావాలా అని కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా.. నిజమాబాద్ కు రూ.60 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు.