D.Srinivas: సీనియర్ నేత డీఎస్‌కు తీవ్ర అస్వస్థత.. ఐసీయూలో చికిత్స
- Follow Us :
-
-
Add as a preferred
source on google
D.Srinivas: పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డి.శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం డి.శ్రీనివాస్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. డీఎస్ గతంలో బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై పక్షవాతానికి గురయ్యారు. అయితే దీంతో డి.శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉందని, ప్రత్యేక వైద్యుల బృందం చికిత్స అందిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. డీఎస్ ఆరోగ్య పరిస్థితిపై పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
Read also: Kitchen Tips: ఈ చిట్కాలతో వంటింట్లోకి ఈగలు రానే రావు..
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరున్న నాయకుడు డి.శ్రీనివాస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం పనిచేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేయడమే కాకుండా ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. వై.ఎస్. రాజశేఖరరెడ్డి, పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. 2004 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పీసీసీ అధ్యక్ష పదవిలో డీఎస్ పాత్ర కీలకమనే చెప్పాలి. అప్పట్లో డీఎస్ పేరు కూడా సీఎం అభ్యర్థిగా ప్రచారంలోకి వచ్చింది. తెలంగాణ ఏర్పడిన కొద్దిరోజులకే సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు డీఎస్ కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ ఎస్ పార్టీలో చేరారు. టీఆర్‌ఎస్‌లో డీఎస్‌కు కేసీఆర్ పెద్దపీట వేశారు. కొద్ది కాలానికే రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్ అధినాయకత్వం, డీఎస్ మధ్య విభేదాల కారణంగా టీఆర్‌ఎస్ పార్టీకి డి.శ్రీనివాసరావు దూరంగా ఉంటున్నారు. అయితే ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం ఆరోగ్యం విషమించడంతో సిటీ న్యూరో ఆస్పత్రికి తరలించారు. డీఎస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారనే వార్తలతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Free Ration: రేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఫ్రీగా బియ్యం, గోధుమలతో పాటు పంచదార
- Tags
- BRS
- cm kcr
- congress
- d.srinivas
- Nizamabad
తాజావార్తలు
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!