PM MODI: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయ పార్టీల హడావుడి మామూలుగా లేదు. ఇప్పటికే.. కలెక్టరేట్ల ప్రారంభోత్సవం పేరుతో సీఎం కేసీఆర్ ఆయా జిల్లాలకు వెళ్లి భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రచారాన్ని ప్రారంభించారు. నిన్న పాలమూరు-రంగా రెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో. ఇదిలా ఉంటే రెండు జాతీయ పార్టీలు కూడా దూకుడు పెంచాయి. కేంద్ర హోంమంత్రి ఇప్పటికే పలుమార్లు తెలంగాణలో పర్యటించి తనదైన శైలిలో బీజేపీలో ఉత్సాహాన్ని పెంచుతున్నారు. ఇప్పుడు నేరుగా ప్రధాని మోదీ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటించనున్నట్లు సమాచారం. అక్టోబర్‌లో ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. అక్టోబర్ మొదటి వారంలో మోడీ పర్యటన ఉండే అవకాశం ఉంది. అక్టోబరు 2, 3, 4 తేదీల్లో తెలంగాణలో మోడీ పర్యటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Read also: Malla Reddy: పిల్లలకు 500 నోటు చేతిలో పెట్టిన మల్లన్న.. కండిషన్స్ అప్లై
రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో నిర్వహించే పార్టీ బహిరంగ సభల్లో మోడీ పాల్గొంటారని సమాచారం. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ప్రధాని మోదీ రోడ్ షో జరిగే అవకాశం ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. తెలంగాణ రాజకీయాల్లో మోడీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకోనుంది. మోడీ పర్యటనకు ముందే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా కూడా వెలువడే అవకాశం ఉన్నందున.. మంచి ఊపు వస్తుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే రెండు రోజులుగా హైదరాబాద్ లో కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం ఉండగా.. నేడు తుక్కుగూడలో విజయ భేరి పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అంతేకాదు.. ఆరు హామీలను ప్రకటించి తెలంగాణ ఎన్నికల్లో శంఖారావం పూరించారు. దీంతో తెలంగాణలో ఎన్నికల హడావుడి ఊపందుకున్నట్లు కనిపిస్తోంది.
Happy Days : రీ రిలీజ్ కాబోతున్న కల్ట్ క్లాసిక్ మూవీ..?